Blogger Widgets

శనివారం, ఆగస్టు 31, 2013

ఆట పాటల మేటి ఆదిభట్ల

శనివారం, ఆగస్టు 31, 2013


 హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.  ఈయన పూర్తి పేరు  అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.  ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి.  చిన్న తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు.  ఈయన అష్టావధానిగా రాణించారు.  మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు హరికథసృష్టి చేశారు. వారు హరికథను సర్వ కళల సమాహారంఅని అభివర్ణించారు. నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి చేర్చారు.  ఈ కళా రూపాన్ని సృష్టించిన నారాయణ దాసు గారు తెలుగులోనూ,  సంస్కృతంలోను,  అచ్చతెలుగులోను హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణంపేర శ్రీరామ కథ, తెలుగు హరికధలుహరికధామృతం పేర శ్రీకృష్ణుని కథ సంస్కృతం హరికధలు మరియు గౌరాప్పపెండ్లి  హరికథ ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ)జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథకు ప్రాణం వంటిది ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు.  అయన సౌండ్ కంచు మోగినట్టు గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు అని చెప్పుకోవచ్చు. ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం నారాయణ దాసుగారికి సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరమరియు హరికథ పితామహలాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వరబిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే పంచముఖిఅంటారు.  ఈ ప్రజ్ఞను కూడా అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతిఅనడం అతిశయోక్తి కానే కాదు.   నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని గౌరవించి భారతి తీర్థ, ‘ఆట పాటల మేటిఅనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది. ఆదిభట్ల నారాయణదాసుగారు  2 జనవరి 1945 న మరణించారు.  
శ్రీ కృష్ణ మాయ హరికధ 
 ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైనఅనన్య సామాన్యమైనఅనితర సాధ్యమైనఅజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం.  హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి సందర్బంగా  వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం.   హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.  

గురువారం, ఆగస్టు 29, 2013

ఆంద్రామృతం బ్లాగుకు ఆరవ సంవత్సర శుభాకాంక్షలు

గురువారం, ఆగస్టు 29, 2013

మా తాతగారు  చింతా రామకృష్ణారావు గారు రాస్తున్న ఆంధ్రామృతం బ్లాగుకు పూర్తిగా ఆరు సంవత్సరములు నిండింది. తాతగారు బ్లాగ్ లో తెలుగు పదాలతో అందమైన  తెలుగు పద్యాలు తో బాగారాస్తున్నారు. మనం బ్లాగు లోకి ప్రవేశించే సరికి 

గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి.కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! . అను అందమైన తెలుగు పద్యముతో మనకు స్వాగతము పలుకుతుంది. మొదటి పోస్ట్ .  రాసినప్పటికీ తాతగారికి అస్సలు కంప్యుటర్ గురించి పెద్దగా అవగాహన లేదు.  అలా అలా చాలా పోస్ట్లు పెట్టారు.  ఇలా ఆరుసంవత్సరాలు ఎంతో కృషి చేసి మంచి మంచి పోస్ట్లు పెట్టారు.  ఎన్నో ఎన్నెనో పరిశోదనలు చేసారు .  ఎన్నో వర్గాలు పేరుతో పద్యాలు రాసారు .  అందరి అభిమానాన్ని పొందారు .  చాలా మందిని అనుచరులు గా పొందారు. ప్రస్తుతము వరకు  120698 మంది ఆంధ్రామృతం బ్లాగును వీక్షించారు . ఎంతో మందికి పద్య రచన మీద మంచిగా అవగాహన కలిగించారు.  వారికి ఉత్సాహాన్ని కలిగించారు.  మా తాతగారు ఇంకా ఇలానే చాలా సంవత్సరాలు బ్లాగు ఇలానే ఉత్సాహంగా రాయాలని కోరుకుంటూ . తాతకి మరియు ఆంద్రామృతం బ్లాగు కు ఆరవ సంవత్సర మరియు ఈరోజు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 

అమ్మ పాడిన లాలిపాట మన మాతృభాష

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ , ఓ , ఔ,  అం ,  క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ,  య, ర, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష, ఱ
మాతృభాష అమ్మ బొజ్జలో వున్న
పసిపాపకు తెలిసిన భాషే.
అమ్మ పాడిన లాలిపాట మన మాతృభాష.
తేనెలతేటల మాటలుకూర్చి
వీనులకు విందు కలుగజేయు భాష
మంచి ముత్యాల్లా కూర్చిన పేట 
అందమైన బంతిపూలతోట
మన భాష  తెలుగు భాష
దేశభాషలందు తెలుగులెస్స!

మాతృభాష మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష (తెలుగు) మాతృభాష. దీనినే ప్రధమ భాష లేదా మొదటి భాష గా చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, మరియు భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రధమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రధమ భాషగా గల వారు కానవస్తారు. ఇదే ప్రాంతీయ భాష గా ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ భాష "తెలుగు".  మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటిని సవ్యంగా అర్ధం చేసుకోవాలంటే మాతృభాష సహకారంతోనే సాద్యం.  

శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స” 

శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది. 
ఈరోజు మాతృభాషా దినోత్సవం గా జరుపుకుంటున్నాం. అసలు ఈరోజె ఎందుకు చేసుకుంటున్నాం అంటే
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తిగ్రాంధికభాషలోఉన్న
 తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చినిత్య వ్యవహారంలోని భాషలోఉన్న అందాన్నీవీలునూ తెలియజెప్పిన మహనీయుడుఆంధ్రదేశంలో వ్యావహారికభాషోద్యమానికి మూలపురుషుడుబహుభాషా శాస్త్రవేత్తచరిత్రకారుడు,సంఘసంస్కర్త,హేతువాదిశిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికిచిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగుగిడుగు ఉద్యమంవల్ల కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగిఅందరికీ అందుబాటులోకివచ్చిందిపండితులకే పరిమితమైన సాహిత్యసృష్టిసృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీవీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గాజరుపుకుంటున్నాము.  గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషాదినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు  ప్రజలు పాటిస్తున్నారు
విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు.  "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట".  అని ఇంకా  "రామ్మూర్తి పంతులవాదాన్ని అర్థం చేసుకోకదురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
 రోజు సభలు జరిపిపదోతరగతిఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్నవిద్యార్థులకు ప్రోత్సాహకాలనితెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలుఅందచేస్తున్నాయిప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు.ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది.  ప్రపంచీకరణవలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తిచూపుతున్నారుప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములోచదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి.  ఇది ఎంతోగొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.  
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ , ఓ , ఔ,  అం ,  క, ఖ, గ, ఘ, ఙ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ,  య, ర, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష, ఱ

బుధవారం, ఆగస్టు 28, 2013

శ్రీ కృష్ణాయ ఇదం నామమ! శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

బుధవారం, ఆగస్టు 28, 2013


శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !
ఈ  భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం.  శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన
వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణజన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల నల్ల బాలుడు చేతిలో వెన్న పట్టుకుని వున్న యశోదనందనుడు చిన్ని కృష్ణుడు  గుర్తు వచ్చేస్తాడు.  శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో  ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన  చెరసాలలో జన్మించాడు. 
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు
,
 కీర్తనలు పాడతారు.   వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
  దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా శ్రీ కృష్ణుడు జన్మించినాడు.  అప్పుడు శ్రీ మహా విష్ణు ఆవిర్భావంతో భూమాత పులకించింది. ప్రకృతి ఆనందానికి తిరుగులేదు.శ్రీ కృష్ణుని జన్మించిన విషయం ఎవరికీ తెలియకుండా వుంది. వాసుదేవుడు ఆ చిన్ని శ్రీ కృష్ణుని దేవకీ నుండి తీసుకుని యమునా నదిని దాటి మరి యశోదమ్మ దరికి చేరి ఆమె పక్కలో పడుకోబెట్టి.  యశోదకు జన్మించిన మాయను తీసుకుని వెళ్లి పోయాడు.  యశోదమ్మ దగ్గర బిడ్డను చూసి అక్కడ జనులు ఈ విధంగా అనుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా చెప్పారు. 
 
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞాన  జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.  
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ గోపికలుకు మాయ ఆవహించి వుండటం వాళ్ళ ఆ నల్లవాడు చేసే అల్లరిని తట్టుకోలేక యశోదమ్మకు పిరియాదులు చేస్తున్నారు.  ఆ అల్లరిని వారు ఎంతో ఆనందంగా అనుభవించేవారు.  మరి ఈ పిరియాదులు చూడండి మరి. 
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి నామృతాన్ని ప్రసాదించాడు.

శ్రీ కృష్ణుని జననం :
సత్యసంకల్పుడైన పరమాత్మ స్వాయంభువమనువు కోరికెను తీర్చెందుకు, తొలి జన్మ లో పృశ్నిగర్భునిగా, రెండవ జన్మలో అదితి కస్యపులకు వామనునిగా, మూడవజన్మలో దేవకి వసుదేవులకు గొవిందునిగా జన్మించాడు.
తండ్రి వసుదేవుదు జాతకర్మ నిర్వహించలేని నిస్సహాయ స్థిథి లో ఉన్నాడు, స్వామి జననము కారాగౄహములో కాబట్టి !
పాడిరి గంధర్వోత్తము లాడిరి రంభాది కాంతలానందమునన్ గూడిరి సిద్ధులు, భయములు వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్!! అతి ప్రసన్నుడైన వెన్నుని కన్న దేవకి, పున్నమినాడు షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.



దేవతలకు కూడా దొరకని ఆ పరమ పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో వెన్న దొంగిలించాడు. ఆకపటనాటక సూత్రధారి రాబోయే యుగాసందికి సంకేతంగా తల్లి చేతి తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!

లోకాలన్నిటినీ కడుపున దాచిన విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు.

చతుర్భుజాలతో, శంఖు, చక్రాలతో శ్రీవత్సలాంచనాలతో ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు దేవకి వసుదేవులకు కన్నులపండువ చెసాడు .

అటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము నేడే. కృష్ణుడు భూమి పై పుట్టింది మొదలు ఎనిమిది సంఖ్యతో ఆయన జీవితం ముడిపడింది. దశవతారాలలో కృష్ణవతారం ఎనిమదవది.  స్వామి జన్మించింది ఎనిమిదవ నెలలోనే...అష్టమి తిధి నాడు. కృష్ణసావర్ణ మన్వంతరం ఎనిమదవిది.

దేవతల విశిష్ట గుణాలను అభివర్ణిస్తు , సహస్రనామస్తోత్రాలను మహర్షులు మానవ జాతికి అందించారు.
అయితే , ఒక్క విష్ణు సహస్రనామం మాత్రం శ్రీ కృష్ణుని ఎదుట ఉంచుకుని చెప్పబడింది.
ఫ్రతి విశేషాణాన్ని స్వామి ఆమోదిస్తునట్లు భావిస్తు, భీష్ముడు సహస్ర నామాలను అభివర్ణించాడు.
ఈ చెప్పిన భీష్మపితామహుడు అష్టమి వసువైన ప్రభాసుడు.
స్వామి మతౄగర్భం నుండి ఎనిమదవ నెలలోనే ఆవిర్భవించాడని, అందుకే ఆయనను పద్మపత్రాలలో ఉంచారని ఒక నమ్మకం ఉంది. వటపత్రశాయి ఈ అవతారములో అంబుజపత్రశాయి అయ్యాడు.

నిర్గుణ పరబ్రహ్మం ధర్మ సమ్రక్షణార్ధం అవతరించిన శుభసమయములోనే యోగమాయ చెల్లెలుగా ఆవిర్భవించింది. అందుకే ఆమె కృష్ణ సహోదరి . అన్న చెల్లెలకి అండగా ఉండాలని ,ఆడబిడ్డకు పుట్టింటి అండ ఎప్పటికి అవసరమే అని , ఈ సత్సంప్రదాయాన్ని మనకి నేర్పినవాడు శ్రీ కృష్ణుడు ! మేనత్త కుంతిని గౌరవించాడు. చెల్లెలు వరుసైన ద్రౌపదిని కాపాడాడు. ఇలాగ ఆయన లోక కల్యాణము కోసము ఎన్నో చేసాడు.
భారతయుద్ధం ప్రారంభములో విజయదాయినీ అయిన దుర్గను ధ్యానించమని కృష్ణుడు అర్జునునితో చెప్తాడు.
చాలామంది ముగ్గులతో కృష్ణ పాదాలను ఇంటి ముందు చిత్రిస్తారు. స్వామికి ఆహ్వానంగా. బాలకృష్ణ రూపంనుండి అన్ని కృష్ణ రూపాలూ ఆరాధనీయాలే. అందుకే కన్నయ్యా తవ చరణం మమ శరణం!!
పెను చీకటికి ఆవల ఎకాకృతితో వెలుగు దివ్యజ్యోతి శ్రీ కృష్ణ పరమాత్మ !
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !శ్రీ కృష్ణాయ ఇదం నామమ !
శ్రీ

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)