Blogger Widgets

మంగళవారం, ఆగస్టు 06, 2013

అలెగ్జాండర్ @ పెన్సిలిన్

మంగళవారం, ఆగస్టు 06, 2013

పెన్సిలిన్ ఇంజక్షన్ పేరు విననివారు ఉండరు. సర్వ రోగ నివారిణిగా పెన్సిలిన్ ను ఇప్పటికీ తిరుగేలేదు. ఇట్టి పెన్సిలిన్ ను కనుగొన్నవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928 లో ఈ బాక్టీరియాలజిస్టు పెన్సిలిన్ కనుక్కొని లోకానికి గొప్ప ఉపకారం చేసిన వాడయ్యాడు.  

అలాంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జీవిత విశేషాలు గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాం.  

స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన  1881 ఆగస్టు 6న జన్మించారు. అంటే ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు  .  ఈయన 1923లో లైసోజేమ్‌ అనే ఎంజైమును కనిపెట్టాడు.  1928లో పెన్సిలిన్‌ అనే యాంటిబయాటిక్‌ను కనిపెట్టాడు.  పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి శకాలు(Antibiotic). వీటిని బాక్టీరియా కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.  ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.  మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.  1999లో టైమ్స్‌ పత్రిక ఫ్లెమింగ్‌ను 20వ శతాబ్దంలోని 100 ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా కీర్తించింది.  ఫ్లెమింగ్‌ పెడింగ్టన్‌లోని సెయింట్‌ మెరీస్‌ హాస్పిటలు వైద్య పాఠశాలలలో ఎంబిబిఎస్‌ చదివారు.  ఫ్లెమింగ్‌ సిప్టమర్‌ మేరియన్‌ మెకెల్రాట్‌ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు.  ఫ్లెమింగ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఆర్మి మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌గా పనిచేశారు. యుద్ధ భూమిలో చాలా మంది సూక్ష్మజీవుల బారినపడి చనిపోవడం ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కనిపెట్టడానికి ప్రేరణ.  పెన్సిలిన్‌ సృష్టి ఆధునిక వైద్యశాస్త్ర గమనాన్నే మార్చివేసింది. పెన్సిలిన్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు కాపాడింది. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది.  పెన్సిలిన్‌ స్కార్లెట్‌ ఫీవర్‌, న్యుమోనియా, మెనింజైటిస్‌, డిఫ్తీరియా, గొనోరియాపై బాగా పనిచేస్తుంది.  ఫ్లెమింగ్‌కు రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌, ఇంగ్లాడు హంటేరియన్‌ ప్రొఫెసర్‌ షిప్‌ ఇచ్చింది.  ఫ్లెమింగ్‌ 11.3.1955న గుండెపోటుతో మరణించారు.   వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వంటి శాస్త్రవేత్తను ఆదర్సవంతముగా  .   శాస్త్రవేత్త   అంటే నాకు చాలా ఇష్టం.  నాకు మంచి inspiration గా అనిపిస్తుంది.  అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి శుభాకాంక్షలు 

శనివారం, ఆగస్టు 03, 2013

స్నేహానికన్న మిన్న

శనివారం, ఆగస్టు 03, 2013

స్నేహం అంటే చాలా గొప్పబంధం. అలాంటి బంధం గురించి వర్ణించటం ఎవరి తరంకాదు . దానికి హద్దులు , ఎల్లలు వుండవు. మనకు అతి దగ్గర సన్నితులు కేవలం స్నేహితులు మాత్రమే. ఆతరువాతె ఎవరైనా. ఆఖరికి మన అమ్మానాన్నలైనా సరె. స్నేహితులు తరువాత.
స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.  స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. సృష్టిలో నా అనేవారు,బంధువులు లేని వారైన ఉంటారేమే గాని స్నేహితులు లేని వారుండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం. అదే స్నేహం.  స్నేహితులతో కలిసి ఉంటే ఎంతో ఆనందం మనతోనే ఉంటుంది.
ప్రతిఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున ప్రపంచమంతా 'ఫ్రెండ్‌షిప్‌ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు.  ఇక్కడ ఒక మంచి పాట  స్నేహం గురించి. 
  
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడదాకా నీడ లాగ నిను వీడి పోదురా
ఈ గుండెలో పుచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమోకటేనురా ...

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా...ఓ...
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహామే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేను రా
సందేహమే లేదు రా ...

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం...ఓ...
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ద్రువతార లా స్థిరమైనదీ...ఈ జగతిలో విలువైనదీ...
ఈ స్నేహమోకటేనురా ...

స్నేహం గురించి ప్రముఖులు ఏమన్నారో తెలుసుకుందాం.  వారి మాటలను దృష్టిలో పెట్టుకుందాం  మరి.  
Everyone need Friendship

  • స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- చింగ్‌చౌ
  • శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - వివేకానందుడు
  • విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు - గౌతమబుద్ధుడు
  • మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు - గురునానక్
  • కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది - గాంధీ
  • అహంకారి కి మిత్రులుండరు - ఆస్కార్‌వైల్డ్
  • ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం - గాంధీ
  • ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం -కార్డినల్‌న్యూమాన్
  • చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం - మార్టిన్ లూథర్‌కింగ్
  • నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన నీ స్నేహితుడు - బెంజిమన్ ఫ్రాక్లిన్
  • మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు - స్వీడెన్ బర్గ్
  • మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు - లియోటాల్‌స్టాయ్
  • మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు - సెయింట్ బెర్నార్డ్ 
  • స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు - రెవన్థ్ ఛొవ్దరీ

ఇలా ఒక్కొక్కరు మంచి స్నేహితుని గురించి వర్ణించారు.      స్నేహాన్ని అభివర్ణించటం చాలా కష్టం .

ఈరోజు స్నేహితుల దినోత్సవమే కాకుండా ఈరోజుకు ఇంకో ప్రత్యేకత వుంది అది ఏమిటంటే  sister's day. అన్నదమ్ములు మంచి స్నేహితులుగా వుండవచ్చు వుండకపోవచ్చు.  అక్కచెల్లులు  మాత్రము మంచి స్నేహితులుగా వుంటారుట .  
సరే మరి ఈరోజు friendship day  మరియు sister's  day  శుభాకాంక్షలు.

శుక్రవారం, ఆగస్టు 02, 2013

భారతదేశానికొక జాతీయ జెండా

శుక్రవారం, ఆగస్టు 02, 2013

శ్రీ  పింగళి వెంకయ్య గారు  మన జాతి మొత్తం గుర్తుచేసుకొని గర్వించగల మహామనిషి అందులోను ఈయన మన ఆంద్రుడు. ఈయన జన్మ్దదినము ఆగష్టు 2వ తారీకున.వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు  గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు.  ఈయన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త .

1916 సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.  లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ, వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం- ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు.  మహాత్ముని సూచనపై కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్యన రాట్నం చిహ్నం గల జాతీయ జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం కోత్త ఆలోచన మీద, సత్య- అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగును కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి అందించారు. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం చిహ్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్పురింప చేస్తుందన్నారు. అంటే కార్మిక కర్షకులపై ఆధారపడిన మన దేశం, సత్యాహింసలపై ఆధారపడటంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.1947జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ , మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నం మాత్రం వదిలి, దాని బదులు అశోకుని ధర్మచక్రం చిహ్నంగా యిమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే శ్రీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం. శ్రీ  పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రాధాన పాత్రధారిగా ఉన్నాడు.  గాంధీజీ ప్రోద్భలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. మన జాతికొక పతాకం కావాలని, అదీ ఒక ఆంధ్రుని ద్వారా రూపొందిచడటం , ఆంధ్రులందరికీ గర్వకారణమైన విషయం. .జాతీయ పతాకం రెప రెప ఎగిరినంతకాలం వరకు స్మరించుకోదగిన ధన్యజీవి శ్రీ పింగళి వెంకయ్య . ఆయన జన్మదినము నాడు ఆయన గురించి తెలుసుకొని వివరిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. 
జైహింద్ 

గురువారం, ఆగస్టు 01, 2013

జీన్ బాప్టిస్ట్ లామార్క్

గురువారం, ఆగస్టు 01, 2013

ఫ్రెంచి జీవశాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్ 1744 ఆగస్టు 1 న జన్మించాడు.
జీవ పరిణామవాదాన్ని మొట్ట మొదట ప్రతి పాదించింది. ఈయనే, ఈయన సిద్దాంతం ప్రకారం మొక్కలు జంతువులు పరిసరాలకు తగినట్లు తమ ఆకారాలు మార్చుకుంటాయని, ఆ మార్పులు వాటి తర్వాత తరాలకు సంక్రమిస్తాయని వివరించాడు. ఆయన సిద్దాంతంలోని 2 ముఖ్య సూత్రాలు ఏమిటంటె
1. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం ఉదాః ఎత్తయిన చెట్ల ఆకులు అందుకోవడాని జిరాఫీ మెడసాచి, సాచి అలా పొడవు పెరిగింది.
2. ఆర్జిత గుణాల అనువంశికతః జీవులు తాము పొందిన లక్షణాలనే తర్వాత తరాలకు అందిస్తాయనేది ఈ సిద్దాంత సారాంశం.

ఉదాః మెడపొడవైన జిరాఫీలు ఆ లక్షణాన్ని తమ తర్వాత తరాలకు అందిస్తాయి.
ఈయన సిద్ధాంతాలు తిరస్కరించబడినా, ఆ తర్వాత డార్విన్ లాంటి జీవపరిణామ సిద్దాంత వేత్తల్లో ఆలోచనలను తండ్రి ఒక మతపరమైన స్కూలులో చేర్పించాడు. లామార్క్ మతసంబంధ విషయాలేమీ రుచించలేదు. మత పాఠశాలను వదిలి, మెలిటరీలో చేరి ఫ్రెంటి సరిహద్దు దళంలో అనేక స్థావరాలలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఫ్రాన్స్ లో గల సకల వృక్షజాతుల గురించి, పూర్తిగా అధ్యయనం చేసే అవకాశం లామార్క్ కు లభించింది. లామార్క్ కు చిన్నప్పటి నుండి శాస్త్రం అంటే చాలా ఇష్టం.

సైన్యంలో చేరిన తొమ్మిదేళ్ళకు ఆరోగ్య క్షీణించడంతో మిలటరీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు వైద్య శాస్త్రం రసాయన శాస్త్రం అభ్యసించాడు. జీవపరిణామ సిద్దాంతానికి పునాదులు వేశాడు.
లామార్క్ వ్యక్తి గత జీవితం, పేదరికం, విషాదంతో ముగిసింది. 1829 మరణించాక ఆయన, పుస్తకాలు, సేకరించిన వస్తువులు, గవ్వలు వేలంవేసి ఆ డబ్బుతో దహనక్రియలు జరపాల్సి వచ్చింది..  అతని గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా వుంది. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)