ఇది వెనుక మనము చూచినా స్థితప్రఙ్ఞానావస్థలలో నాల్గోదీయినది యాతనామావస్థ. ఈ అవస్థలో తాబేలు తన అవయవాలను వెనుకగు లాక్కొన్నట్లు భగవదనుభవమున్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వావస్థలువుండును. ఇది ఒక నిద్ర వంటిదే. ఇంతవరకు నాల్గు పాశురములలో నలుగురు గొపికలను నిద్రించుట తగదు అని చెప్పి మెల్కొలుపుతలో ఈ స్థిత ప్రఙ్ఞావస్థలోని దశలనే వివరించినట్లు తెలుసుకున్నాం. ఈ అవస్థని భగవద్గీతలొ ఇలా వర్ణించారు.
"యదా సంహారతేచాయం కూర్మోంగానీవ సర్వశః
ఇంద్రియాణీంద్రి యార్ధేభ్యః తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || "
తాబేలు తన అవయవాలను బాగుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములు ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించుకొనినా అతని ప్రఙ్ఞ ప్రతిస్ట్టతమైనది. ఈ విధంగా భగవత్కైంకర్యనిష్ట గల, ఇంద్రియ ప్రవృత్తి విరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు. మరి ఈ పాసురములో ఏవిధంగా ఈమెను మేల్కొల్ప్తున్నారో కదా.
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
వయస్సునందున్న గేదెలు తమ దూడలు పాలుత్రాగుటకు రాకపోవట వలన పొదుగుల భాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచూ నీ ఇంటను అంతా బురద చేయుచున్నవి. ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎప్పుడూ కలసివుండె గోపవీరుని చెల్లెలా! క్రింది నెల అంతా బురదతో నిండి ఉండగా మా తలలయండు పైనుండి పాడెడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం. అంటే కాదు తన బార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన బంగారు లంకాపట్టణంనకు రాజైన రావణాసురుని వధించిన మునిజనమనోభిరాముడకు శ్రీ రాముని గురించి పాటలు పాడుతున్నాము. అయినాను నీవు పెదవి విప్పలేదు. ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా! పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు.ఏమి వింతలొగాని, చెలియరో!
ఏమి వింతలొగాని, చెలియరో! అయ్యయ్యో!
నీ మదిని క్రమ్మినది ఏ మాయ నిదురో!
జమాయె నీయింటి మోసాలలో వేచి,
ఈ మంచులో గడప నానుకొని నిలిచి! ||ఏమి వింతలొగాని||
వైరియౌ లంకాధిపతిని తునుమాడిన
శౌరిపై, ఆ మనోహరిపై, మా పాట
ఊరివా రెల్లరున చెవులార విన్నారు!!
ఔరౌర! ఇకనైనా లేవమ్మ! మా అమ్మ! ||ఏమి వింతలొగాని||
తన లేగలను తలచికొని అరచి చేపుగొను
చనుమొనల, ఎనుము ఎడతెగక కురిసే పాల!
మునివాకిటను బందగానైన వీటిలో
ఎనలేని సంపదలు గలవాని చెల్లెలా ! ||ఏమి వింతలొగాని||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.