మంగళవారం, జనవరి 26, 2016
Happy Republic Day
మంగళవారం, జనవరి 26, 2016
లేబుళ్లు:
పండగలు,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
Events,
Greeetings,
photos
సోమవారం, జనవరి 25, 2016
తత్తాడి గుడి ధింధిం
సోమవారం, జనవరి 25, 2016
తత్తాడి గుడి ధింధిం తకధింధిం
తిత్తి తిత్తితి తితి తితి తితి||
దానవవదన వితానదాన సం-
ధాన రుధిర నిజపాన మిదం |
నానా భూత గణానాం గానం
దీన జనానాం తిత్తితి తితి ||
విమత దనుజమత విభవపరిభవిత
సమధికం తవ శౌర్య మిదం |
ప్రమదా భవ్యం ప్రమదాభరణం
తిమిర నిరసనం తిత్తితి తితి ||
తిరువేంకటగిరి దేవనిధానం
పరమామృతరస భాగ్యమిదం |
కరుణావరణం కమలా ధటనం
తిరొ తిరొ తిత్తితి తితి తితి ||
గురువారం, జనవరి 14, 2016
సంక్రాంతి పండగ శుభాకాంక్షలు.
గురువారం, జనవరి 14, 2016
సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతి తో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిషా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. "సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంధంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.
పెద్ద పండగ రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు,జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషం తొ మనము వారికి దాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. చిన్న పిల్లలు, సరదాగా గాలి పటాలు ఎగురవేస్తూ పండగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. పతంగుల పోటీలు పెట్టుకుంటారు. ఇంకా పండగను ఎంతో బాగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండగ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
లేబుళ్లు:
దేవదేవం భజె,
పండగలు,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
Greeetings
బుధవారం, జనవరి 13, 2016
బోగి శుభాకాంక్షలు .
బుధవారం, జనవరి 13, 2016
పండగ అనగానే పల్లెటూర్లు గుర్తువస్తాయి. అక్కడ ప్రజలు పండగను వారి లోగిళ్ళు ను పెద్ద పెదా ముగ్గులతో అలంకరించుకుంటారు , రకరకాల పిండివంతలతోను, బండుమిత్రులతో వారు ఎంతో సంతోషంగా పండగను జరుపుకుంటారు. నెలరోజులుగా మనకు పండుగ వాతావరణమే వుంది . ఈ కాలం లో మనకు చలి ఎక్కువుగా ఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరణముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల ముగ్గులు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుండి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .
మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గులు మీద మల్లెపూలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద మొగలీ పూలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
లక్ష్మీ రధముల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . ఈరోజు బోగి మంట చాలా విశేషం. అందరు భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరానివన్నీ వేసి చలిని పారగోలుపుతారు. మూడురోజులు వరుసగా పండగ వుండటం ఈ పండగను పెద్ద పండగ అంటారు. ఈ పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభతో ఉంటుంది. ఈ పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు. పండగ మొదటిరోజు ను బోగి అంటారు . ఈరోజు సాయంత్రము సమయములో పేరంటాండ్లను పిలిచి చిన్నపిల్లలకు బోగిపళ్ళు ను దిష్టితీసి వారి తలమీద పోస్తారు. ఈ బోగిపళ్ళులోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసిపిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆశీర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టి గౌరిగా సర్వమంగళగా ఆరాధిస్తారు. అలానే కన్నెపిల్లల్తోటి తప్పక గొబ్బిళ్ళు పెట్టిస్తారు. ఈ పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ ఆడ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.
(1)కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
(2)
గొబ్బియ్యలో గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో
మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గులు మీద మల్లెపూలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద మొగలీ పూలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
లక్ష్మీ రధముల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో
ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
వంటి పాటలు పాడతారు .
ఈ బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది.అందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. ఈ వివాహము చూడటానికి రెండుకళ్ళుచాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది. బోగీ పండగ శుభాకాంక్షలు .
లేబుళ్లు:
దేవదేవం భజె,
పండగలు,
పాటలు,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
Events,
Greeetings
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)