అమ్మవారు ఐదవరోజు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత. ఈ రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి అలకారంలో దర్శనమిస్తోంది.
కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.
శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి
చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత
అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం.సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత,అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండపూరాణంలో కనిపిస్తుంది.భండాసురడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది."అమ్మ" అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు.అందులో సమస్త విశ్వాన్ని,14 భువనాలను,7సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు.తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు.అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని,దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తొంది. మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి. లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా సచామర రమావాణీ విరాజితా అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది.
శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.
ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ:
శ్రీ లలితా హారతి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా, శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.
జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.
జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ,మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.
అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి.
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.
'స్కందమాత
కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.
'స్కందమాత స్తుతి
'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '
ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.