శుక్రవారం, డిసెంబర్ 24, 2021
గురువారం, డిసెంబర్ 23, 2021
మనవి వినవే! మామకూతుర! (తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము)
గురువారం, డిసెంబర్ 23, 2021
తిరుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు. తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని. ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు. తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు. ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం. ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.
తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము:
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము. ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా? ఎవరైనా నీవు కదలినచో మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా. మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.మనవి వినవే! మామకూతుర!
మనవి వినవే! మామకూతుర!
మణికవాటము తీయవే!
మణిఖచిత సౌధమ్ములో పరి
మళపు దివ్వెల వెలుగులో
నును తలిమమున కనులు మొగిడిచి
కునుకుదువుగాని! లేవే! ||మనవి||
మూకయో! చెవిటిదో! అత్తా!
ముద్దులా చిన్నారి కూతురు!
కాక కావలి కదలనీయరొ?
గాఢనిద్రా మంత్రి మేసిరొ? ||మనవి||
"శ్రీకరా! వైకుంఠ నాధా!
మాధవా! మాయావి! హరి" యని
నీ కుమార్తెను లేపుమా, శుభ
నామ పారాయణముతో! ||మనవి||
బుధవారం, డిసెంబర్ 22, 2021
చానా! లేవే! చాలే పవళింపులు! (కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు పాశురం )
బుధవారం, డిసెంబర్ 22, 2021
నిన్నటి దినమున రెండవ గోపికను లేపుటకు. తెల్లవారింది అనిచేప్పుటకు. వారు భరద్వాజ పక్షులు ఎలా మాటాడుకుంతున్నాయో గోపికలు పెరుగు చిలుకుతున్నపుడు వచ్చు నగలసవ్వడి, పెరుగు సవ్వడి రకరకాలుగా తెల్లవారుటకు గుర్తులు చెప్పి ఆమెను పిచ్చిదానిగాను, నాయకురాలుగాను, తెజస్సుకలదానివి అని పిలచి నిద్రమేల్కొల్పారు. మరి ఈ రోజు మూడవ గోపికను నిడురలేపుచున్నారు మరి ఆమెను ఎలా లేపుచున్నారు అంటే. క్రింది పాసురములో చూద్దాం.
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు పాశురం :
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి. మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము. కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము. శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.
చానా! లేవే! చాలే పవళింపులు!
చానా! లేవే! చాలే పవళింపులు!
చానా! లేవే! చాలులే పవళింపులు!
ఔనే! చెలుల అచట ఆపి వచ్చేమే!
పూని నోము, స్నానమాడ వలచేదాన! ||చానా||
అల్లదే! చూడవే! తూరుపు
తెల్లవారెనె, ఎనుము కదుపులు
మెల్లగా తరలెనే, మంచున
తడియు పచ్చిక బీళ్ళ మేయగ! ||చానా||
చేరిచి వాద్యముల కైవారముల కావింప
కూరిమితో దేవదేవుడు కృపను మనపై చూపునే!
వారువము వలె వచ్చు రక్కసు
నోరు చీరినవాని వేడగ
క్రూర చాణూరాది మల్లుల
బీర మడచిన వాని పొడగ! ||చానా||
మంగళవారం, డిసెంబర్ 21, 2021
వినలేదటే వెర్రి జవరాలా! (కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ పాశురము)
మంగళవారం, డిసెంబర్ 21, 2021
నిన్న ఉత్తిష్ట అను చిన్నగోపికను మేలుకోల్పిరి. మరి నేడు. వేదపఠనముకు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః ఓమ్" అని ప్రారంభిస్తారు. నిన్న గోపికలు మెల్కొలుపుటతో మన ధనుర్మాసవ్రతం ప్రారంభము అయ్యింది. అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు. పక్షులు శ్రీ గురుమూర్తులు. అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి. తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి. ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ పాశురము:
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.
తాత్పర్యము:
భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి. ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి. నీ చెవికి సోకటం లేదా ?
ఓ నాయకురాలా! అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు. లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా? నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు తెరువవలేనని మేల్కొల్పుతున్నారు.
వినలేదటే వెర్రి జవరాలా!
వినలేదటే వెర్రి జవరాలా!
వినియె హాయిగా పవ్వళించేవటే!
తనితనిగ తెలవారెనని కీచుకీచుమని
మునుమునుగ ఏటిరింతలు మూగి పలికేను ||వినలేదటే||
ఘల్లుమనగా కంఠసరులు కాసులపేర్లు,
జల్లగా కడల క్రొమ్ముడులు వాసనలు,
గొల్ల యిల్లాండ్రు తరిగోలలను కైకొనుచు,
పెల్లుగా చల్ల తరిచే సవ్వడి ||వినలేదటే||
హరిని నారాయణుని కైవారముల మేము
ఆలపించిన ఆలకించనే లేదటే
దొరసాని వౌరౌర! ఓ బాల లేచి
తెరవవే వాకిలి ఓసి తేజోవతీ! ||వినలేదటే||
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)



