మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడువారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకు ఏమి అధికారమో వివరించినారు. ఈ దినము ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదె అని తెలిసిన కాని కార్యము నందే వరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసినా తముచేయగలమా , చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే. దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పాడుటయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును? వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు . కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటించుదురు .వైయత్తు వాళ్ వీర్గాళ్ పాశురము:
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము :
శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-పాలసముద్రములో ద్వనికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.
సిరినోములో వినరమ్మ మననోము తీరు
వినరమ్మ వినరమ్మ మననోము తీరుపనిబూని చేసిన మన సిరులు మీరు !అల పాలకడలి ఊయెల శేషశయ్యపైఅలవోక నిదురించి హరి శ్రీపదాబాలతలచుకొనుచు, సారె కొలుచుకొనుచు,తొలవేగుబోక నీరాడవలె చెలులార! || వినరమ్మ ||వలదు క్రోలగ పాలు, వలదు త్రాపగ నేయి!వలదు కాటుకపూత మన కన్నుదోయి !అలరులుకై సేయవలదు క్రొమ్ముడులలో!లలనలార! నోము నోచినదినాలలో || వినరమ్మ ||పరామాత్ముడౌ ప్రభువు సరస , పరులపైదురుసుమాటలు నోట తొడుగరా దమ్మ!దరియనీరాదు ఘనులొల్లని పనులను!జరుపవలె ముదమున దానధర్మములను || వినరమ్మ ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.