సోమవారం, సెప్టెంబర్ 30, 2013
ప|| ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము | సారంబు దెలిసెగా జయము చేకొనుట ||
చ|| తలపులోని చింత దాటినప్పుదు గదా | అలరిదైవంబు ప్రత్యక్షమౌట |
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా | తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట ||
చ|| కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా | నిర్మల జ్ఞానంబు నెరవేరుట |
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా | కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట ||
చ|| తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా | పనిగొన్న తనచదువు ఫలియించుట |
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు | తనకు నబ్బినగదా దరిచేరిమనుట ||
శనివారం, సెప్టెంబర్ 28, 2013
త్రిలోక సంచారి నారదుడు శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ ఒకరోజు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఇద్దరి మధ్యా సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఏమిటి అంటే...........!విష్ణువు :- నారదా ! పంచ భుతాలలో ఎవరు గొప్పా?నారదుడు:- భూమి గొప్పది.విష్ణువు:- భూమండలం లో భూమి ఒక వంటే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎఅలా గొప్పది.
నారదుడు:- అయితే జలం గొప్పది.విష్ణువు:- అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.విష్ణువు:- అంత పెద్ద ఆకాశం లో అగస్యుడు నక్షత్రమే కదా.నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.విష్ణువు:- అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుఉపం లో తన పాదం తో కప్పెసాడు కదా.నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.విష్ణువు:- భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.
వారి ఇద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా పూర్తి అయ్యింది. భగవంతునికి ఎప్పుడూ భక్తుడు మీదే మనసు వుంటుంది. నారదుడు నారయణ నారాయణ అనుకుంటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013
ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.
అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం. ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ, కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.
భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.
బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..
కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు).
చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.
సమరయోధుడు భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు.
ఆదివారం, సెప్టెంబర్ 22, 2013
ఆకాశంలో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆ హరివిల్లు కూడా సాయంత్రం 05:00 నుండి సాయంత్రం 06:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలముప్రత్యక్ష ప్రసారము మాత్రమే కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే
USA = +19142147574
Skype id : radiojoshlive
Gtalk id : radiojoshlive@gmail.com
ధన్యవాదములు
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ