శ్రీ మహాలక్ష్మి దేవి: దసరా నవరాత్రులలో నాల్గవరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ. సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది(అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీ సూక్తం
|
హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః
కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్
ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ
తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్
~ ఓం శాంతిః శాంతిః శాంతిః ~
మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.
కూష్మాంఢ :నాలుగవ రోజు నవదుర్గలలో కూష్మాండమాతగా అలంకరిస్తారు. ఈమె మంచిగా దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే. 'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
కూష్మాంఢ దేవి స్తుతి:
'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.