నిన్నటి దినమున రెండవ గోపికను లేపుటకు. తెల్లవారింది అనిచేప్పుటకు. వారు భరద్వాజ పక్షులు ఎలా మాటాడుకుంతున్నాయో గోపికలు పెరుగు చిలుకుతున్నపుడు వచ్చు నగలసవ్వడి, పెరుగు సవ్వడి రకరకాలుగా తెల్లవారుటకు గుర్తులు చెప్పి ఆమెను పిచ్చిదానిగాను, నాయకురాలుగాను, తెజస్సుకలదానివి అని పిలచి నిద్రమేల్కొల్పారు. మరి ఈ రోజు మూడవ గోపికను నిడురలేపుచున్నారు మరి ఆమెను ఎలా లేపుచున్నారు అంటే. క్రింది పాసురములో చూద్దాం.
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు పాశురం :
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి. మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము. కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము. శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.
చానా! లేవే! చాలే పవళింపులు!
చానా! లేవే! చాలే పవళింపులు!
చానా! లేవే! చాలులే పవళింపులు!
ఔనే! చెలుల అచట ఆపి వచ్చేమే!
పూని నోము, స్నానమాడ వలచేదాన! ||చానా||
అల్లదే! చూడవే! తూరుపు
తెల్లవారెనె, ఎనుము కదుపులు
మెల్లగా తరలెనే, మంచున
తడియు పచ్చిక బీళ్ళ మేయగ! ||చానా||
చేరిచి వాద్యముల కైవారముల కావింప
కూరిమితో దేవదేవుడు కృపను మనపై చూపునే!
వారువము వలె వచ్చు రక్కసు
నోరు చీరినవాని వేడగ
క్రూర చాణూరాది మల్లుల
బీర మడచిన వాని పొడగ! ||చానా||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.