Blogger Widgets

గురువారం, డిసెంబర్ 23, 2021

మనవి వినవే! మామకూతుర! (తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము)

గురువారం, డిసెంబర్ 23, 2021

 తిరుప్పావై లో మొదట కొన్ని పాశురములో వ్రతము ఎలా చెయ్యాలి నియామాలు ఏమిటి అని చెప్పారు.  తరువాత భగవంతుని ఒక్కరే అనుభవించకుండా గోపికలందరూతో కలసి అనుభవించాలని అనుకోని.  ముందు ఉత్తిష్ట అనే చిన్న పిల్లని నిదుర లేపారు. తరువాత బాగా దైవానుగ్రహం గల గోపికను నిదుర లేపారు.  తరువాత పాశురములో మూడవ గోపికకు తెల్లవారినది అని చెప్పి ఆమెను మేల్కొల్పారు. ఇప్పుడు నాల్గవ గోపికను నిదురలేపుతున్నారు.   ఈ గోపిక పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగవంతుని కంటే వేరే ఉపాయము లేదని  నమ్మినది . అలాంటి ఈమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు కూడి మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే కదా. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. అను అవస్థలు గురించి గీతలొ బాగా వివరించారు.

మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబడినది . తరువాత పాశురములో మననము నిరూపించబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాష్ట గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . మరి ఈమెను ఎలా నిదురనుండి మేల్కొల్పుతున్నారో చూద్దాం.  ఈ పాశురము చాలా విశేషమైనది. దీనికి దద్దోజనం ఆరగింపుగా సమర్పించాలి.
తూమణి మాడత్తు చ్చుత్తుం పాశురము: 

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
ఉజ్జ్వలములైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టును దీపములు ప్రకాశించుచుందగా అగురుధూపముల పరిమళము నాసికను వశమొనర్చుకోను చుండ నిద్రపోవు ఓ అత్తా కూతురా! మణికవాటము యొక్క గడియను తీయుము.  ఓ అత్తా! నీవైనా ఆమెను లేపుము.  నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక మందకొడి మనిషా?  ఎవరైనా నీవు కదలినచో  మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా? లేక మొద్దు నిద్దుర ఆవేశించునట్లు ఎవరైనా మంత్రము వేసినారా.  మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని అనేకములైన భగవంనామములను కీర్తించి ఆమెను మేల్కొనునట్లు చేయుము అని భావము.

మనవి వినవే! మామకూతుర!

మనవి వినవే! మామకూతుర!
మణికవాటము తీయవే!

మణిఖచిత సౌధమ్ములో పరి
మళపు దివ్వెల వెలుగులో
నును తలిమమున కనులు మొగిడిచి
కునుకుదువుగాని! లేవే!  ||మనవి||

మూకయో! చెవిటిదో! అత్తా!
ముద్దులా చిన్నారి కూతురు!
కాక కావలి కదలనీయరొ?
గాఢనిద్రా మంత్రి మేసిరొ?  ||మనవి||

"శ్రీకరా! వైకుంఠ నాధా!
మాధవా! మాయావి! హరి" యని
నీ కుమార్తెను లేపుమా, శుభ
నామ పారాయణముతో! ||మనవి||

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)