బుధవారం, ఆగస్టు 29, 2012
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ప్రజలు పాటిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు. "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట". అని ఇంకా "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది. ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ఇది ఎంతో గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .
ఆదివారం, ఆగస్టు 26, 2012
మదర్ థెరీసాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 26
, 1910
– సెప్టెంబరు 5
, 1997
) మాసిడోనియాలో
అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపింది. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము
లభించింది. ఈమెకు తరవాత భారతదేశ ప్రభుత్వం కూడా 1980లో భారతరత్నను
ప్రకటించింది. ఈరోజు మదర్ థెరీస జయంతి సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.
బుధవారం, ఆగస్టు 22, 2012
మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొకడు
ఒకని కంచములోనిదొడిసి చయ్యనమ్రింగి చూడలేదని నోరు చూపు నొకడు
యేగురార్గులు చల్దులెలమి పన్నిదమాడి ఊర్కొని కూర్కొని కుడుచునొక్కడు
యిన్ని యుండగ పంచియిడుట నెచ్చెలితనమనుచు బంతెనగుండులాడునొకడు
కృష్ణు చూడుమనుచు కికురించి పలుమ్రోల మేలిభక్ష్యరాసి మెసగునొకడు
నవ్వునొకడు సఖుల నవ్వించు నొకడు ముచ్చటాడు నొకడు మురియునొకడు
(పోతన భాగవత పద్యం )
అచ్చపురాల యమునలోపల
ఇచ్చగించి భుజియించితి కృష్ణ
ఊరుగాయలును నొద్దికచద్దులును
నారగింపుచును నందరిలో
సారె బాలుల సరసాల తోడ
కోరి చవులు గొంటివి కృష్ణా
ఆకసంబున కాపుర ముఖ్యులు
నాకలోకపు నాందులును
కైకొని యజ్ఞకర్తయాతడని
జోక గొనియాడఁ జొక్కితి కృష్ణా
పేయలు లేవు పిలువుడనుచు
కోయని నోరఁగూతలును
మాయల బ్రహ్మము మతము మెచ్చుచు
చేయని మాయలు సేసితి కృష్ణా
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ