శుక్రవారం, డిసెంబర్ 17, 2021
రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా. మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా! మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి? ఆ ఫలము ఎలావుండాలో? మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ గోదాదేవి . అయితే ఈ పాశురము విశేషము కలది . ఈ విశేష పాసురమునకు చక్కేరపోంగాలిని స్వామివారికి నివేదించాలి.
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము
పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను. బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి. చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను. అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.
ఎనలేని సిరులతో నిండును ఈ సీమ
ఎనలేని సిరులతో నిండును ఈ సీమ
ఈతిభాధలు కలుగకుండును
మునుకొని త్రివిక్రముని నామములు పాడి
మొనసి మా నోమునకు తానా మాడితిమేని || ఎనలేని ||
నెలనెలా మూడువానలు కురియును,
బలిసి ఏపుగా పైరు లెదుగును,
అల పైరుసందులను మీ లెగురును,
కలువల ఎలతేoట్లు కనుముయూను || ఎనలేని ||
కడిగి కూర్చుండి పొంకంపు చన్నులను
ఒడిసి, పితుకగ, పట్టి - రెండు చేతులను,
ఎడము లేకుండ పెను జడుల ధారలను
కడవల ఉదార గోక్షీరములు కురియును || ఎనలేని ||
గురువారం, డిసెంబర్ 16, 2021
మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడువారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకు ఏమి అధికారమో వివరించినారు. ఈ దినము ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదె అని తెలిసిన కాని కార్యము నందే వరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసినా తముచేయగలమా , చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే. దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పాడుటయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును? వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు . కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటించుదురు .
వైయత్తు వాళ్ వీర్గాళ్ పాశురము:
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము :
శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-పాలసముద్రములో ద్వనికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.
సిరినోములో వినరమ్మ మననోము తీరు
వినరమ్మ వినరమ్మ మననోము తీరు
పనిబూని చేసిన మన సిరులు మీరు !
అల పాలకడలి ఊయెల శేషశయ్యపై
అలవోక నిదురించి హరి శ్రీపదాబాల
తలచుకొనుచు, సారె కొలుచుకొనుచు,
తొలవేగుబోక నీరాడవలె చెలులార! || వినరమ్మ ||
వలదు క్రోలగ పాలు, వలదు త్రాపగ నేయి!
వలదు కాటుకపూత మన కన్నుదోయి !
అలరులుకై సేయవలదు క్రొమ్ముడులలో!
లలనలార! నోము నోచినదినాలలో || వినరమ్మ ||
పరామాత్ముడౌ ప్రభువు సరస , పరులపై
దురుసుమాటలు నోట తొడుగరా దమ్మ!
దరియనీరాదు ఘనులొల్లని పనులను!
జరుపవలె ముదమున దానధర్మములను || వినరమ్మ ||
బుధవారం, డిసెంబర్ 15, 2021
ధనుర్మాసం మొదలు అయ్యింది కదండి. ఈ నెలరోజులు పాశురాలు పాడతాము కదా. అయితే మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.
గోపికలును గోదాదేవి ఈ వ్రతం గురించి ముందుగా వారు మార్గశిరమాసం గురించి ఆ వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు. తరువాత ఈ వ్రతం ఎవరు చేస్తారో దాని వల్లన కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు. ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.
మొదటి పాశురం లో మనకు నారాయణ తత్వము కనిపిస్తుంది.
మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
పాశురం తాత్పర్యము:
ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజులు . ఓ! అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ! బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్న సంకల్పమున్నచో రండు. ముందునడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపదరాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించని మనకే , మనమాపేక్షెంచు వ్రతసాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము.
సిరినోము చేసే సమయం వచ్చింది
సిరినోము
రారమ్మా ఓ అమ్మలారా! రారే మమ్మ!
నీరాడ మనసున్నవారు, మీరూ మీరూ !
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి, కన్నియలార! కూరిమి చెలులార ! !!రారమ్మ !!
ఇది మార్గశిరము , వెన్నెలవేళ , భాసురము !
ఇది పరవాద్య వ్రతారంభ వాసరము !
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ ,
కదిసే కంకణ కటక కింకిణులు కదల !! రారమ్మ !!
మరీమరీ కనికనీ మెరిసేటి కనులతో
మురిసే యశోదమ్మ ముద్దు సింగపుకొదమ,
కరిమొయిలు మెయిహోయలు గల అందగాడు,
వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు !! రారమ్మా !!
కరమందు కరకువాల్ కాపుగా దాలిచి
వారాలేటి మేటినందుని నందనుండు
అరుణశశిబింబనిభ శుభవదనుడు
సరసిజాక్షుడే నోము కరుణింపగా !! రారమ్మ !!
ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన రోజులు. ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు ఇది చాలా విశేషమైననెల.
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్ చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .
మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి. తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది. మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం. ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ