Blogger Widgets

బుధవారం, జనవరి 24, 2018

రామచరిత మానస

బుధవారం, జనవరి 24, 2018

ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
రామచరిత మానస్:
వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.
అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే క్రీ.శ.1623లో తన తనువు చాలించాడు. అభినవ వాల్మీకి, భక్తశిరోమణి అయిన తులసీదాస కవులకు నమస్కారములు.
ఈరోజు నుండి రామచరితమానస .................._/\_
సత్యం శివమ్ సుందరం శ్రీ గణేశాయనమః శ్రీ జానకీవల్లబో విజయతే శ్రీరామచరిత మానసము
ప్రధమ సోపానం
బాలకాండము
మంగళాచరణం
శ్లోకం: వర్ణానామర్ధసంఘానాం రసానాం ఛాందసామపి
మంగళానాం చ కర్తారౌ వందే వాణీవినాయకౌ||
భవానీశంకరౌ వందే శ్రద్దావిశ్వాసరూపిణౌ
యాభ్యామ్ వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్||

వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్
యమాశ్రితో హి వక్రో2పి చంద్రాః సర్వత్ర వంద్యతే||
సీతారామగుణగ్రామపుణ్యారణ్య విహారిణౌ
వందే విసుద్ధవిజ్ఞానౌ కవీశ్వరాకపీశ్వరౌ ||

ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీం
సర్వశ్రేయస్కరీం సీతాం నతో౭హం రామవల్లబామ్ ||

|| స్వస్తి || _/\_

మంగళవారం, జనవరి 23, 2018

ఆరోగ్యదాత....... అభయప్రదాత......లోక బాంధవుడుకి నమస్కారములు. _/\_

మంగళవారం, జనవరి 23, 2018

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటినీ నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమిగా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.  
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 
రధసప్తమి రోజున మనం ఉదయంనే లేచి ఆచరించవలసిన విధి 
 "జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే చాలు మనకు ఆయుః ఆరోగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలు అందిస్తాడు. 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.

శుక్రవారం, జనవరి 12, 2018

సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును.

శుక్రవారం, జనవరి 12, 2018

ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.


పాశురము: 
 
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొంది  మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.

ఏడేడు జన్మలకు నీతో విడరాని బంధుత్వము కలవారముగ కావలెను.




మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము ఆవిష్కరించి  తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.

పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీవున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)