మంగళవారం, సెప్టెంబర్ 17, 2013
విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిశ్రమలలో ఘనంగా జరుపుకుంటారు. అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ. అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు. విశ్వకర్మ, సేవకులు మరియు వాస్తుశిల్పులు దేవతగా ఉన్నారు. బ్రహ్మ కుమారుడు, అతను మొత్తం విశ్వం యొక్క దివ్య చిత్రలేఖకుడు, మరియు అన్ని దేవతల 'రాజభవనాలు అధికారిక భవన నిర్మాతగా వున్నాడు . విశ్వకర్మ దేవతల యొక్క అన్ని చదరంగము ఆట మరియు వారి ఆయుధాలను రూపకర్త ఉన్నాడు.
మహాభారతంలో అతనిని గురించి వివరిస్తుంది వెయ్యి హస్తకళాకృతులను కార్యనిర్వాహణాధికారి దేవతల యొక్క వడ్రంగి, చేతివృత్తుల అత్యంత ప్రముఖత, అన్ని ఆభరణాలు యొక్క రూపకర్త మరియు ఒక గొప్ప మరియు శాశ్వత కీర్తిని కలిగినటువంటి దేవుడు యొక్క అధిపతి. అతను, నాలుగు చేతులు కలిగి ఒక కిరీటం ధరిస్తే, బంగారు నగల లోడ్లు, మరియు అతని చేతులలో ఒక నీటి కుండ, ఒక పుస్తకం, ఒక ఉరి మరియు శిల్పి యొక్క టూల్స్ కలిగి ఉన్నాడు.
కార్మికులు మరియు ఉత్పాదకతను పెంచడానికి మరియు నవల ఉత్పత్తులు సృష్టించడానికి దైవ స్ఫూర్తిని ఆకర్షించేందుకు సేవకులు కోసం ఒక తీర్మానం సమయం - హిందువులు విస్తృతంగా నిర్మాణ మరియు ఇంజనీరింగ్ యొక్క దేవుడు మరియు సెప్టెంబర్ 16 లేదా 17 ప్రతి సంవత్సరం విశ్వకర్మ పూజ గా జరుపుకుంటారు . సాధారణంగా ఫ్యాక్టరీ ప్రాంగణములో లేదా షాపింగ్ ఫ్లోర్ లోనే జరుగుతుంది.
ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది.
విశ్వకర్మ జయంతి రోజున అందరూ తమ వృత్తిపనుల్లో ఉపయోగపడే వస్తువులను విశ్వకర్మ చిత్రపటం ముందు పెట్టి పూజించాలి.ఈ రోజున పనిముట్లను పూజిస్తాం కనుక వాటిని వాడకూడదు. వృత్తిపనులను చేయకూడదు. బెంగాల్ ప్రాంతంలో విశ్వకర్మ జయంతిని చాలా వైభవంగా భజనలతో, నాట్యాలతో నిర్వహిస్తారు.
విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం.
విశ్వకర్మ పూజ శుభాకాంక్షలు .
సోమవారం, సెప్టెంబర్ 16, 2013
సోమవారం, సెప్టెంబర్ 09, 2013
ఆదివారం, సెప్టెంబర్ 08, 2013
తొండమునే కదంతమును తోరపు బొజ్పయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మంద హాసమున్
కొండొక గజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ మోయి గణాధ పనీకు మ్రొక్కెదన్ || 1
తొలతన విగ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్ధన చేసెదనే కదంతనా
వలపటి చేతి గండమును వాక్కును నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణా ధీప! లోక నాయకా ! 2
తలచితినే గణనాధుని! తలచితినే విగ్న పతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని దలచితినా విగ్నములను తొలగుట కొరకున్ || 3
అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నాను బ్రాలు చెరకుర సంబున్
విటలాక్షునగ్ర సుతునకు పటుతరముగ విందు చేత ప్రార్ధింతు మదిన్ || 4
అంగముజేరి శైలతనయాస్తన దుగ్ద ములాను వేళబా
ల్యాంక విచేష్ట తుండమున యవ్వలి చన్గ వళింపబోయియా
వంకకుచంబుగాన కహివల్లభ హారముగాంచి వేమృణా
ళాంకుర శంకనంటెకు గజాస్యునిగొల్తు నభీష్ట సిద్దకిన్
ఈశునంత వాని నెదిరించి పోరాడి
మడిసినానిచేతె మరల బ్రతికి
సర్వవంద్యుడైన సానుజవదనకున్
అంజలింతు విఘ్న భంజనునకు
"తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్"
"అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్."
విద్యార్ధులకు వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాస్తయే ||
సముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటోవిఘ్న రాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన |
వక్రతుండ శ్శూర్పకర్ణః హేరంబః స్కంద పూర్వజ ||
షోడశైతాని నామాని యః పఠేత్‌శృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేతథా ||
సంగ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్ధ సిధ్యర్ధం పూజితోయస్సురైరపి ||
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధిపతయే నమః ||
పదహారు రూపాల గణపతులు.
1. బాలగణపతి 2. తరుణగణపతి 3. భక్తగణపతి 4. వీరగణపతి 5. శక్తి గణపతి 6. ధ్వజ గణపతి 7. పింగళ గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విఘ్న గణపతి 10. క్షిప్ర గణపతి 11. హేరంబ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. భువనేశ గణపతి 15. నృత్త గణపతి 16. ఊర్ధ్వగణపతి.
వినాయకుని అందమైన పాటల మణిహారమ్
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ