Blogger Widgets

బుధవారం, అక్టోబర్ 09, 2013

అంతర్జాతీయ తపాలా దినోత్సవం

బుధవారం, అక్టోబర్ 09, 2013

పూర్వము ఒక ప్రదేశములోవార్తలు ఇంకో ప్రదేశానికి చేర్చటానికి గుర్రాలు మీద వార్తాహరుడు గమ్యానికి చేర్చి వార్తలు చేర్చేవారు.  కొంతకాలం తరువాత పావురాలును పెంచుకొని వాటి ద్వారా వార్తలు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వార్తలు చేర్చేవారు.  ఈజిప్ట్ లో  మొట్టమొదటి పోస్టల్ పత్రం255 BC నుండిమొదలు అయ్యింది. అయితే ఆసమయంలో ముందు పోస్టల్ సేవలు రాజులు మరియుచక్రవర్తులు అందిస్తున్న దూతలు రూపంలో దాదాపు ప్రతి ఖండంలోని ఉనికిలోకాలక్రమేణా, మతపరమైన ఆజ్ఞలను మరియువిశ్వవిద్యాలయాలు వార్తలు మార్పిడి మరియు సమాచారం వారి స్వంత సందేశం పంపిణీ వ్యవస్థలును చేర్చారురిలే కేంద్రాలు ఎక్కువ దూరాలకు  వేగవంతంగా వార్తలు చేర్చటానికి దూతలును  'మార్గాల్లో ఏర్పాటు చేశారుచివరికి, ప్రైవేటువ్యక్తులు మరొక సంభాషించడానికిదూతలు ఉపయోగించడానికి అనుమతి లభించింది. ఆ తరువాత మెల్లి మెల్లిగా తపాల వ్యవస్థ వచ్చింది. 

ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.  "తోకలేని పిట్ట తొంభై ఆమడలు దూరం పోతుంది" అన్న పోడుపుకధకు నిజం చేస్తూన్నది కేవలము ఒక ఉత్తరము మాత్రమె అనటంలో ఎటువంటి సందేహము అక్కరలేదు. అందుబాటు ధరకే సేవలందిస్తున్న తపాలాకు, గ్రామీణ ప్రజల మధ్య ఆత్మీయానుబంధం ను పెంచుతూ వుండేది.  
భారతీయ తపాలా లేదా భారతీయ తపాలా వ్యవస్థ ఒక భారత ప్రభుత్వ సంస్థ. ఇది 155,333 పోస్టాఫీసులతో ప్రపంచంలో కెల్లా అతి పెద్ద తపాలా వ్యవస్థ చైనా 57,000 రెండవ స్థానం. దీని విస్తృతమైన శాఖలతో తపాలా సర్వీసులే కాకుండా బ్యాంకుల మాదిరి సర్వీసులు కూడా అందిస్తుంది.  ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటగా ముంబై, చెన్నై మరియు కలకత్తా  1764-1766 మధ్య పోస్టాఫీసులు ప్రారంభించింది. వారెన్ హేస్టింగ్స్ గవర్నరుగా ఈ తపాలా సర్వీసులను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. 1839లో, North West Province సర్కిల్ ఏర్పాటయింది. 1860లో పంజాబ్ సర్కిల్, 1861లో బర్మా సర్కిల్, 1866లో సెంట్రల్ సర్కిల్ మరియు 1869లో సింద్ సర్కిల్ ఏర్పాటయినవి. తరువాత సర్కిల్స్ అవధ్ (1870), రాజ్ పుట్ (1871), అస్సాం (1873), బీహార్ (1877), తూర్పు బెంబాల్ (1878) and Central India (1879)లో ఏర్పడ్డాయి. 1914 సంవత్సరం కల్లా మొత్తం పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి.
తపాలా బిళ్ళలు (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగము.   తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ లలో మొట్టమొదటి సారిగా వాడినట్లు తెలుస్తోంది. 
తపాలా బిళ్ళలు 1 జూలై 1852లో సింధ్ జిల్లాలో మొదలయ్యాయి. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించేది; కానీ అమ్మేవారు కాదు. అన్ని తపాలా బిళ్ళలుకలకత్తాలో ముద్రించబడేవి; అన్నీ కూడా విక్టోరియా మహారాణి బొమ్మతోనే విడుదల అయేవి.   తపాలా వ్యవస్థభారత ప్రభుత్వంలో సమాచార మంత్రిత్వ శాఖలోని భాగము. దీని నియంత్రణ' తపాలా సర్వీస్ బోర్డు' అధినంలో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 22 తపాలా సర్కిల్స్ ఉన్నాయి. ప్రతీ సర్కిల్ కు ప్రధాన తపాలా జనరల్ అధికారి. ఇవి కాకుండా భారత రక్షణ వ్యవస్థకోసం ప్రత్యేకమైన సర్కిల్ ఏర్పాటు చేయబడింది.   ఇప్పటికి పెద్దవాళ్ళు ఉత్తరంలు  రాయటానికి వాటిని వాటిని చదవటానికి ఇష్టపడతారు. నాకు తెలుగు పాటము లో చదువురాని ఒక ముసలి తండ్రి తన పిల్లలుకు ఎంతో ఆప్యాయంగా ఉత్తరం రాయిస్తాడు.   భారతీయ తపాలా వ్యవస్థలో అతి ముఖ్యమైన విభాగము. ప్రజలకు సంబంధించిన సర్వీసులు అన్నీ వీటి ద్వారానే నడుస్తున్నాయి.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంది ఈ తపాల గురించి.  ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రతీ సంవత్సరం అక్టోబర్ 9 న  ప్రపంచ పోస్ట్ డే గా  ప్రపంచవ్యాప్తంగాజరుపుకునే రోజు గా  బెర్న్ ఒప్పందం, జనరల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటుసంతకం చేశారు. యూనియన్ లో సభ్యత్వం దాని పేరు1878లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మార్చబడింది.  బెర్న్ 1874 ఒప్పందం అక్షరాల పరస్పర మార్పిడి కోసం ఒక తపాలభూభాగంలో పోస్టల్ సేవలు నిబంధనల సంఘటిత ఒక గందరగోళ అంతర్జాతీయ మేజ్ విజయం సాధించింది. అంతర్జాతీయ మెయిల్నిరంతరాయంగా మరియు అభివృద్ధి సంకటంలో అడ్డంకులను మరియు సరిహద్దుల చివరకు కొల్లగొట్టాడు జరిగింది.  అప్పటినుండి ఈ రోజు నాడు మనం ప్రపంచ తపాల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

అమ్మవారు ఐదవరోజు శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి గా

అమ్మవారు ఐదవరోజు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత. ఈ రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి అలకారంలో దర్శనమిస్తోంది.

శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి

చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత  
అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం.సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత,అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండపూరాణంలో కనిపిస్తుంది.భండాసురడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది."అమ్మ" అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు.అందులో సమస్త విశ్వాన్ని,14 భువనాలను,7సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు.తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు.అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని,దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తొంది.  మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి.  లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా సచామర రమావాణీ విరాజితా అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది.
 శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.

ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం 
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ: 



శ్రీ లలితా హారతి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా, శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ,మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. 
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి. 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

'స్కందమాత 

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.
'స్కందమాత స్తుతి



'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ
'

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

మంగళవారం, అక్టోబర్ 08, 2013

అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి గా

మంగళవారం, అక్టోబర్ 08, 2013

శ్రీ మహాలక్ష్మి దేవి: దసరా నవరాత్రులలో నాల్గవరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.  సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది(అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.



శ్రీ సూక్తం
హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్
~ ఓం శాంతిః శాంతిః శాంతిః ~ 

మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.

కూష్మాంఢ : 
నాలుగవ రోజు నవదుర్గలలో కూష్మాండమాతగా  అలంకరిస్తారు. ఈమె మంచిగా దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.  'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.  భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.


కూష్మాంఢ దేవి స్తుతి: 

'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
 ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు .

సోమవారం, అక్టోబర్ 07, 2013

అమ్మవారు అన్నపూర్ణాదేవిగా

సోమవారం, అక్టోబర్ 07, 2013

దసరా నవరాత్రులలో అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తారు. నవదుర్గాలలో చంద్రఘంటాదేవి గా దర్శనము ఇస్తారు.

అన్నపూర్ణ దేవి : 

అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది. 
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.  
ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అన్నపూర్ణ స్తోత్రం 

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌

ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్
చంద్రఘంటాదేవి
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
చంద్రఘంటాదేవి స్తుతి :
ఓం చంద్రఘంట చండి రక్షాకరో  
ఓం భయహరిని  మయ్య  రక్షాకరో
ఓం నవ దుర్గ నమః 
ఓం జగజనని నమః 

అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)