మనం చాలా సార్లు I P C section ప్రకారం అని ఏదో కొన్ని సందర్బాలలో మూవీస్, మరియు టీవీలలో, వార్తలలోను వినే వుంటాము. అసలు I P C section అంటే ఏమిటి ? దాని చరిత్ర ఏమిటి ?
భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.
ఇండియన్ పీనల్ కోడ్ వెనుక చరిత్ర:-
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది. ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్ లో కూడా అమలు లో ఉంది. కానీ, కానీ ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని అంటారు . ఇండియన్ పీనల్ కోడ్ మొదలు 1860 నాటి ఆంగ్లేయుల పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ప్రకారము ఇండియన్ పీనల్ కోడ్ మనకు అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ డాక్యుమెంట్ ను 1860 లో, మొదటి లా కమిషన్ ఆధ్వర్యములో జరిగింది. మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే . ఇతనే మన భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు. మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతదేశంలోను, సమాజములోను, విద్య, వైజ్ఞానిక, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీ లోను, ప్రయాణ వాహనాలలోను,న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు , సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు , చేర్పులు అవుతునేవున్నాయి , కొత్తగా అనేక అనేక మార్పులు పొందింది. గృహ హింస సెక్షన్ 498-ఎ దానికి ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతి లో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, యూరప్, అమెరికా దేశాలలో లేదు కాబట్టి , వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతి లో లేవు. లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్ ను , లివింగ్స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'డాక్యుమెంట్ ' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన మనుస్మృతి ని, యాజ్ఞవల్క్య స్మృతి ని , నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆనాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశమత, సాంఘిక , సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువను ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' డాక్యుమెంట్ ను తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈనాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.
పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి). బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా అమలు చేస్తున్నాయి.
లార్డ్ మెకాలే తయారుచేసిన ' డాక్యుమెంట్ ' ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకత్తా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి అయిన ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా కూడావున్నారు. ఇతను ఈ డాక్యుమెంట్ ని సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించాడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 6 అక్టోబర్ 1860 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై , అమలు జరగటం ఛూడలేకపోయారు . కారణం మెకాలే 28 డిసెంబరు 1859 న, తన 59వ ఏట, మరణింఛాడు. ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830 కి ముందు, భారత దేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచము మొత్తం కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను,జెండ్ అవెస్తా అయ్యింది. ఇది విశేషమే కదా. ఇండియన్ పీనల్ కోడ్ చరిత్ర వెనకాల చాలా మంచి విషయాలు వున్నాయి కదా.