Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 27, 2021

వంటింటి పోపుసామానులో క్వీన్ మెంతులు

సోమవారం, డిసెంబర్ 27, 2021

లలితశయనా! చలిత (పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై)

 వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు.  దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది.  మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు.  కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా.  రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి.  రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు.  అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు.  ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది.  తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది.  ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము.  ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం.  అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.   

పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ  పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.
లలితశయనా! చలిత

లలితశయనా! చలిత
హరిణ నయనా! లెమ్మ!
తెలవారు చున్నదమ్మా
అలరు కొమ్మా! తళుకు
పసిడిబొమ్మా! లెమ్మా
తెలవారు చున్నదమ్మ! ||లలితశయనా||

పులుగు లవే మేతలకు తరలేను-
మెలమెల గురు డస్తమించేను-
అల శుక్రతార మింటను పొడిచెను!
కలసి మాతోరమ్మ! కపటమును విడవమ్మ  ||లలితశయనా||

బక దైత్య వైరి ఆ దశకంఠ సంహారి
అకలంక చరితముల ఒకచోట చేరి
ఈ పుణ్యదివసాన సఖియలు పాడేరు
తీపారు వలినీట తీర్థమాడగదమ్మా !

తెలవారు చున్నదమ్మా!
లలితశయనా! హరిణ నయనా!

ఆదివారం, డిసెంబర్ 26, 2021

ఏమి వింతలొగాని, చెలియరో! (కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి)

ఆదివారం, డిసెంబర్ 26, 2021

 ఇది వెనుక మనము చూచినా స్థితప్రఙ్ఞానావస్థలలో నాల్గోదీయినది యాతనామావస్థ.  ఈ అవస్థలో తాబేలు తన అవయవాలను వెనుకగు లాక్కొన్నట్లు భగవదనుభవమున్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వావస్థలువుండును.  ఇది ఒక నిద్ర వంటిదే.  ఇంతవరకు నాల్గు పాశురములలో  నలుగురు గొపికలను నిద్రించుట తగదు అని చెప్పి మెల్కొలుపుతలో ఈ స్థిత ప్రఙ్ఞావస్థలోని దశలనే వివరించినట్లు తెలుసుకున్నాం.  ఈ అవస్థని భగవద్గీతలొ ఇలా వర్ణించారు.

"యదా సంహారతేచాయం కూర్మోంగానీవ సర్వశః 
ఇంద్రియాణీంద్రి యార్ధేభ్యః తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || "

తాబేలు తన అవయవాలను బాగుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములు  ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించుకొనినా అతని ప్రఙ్ఞ ప్రతిస్ట్టతమైనది.  ఈ విధంగా భగవత్కైంకర్యనిష్ట గల, ఇంద్రియ ప్రవృత్తి విరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు.  మరి ఈ పాసురములో ఏవిధంగా ఈమెను మేల్కొల్ప్తున్నారో కదా. 
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము: 
వయస్సునందున్న గేదెలు తమ దూడలు పాలుత్రాగుటకు రాకపోవట వలన పొదుగుల భాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచూ నీ ఇంటను అంతా బురద చేయుచున్నవి.  ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎప్పుడూ కలసివుండె గోపవీరుని చెల్లెలా! క్రింది నెల అంతా  బురదతో నిండి ఉండగా మా తలలయండు పైనుండి పాడెడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం.  అంటే కాదు తన బార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన బంగారు లంకాపట్టణంనకు రాజైన రావణాసురుని వధించిన మునిజనమనోభిరాముడకు శ్రీ రాముని గురించి పాటలు పాడుతున్నాము.  అయినాను నీవు పెదవి విప్పలేదు.  ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా!  పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు.

ఏమి వింతలొగాని, చెలియరో! 

ఏమి వింతలొగాని, చెలియరో! అయ్యయ్యో!
నీ మదిని క్రమ్మినది ఏ మాయ నిదురో!

జమాయె నీయింటి మోసాలలో వేచి,
ఈ మంచులో గడప నానుకొని నిలిచి!           ||ఏమి వింతలొగాని||

వైరియౌ లంకాధిపతిని తునుమాడిన
శౌరిపై, ఆ మనోహరిపై, మా పాట
ఊరివా రెల్లరున చెవులార విన్నారు!!
ఔరౌర! ఇకనైనా లేవమ్మ! మా అమ్మ!             ||ఏమి వింతలొగాని||

తన లేగలను తలచికొని అరచి చేపుగొను
చనుమొనల, ఎనుము ఎడతెగక కురిసే పాల!
మునివాకిటను బందగానైన వీటిలో
ఎనలేని సంపదలు గలవాని చెల్లెలా !              ||ఏమి వింతలొగాని||

శనివారం, డిసెంబర్ 25, 2021

రావే! గోపవంశాన రాజిల్లే లతకూన! ( కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు)

శనివారం, డిసెంబర్ 25, 2021

 ఈనాటి పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడై యున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలే పృశంచించుట విశేషము.  గోపికలందురు కృష్ణతత్వమూ నేరిగినవారు.  నాకు అయితే వారు చాలా అదృష్టవంతులుగా తోచుతున్నది.  అయ్యో అప్పుడు నేను లేనే అని వుండివుంటే చాలా బాగుండును కదా, నేను ఒక గోపికగా వుండేదానను అనిపిస్తుంది.  సరే ఈనాటి పాశురము గురుంచి ఎలా ఈ గోపికను నిదుర లేపుతున్నారో చూద్దాం.


                                                           కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:  
లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాముయోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా?  రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు.  నీ వాకిలి ముందు చేరియున్నారు.  నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు.  ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి?  ఓ సంపన్నురాలా ! నీ నిద్రకర్ధమేమితో తెలియచేయుము.
రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!

రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
రావే! పాముపడగ బోలే కటికలదానా!

లేవే! నీరదశ్యామ మోహనుని నామముల
నీ వాకిటనే నిలిచి నీవారు పాడేరు ||రావే!||

మేలి పొదుగుల ఆలు వేలు కలవారు, ఆ
భీలరణమున అరుల బీర మడిచేవారు, గో
పాలకుల కులమున వెలసే ఓ వనమయూరీ!
లేవే కలుములనెలవౌ ఓ నారీ! ఒయ్యారీ ||రావే!||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)