శనివారం, ఏప్రిల్ 18, 2015
కరార విందేన పదార విందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయంతం
బాలం ముకుందం మనసా స్మరామి
పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.
మర్రి ఆకు మీద శయినించిన భగవానుడు శ్రీ కృష్ణులు. పద్మము వంటి పదాన్ని పద్మం వంటి చేతితో నోటిలో పెట్టుకొని మధువును చప్పరిస్తూ కనిపిస్తారు. ఈ వృత్తాంతం మనకు మార్కండేయ మహర్షి చరిత్ర లో కనిపిస్తుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు మహా విష్ణువుకోరకు ఘోరమైన తపస్సు చేస్తాడు. మార్కండేయుని తపస్సు తన ఉనికికే సమస్యగా మారుతుందనుకొని మహేంద్రుడు అప్సరసలును పంపి తపస్సు భగ్నం చెయ్యటానికి ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలన్నీ వృదాయ్యాయి. మార్కండేయుడు ఈ మాత్రం చలించకుండా తపస్సు చేస్తూనే వున్నాడు. మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి మార్కండేయ నీ తపస్సుకు కారణం ఏమిటి. నీకు ఏమి వరం కావాలి అని ప్రశ్నించాడు మహా విష్ణువు. అప్పుడు మార్కండేయుడు దేవా నీ మాయని చూడాలని వుంది అన్నాడు. కొన్నాళ్ళకు మహా ప్రళయం వచ్చింది. ప్రచండమైన గాలి, వర్షం. నదులు, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి. భూమితో పాటు సమస్తం నీటిలో మునిగిపోయాయి. మార్కండేయుడు విష్ణుమాయవల్ల నీటిలో తేలియాడుతూ తిరుగుతుండగా ఒకప్రదేశంలో మర్రి ఆకుమీద శయనించి వున్న చిన్న శిశువు నోటిలో కాలివేలు పెట్టుకొని చీకుతూ కనిపించాడు. అతనే వటపత్ర శాయి.
మహా విష్ణువు ఆదేశంతో మర్రి ఆకు పై వున్నా వటపత్ర శాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి, ప్రాణి కోటి కానిపిస్తుంది. మహావిష్ణువు మరలా ఇంకొకచోట సమస్త ప్రాణులను సృస్తిస్తాడని మార్కండేయుడు తెలుసుకుంటాడు. ఈ విధంగా మహా విష్ణువు మాయను తెలుసుకున్నాడు మార్కండేయుడు.
గురువారం, ఏప్రిల్ 16, 2015
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించిన వారు , తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే, తెలుగులో తొలి నవల రాసింది ఆయనే, తెలుగులో తొలి ప్రహసనం రాసింది అతనే , ఆయనకున్న ఇతర విశిష్టతలు పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు. అతనెవరో తెలుసా కందుకూరి వీరేశలింగం పంతులు గారు . కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి . గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతీ శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.
చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెలిసి చార్లీ చాప్లెన్ అంటె ఆయన హాస్య నటుడు.చాప్లెన్ డ్రస్ స్టయిల్ బిగుతుగా వున్న కోటు, లూజ్ ఫేంట్, పెద్దషూ , చేతికి ఒక వంకీ కర్రా, వంకర టింకరి నడక,మరి దానికి బ్రష్ లాంటి మీసకట్టుతో, చాప్లెన్ మనకు కనిపిస్తారు. ఎలాంటి వారికి అయినా నవ్వుతెప్పించే కళాకారుడు చాంప్లెన్.అయనను తన పాత్రలో ట్రాంప్ గా తయారు చేసుకున్నారు. చాప్లెన్.
చాప్లెన్ మంచి కళాకారుడు, మిమిక్రి చాలాబాగా చిన్నప్పటినుండీ బాగా చేసేవారు.మంచిరచయిత, పాటగాడుకూడా.అయన ఒకశాంతి ప్రియుడు, అందంగాడు, మంచిహృదయంకలవాడు,చాంప్లెన్ ఒక ప్రపంచ అద్బుతాలలో ఒకరు.
చార్లీ చాప్లిన్ 1889
ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్లోజన్మించాడు. అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి-యాదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు 'వాడెవిల్' అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‌లో మ్యూజిక్ హాల్స్గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి "From Rags to Riches " అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‌ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభని గుర్తించి గౌరవించి ఆదరించింది అమెరికా
. మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల, రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం, విద్వేషం ఏర్పడ్డాయంటే 1952 ప్రాంతాలలో అతడు అమెరికాను శాశ్వతంగా వదలిపెట్టి స్విట్జర్లెండ్
లో స్థిరపడవలసి వచ్చింది. ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు. పత్రికలవాళ్ళు అతడ్ని వ్యక్తిగతంగా, వృత్తి రీత్యా గూడా ఇబ్బందులపాలు చేస్తూనే వున్నారు. అతడ్ని అమెరికాకు వ్యతిరేకి అని, కమ్యూనిస్టని చాలా ఘోరంగా ప్రచారం చేసారు. " యిన్ అమెరికన్ యాక్టివిటీస్ కమెటీ, విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్‌కు తాఖీదులు పంపడం తరచూ జరిగేది. అతడు అమెరికాలో అప్పటికి 40 ఏళ్ళుగా నివసిస్తున్నప్పటికీ, చాప్లిన్ బ్రిటీష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అతడ్ని వేధించడం మొదలేశారు. అయితే చాప్లిన్ వాదమేమంటే , తాను కళాకారుడనని, అందువల్ల ఏ దేశ పౌరుడయినా పట్టించుకోవలసింది కాదని, తన అభిప్రాయం ప్రకారం కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుడనని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ చెందినవాడ్నికాదని చెప్పాడు. కాని కమిటీ ఎలాగైనా అతడ్ని జైలుపాలు చేయాలని ప్రయత్నించింది. ఫలితం దక్కలేదు. పత్రికలవాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివధ ప్రయత్నాలు చేశారు. వారికి ఒకే ఒక కోరిక అతడ్ని ఎలాగైనా రష్యా పంపించివేయాలని.
దైనందికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు 1952 లో అమెరికాను వదలి ఇంగ్లండ్ చేరుకొని అక్కడ నుంచి స్విట్జర్లెండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు , ప్రఖ్యాత రచయితలు , కళాకారులు, చిత్రకారులు, రంగస్థల నటులు, అతన్ని ప్రశంసించేవారు. అతడ్ని " గ్రేట్ హ్యూమనిస్ట్ ' ( గొప్ప మానవతావాది) అని చెప్పుకునేవారు. అప్పటికి చాప్లిన్‌కు 64 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతని కోరికల్ల చివరి ఈ కాస్త జీవితం ప్రశాంతంగా గడపాలని, పరిస్థితులన్నిటినీ బేరీజు వేసుకున్న దరిమిలా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు
బుధవారం, ఏప్రిల్ 15, 2015
ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ తెలియని వారు వుండరు. ఈ పెయింటింగ్ చాలా విశిష్టమైనది. ఈ పెయింటింగ్ చూస్తే విచిత్రమైన అనుభూతి కలుగుతుందిట. ఒక్కక్కసారి నవ్వుతున్నట్టు కనిపిస్తుందిట. ఇంకోసారి చూస్తే కోపంగా కనిపిస్తుందిట. ఈ పెయింటింగ్ మీద అనేకమైన శాస్త్రీయమైన ప్రయోగాలు చేస్తున్నారుట.
మనకు ఈ పెయింటింగ్ గురించి తెలుసు కానీ ఇది ఎవరు వేసారు అన్నది అందరికీ తెలియదు. ఈ పెయింటింగ్ ను లియొనార్డో డావిన్సి అన్న ప్రముఖ కళాకారుడు వేసాడు.
మనం అతని గురించి తెలుసుకుందాం. లియొనార్డో డావిన్సి ఏప్రిల్ 15, 1452 లో జన్మించారు. ఇతను ఇటాలికి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది లాస్ట్ సప్పర్ మరియు మొనాలిసా
చిత్రం. డావిన్సి తల్లిపేరు రజెష్కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆదాయం మాత్రము యేమీ ఉండేది కాదు. 1482 లో డావిన్సి మిలాన్ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు,కాలవలు,చర్చిలు,గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495 లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని మొదలుపెట్టి 1497 లో పూర్తి చేశాడు.
|
లాస్ట్ సప్పర్ |
1499 లో డావిన్సి వెనిస్ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు. డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503 లో విశ్వ విఖ్యాతమైన "మొనాలిసా" పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఆ పెయింటింగ్ కు ఆధారమైన్ మోడల్ అమ్మాయి ప్రతీరోజు వస్తు వెళ్తూ వుండేది. ఈ పెయింటింగ్ కు పూర్తి అయ్యాక ఆ చిత్ర్ం లోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సిని సైతము కట్టి పడేసింది.ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్. ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది. "మోనాలిసా" తో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో "ది వర్జిన్ విత్ చైల్డ్", "పెయింట్ ఆన్నె" వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513 లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు.
|
ఎగిరే యంత్రము |
ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. హెలికాప్టర్ వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను డావిన్సి ఆకాలం లోనే యేర్పాటు చేశాడు. 1519 లో మరణించాడు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ