రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా. మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా! మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి? ఆ ఫలము ఎలావుండాలో? మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ గోదాదేవి . అయితే ఈ పాశురము విశేషము కలది . ఈ విశేష పాసురమునకు చక్కేరపోంగాలిని స్వామివారికి నివేదించాలి.
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము
పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను. బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు. అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి. చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను. అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను. పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను. స్థిరమైన సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.
ఎనలేని సిరులతో నిండును ఈ సీమ
ఎనలేని సిరులతో నిండును ఈ సీమ
ఈతిభాధలు కలుగకుండును
మునుకొని త్రివిక్రముని నామములు పాడి
మొనసి మా నోమునకు తానా మాడితిమేని || ఎనలేని ||
నెలనెలా మూడువానలు కురియును,
బలిసి ఏపుగా పైరు లెదుగును,
అల పైరుసందులను మీ లెగురును,
కలువల ఎలతేoట్లు కనుముయూను || ఎనలేని ||
కడిగి కూర్చుండి పొంకంపు చన్నులను
ఒడిసి, పితుకగ, పట్టి - రెండు చేతులను,
ఎడము లేకుండ పెను జడుల ధారలను
కడవల ఉదార గోక్షీరములు కురియును || ఎనలేని ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.