ఆదివారం, సెప్టెంబర్ 01, 2013
Catch me Live
ఆదివారం, సెప్టెంబర్ 01, 2013
లేబుళ్లు:
కధలు,
కమామిషులు,
పరిశోధకులు,
పాటలు,
పుట్టిన రోజులు,
Events,
greetings,
My Show.
శనివారం, ఆగస్టు 31, 2013
ఆట పాటల మేటి ఆదిభట్ల
శనివారం, ఆగస్టు 31, 2013
హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు 31 ఆగస్టు 1864 జన్మించారు.
ఈయన పూర్తి పేరు అజ్జాడ ఆదిభట్ల
నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో
అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా
హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన.
"శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ
నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు
పాటిస్తున్న సంప్రదాయం. ఈయన చిన్నతనం నుండి కూడా ఏకసంథాగ్రాహి. చిన్న
తనంలో కూడా భాగవతం పద్యాలు చాలా బాగా పాడేవారు. ఈయన అష్టావధానిగా రాణించారు. మానవాళికి భక్తీ, జ్ఞాన, మోక్షములను ప్రబోధించే ఉద్దేశంతో నారాయణ దాసు గారు ‘హరికథ’ సృష్టి చేశారు. వారు హరికథను ‘సర్వ కళల సమాహారం’ అని అభివర్ణించారు.
నారాయణ దాసు గారు సృష్టించిన హరికథలో కథాప్రవచనము, ఆశుకవిత్వము, శాస్త్రీయసంగీతము, నృత్యం, అభినయం ప్రధానాంగాలు. సమయ, సందర్భాలను బట్టి వారు
ప్రదర్శించిన హరి కథలలో సంగీత, సాహిత్య చర్చలు ఉండేవి.
ఒక విధంగా చెప్పాలంటే, నారాయణ దాసు గారు, అంతకుముందు జానపద కళగా ఉన్న హరికథను సారస్వత సభల
స్థాయికి, సంగీత కచేరిల ఉన్నత స్థాయికి
చేర్చారు. ఈ కళా రూపాన్ని
సృష్టించిన నారాయణ దాసు గారు తెలుగులోనూ, సంస్కృతంలోను, అచ్చతెలుగులోను హరికథలను రచించారు. ఇందులో యధార్థ రామాయణంపేర
శ్రీరామ కథ, తెలుగు హరికధలు, హరికధామృతం పేర
శ్రీకృష్ణుని కథ సంస్కృతం హరికధలు మరియు గౌరాప్పపెండ్లి హరికథ
ఉన్నాయి. వారు రచించిన (ఉత్తర రామాయణ కథ)జానకీశపధం అనే హరికథ ౩౬ అపూర్వ కర్నాటక సంగీత రాగాలతోగూడి, సంగీతపరంగా ఎంతో ప్రశస్తిపొందింది. తెలుగు, సంస్కృతం, హిందీ, బెంగాలీ, పారశీకం, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ భాషలన్నింటిలో అనర్గళంగా హరికథను
చెప్పగలిగిన హరికథా పితామహుడు. కవిత్వం, సంగీతం, నాట్యం ఈ మూడు ప్రక్రియలకు భక్తిని కలిపి హరికథకు ప్రాణం వంటిది
ఆరోజుల్లో మైకులు లేకుండానే హరికధ చెప్పేవారు. అయన సౌండ్ కంచు మోగినట్టు
గట్టిగా పాడేవారు. దాసుగారు సుమారు 21 హరికధలు స్వర పరచారు
అని చెప్పుకోవచ్చు. ఆనాటి సంగీత సాహిత్య ప్రపంచం
నారాయణ దాసుగారికి ‘సంగీత
సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి పరమేశ్వర’ మరియు ‘హరికథ పితామహ’ లాంటి బిరుదులతో సన్మానించింది. వీటిలో ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖి
పరమేశ్వర’ బిరుదులు వారి అనన్య సామాన్యమైన తాళజ్ఞాన ప్రతిభకి గుర్తింపు. దాసు గారు ఒక
కీర్తన గానం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు తాళాలు, రెండు భుజాలతో రెండు తాళాలు, తలతో ఐయదవ తాళం వేయగలిగే వారట. ఈ ప్రజ్ఞనే ‘పంచముఖి’ అంటారు. ఈ ప్రజ్ఞను కూడా
అధిగమించి నోటితో గానంచేసే కీర్తనను ఆరవ తాళంలో గానం చేయగలగడం ‘షణ్ముఖి’. ఈవిధంగా అయిదు, ఆరు తాళాలతో గానం చేసే
సంగీత విద్వాంసులు వేరొకరు లేరు; ‘నభూతో నభవిష్యతి’ అనడం అతిశయోక్తి కానే కాదు. నారాయణ దాసు గారి తెలుగు భాషాభిమానాన్ని
గౌరవించి భారతి తీర్థ, ‘ఆట
పాటల మేటి’ అనే (తెలుగు) బిరుదుని ప్రదానం చేసి గౌరవించింది. ఆదిభట్ల నారాయణదాసుగారు 2 జనవరి 1945 న మరణించారు.
శ్రీ కృష్ణ మాయ హరికధ
ఆ మహనీయుడు తెలుగు జాతికి అధ్బుతమైన, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన, అజరామరమైన సాహిత్య సంపదను కానుకగా ఇచ్చారు. ఈరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదినం సందర్బంగా హరికధ విని ఆయనను గుర్తుచేసుకుందాం. హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి సందర్బంగా వారిని స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి కనీస కర్తవ్యం. హరికధ కళాఅభిమానులందరికి హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారి జయంతి శుభాకాంక్షలు.
గురువారం, ఆగస్టు 29, 2013
ఆంద్రామృతం బ్లాగుకు ఆరవ సంవత్సర శుభాకాంక్షలు
గురువారం, ఆగస్టు 29, 2013
మా తాతగారు చింతా రామకృష్ణారావు గారు రాస్తున్న ఆంధ్రామృతం బ్లాగుకు పూర్తిగా ఆరు సంవత్సరములు నిండింది. తాతగారు బ్లాగ్ లో తెలుగు పదాలతో అందమైన తెలుగు పద్యాలు తో బాగారాస్తున్నారు. మనం బ్లాగు లోకి ప్రవేశించే సరికి
అను అందమైన తెలుగు పద్యముతో మనకు స్వాగతము పలుకుతుంది. మొదటి పోస్ట్ . రాసినప్పటికీ తాతగారికి అస్సలు కంప్యుటర్ గురించి పెద్దగా అవగాహన లేదు. అలా అలా చాలా పోస్ట్లు పెట్టారు. ఇలా ఆరుసంవత్సరాలు ఎంతో కృషి చేసి మంచి మంచి పోస్ట్లు పెట్టారు. ఎన్నో ఎన్నెనో పరిశోదనలు చేసారు . ఎన్నో వర్గాలు పేరుతో పద్యాలు రాసారు . అందరి అభిమానాన్ని పొందారు . చాలా మందిని అనుచరులు గా పొందారు. ప్రస్తుతము వరకు 120698 మంది ఆంధ్రామృతం బ్లాగును వీక్షించారు . ఎంతో మందికి పద్య రచన మీద మంచిగా అవగాహన కలిగించారు. వారికి ఉత్సాహాన్ని కలిగించారు. మా తాతగారు ఇంకా ఇలానే చాలా సంవత్సరాలు బ్లాగు ఇలానే ఉత్సాహంగా రాయాలని కోరుకుంటూ . తాతకి మరియు ఆంద్రామృతం బ్లాగు కు ఆరవ సంవత్సర మరియు ఈరోజు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
అను అందమైన తెలుగు పద్యముతో మనకు స్వాగతము పలుకుతుంది. మొదటి పోస్ట్ . రాసినప్పటికీ తాతగారికి అస్సలు కంప్యుటర్ గురించి పెద్దగా అవగాహన లేదు. అలా అలా చాలా పోస్ట్లు పెట్టారు. ఇలా ఆరుసంవత్సరాలు ఎంతో కృషి చేసి మంచి మంచి పోస్ట్లు పెట్టారు. ఎన్నో ఎన్నెనో పరిశోదనలు చేసారు . ఎన్నో వర్గాలు పేరుతో పద్యాలు రాసారు . అందరి అభిమానాన్ని పొందారు . చాలా మందిని అనుచరులు గా పొందారు. ప్రస్తుతము వరకు 120698 మంది ఆంధ్రామృతం బ్లాగును వీక్షించారు . ఎంతో మందికి పద్య రచన మీద మంచిగా అవగాహన కలిగించారు. వారికి ఉత్సాహాన్ని కలిగించారు. మా తాతగారు ఇంకా ఇలానే చాలా సంవత్సరాలు బ్లాగు ఇలానే ఉత్సాహంగా రాయాలని కోరుకుంటూ . తాతకి మరియు ఆంద్రామృతం బ్లాగు కు ఆరవ సంవత్సర మరియు ఈరోజు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
లేబుళ్లు:
కమామిషులు,
పరిశోధకులు,
పుట్టిన రోజులు,
Events,
greetings
అమ్మ పాడిన లాలిపాట మన మాతృభాష
మాతృభాష అమ్మ బొజ్జలో వున్న
పసిపాపకు తెలిసిన భాషే.
అమ్మ పాడిన లాలిపాట మన మాతృభాష.
తేనెలతేటల మాటలుకూర్చి
వీనులకు విందు కలుగజేయు భాష
మంచి ముత్యాల్లా కూర్చిన పేట
అందమైన బంతిపూలతోట
మన భాష తెలుగు భాష
దేశభాషలందు తెలుగులెస్స!
మాతృభాష మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష (తెలుగు) మాతృభాష. దీనినే ప్రధమ భాష లేదా మొదటి భాష గా చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, మరియు భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రధమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రధమ భాషగా గల వారు కానవస్తారు. ఇదే ప్రాంతీయ భాష గా ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ భాష "తెలుగు". మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటిని సవ్యంగా అర్ధం చేసుకోవాలంటే మాతృభాష సహకారంతోనే సాద్యం.
శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స”
దేశ భాషలందు తెలుగు లెస్స”
శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.
తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలోఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారికభాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు,సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికిచిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏకొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకివచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీవీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గాజరుపుకుంటున్నాము. గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషాదినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ప్రజలు పాటిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు. "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట". అని ఇంకా "రామ్మూర్తి పంతులవాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్నవిద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలుఅందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు.ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది. ప్రపంచీకరణవలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తిచూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములోచదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ఇది ఎంతోగొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)