మంగళవారం, డిసెంబర్ 28, 2021
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది ఆ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్ పాశురము:
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు. ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది. ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న గుడుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము. లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము. నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము. ఓ మాతనేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.
కలువ కనుమూసినది
కలువ కనుమూసినది
కమలమ్ము పూచినది
కలికిరో! నీ పెరటి కొలనులో!
తెలిదంతముల జియ్యరులు, కావి తాలుపులు
తరలేరు, కుంచెకోలల తెరవ కోవెలలు ||కలువ కనుమూసినది||
మిమ్ము నేనే వచ్చి మేలుకొలెపెద నని
అమ్మ చెల్లా! నీవు నిదురింతువే!
కమ్మగా నెరవాది మాటలన్నీ ఆడి
ఎమ్మెలాడి! నీవు సిగ్గుపడవే ||కలువ కనుమూసినది||
వరశంఖచక్రదారిని, హరిని, శౌరిని,
పురుషోత్తముని వికచజలజ లోచనుని
తరుణు లందరితోడ తనివారగ పొగడ
తరలిరావమ్మ! నిద్దురమాని, ఓ కొమ్మ! ||కలువ కనుమూసినది ||
సోమవారం, డిసెంబర్ 27, 2021
వెనుకటి పాశురమున గోపికలును మేల్కొలుపుచు కృష్ణ సంకీర్తనం మాని శ్రీ రామ చంద్రుని గుణగణాలను సంకీర్తనం చేస్తూ శ్రీరాముడు మనోభిరాముడని గోపికలు అంటున్నారు. దానిని విని నందవ్రాజమున సంచలనం ఏర్పడింది. మధురలో పుట్టి శ్రీకృష్ణుడు గోపవంసమున చేరి తాను కూడా గోపాలుడే అనునట్లు కలసిమెలసి ఉంది వారిని కాపాడుచుండగా అలాంటి కృష్ణుని విడిచి రాముని కీర్తించుట ఏమి అన్యాయము? అప్పుడు అయోధ్యలో ప్రజలు రాముడు, రాముడు, రాముడని యనుచుండెడి వారు. కానీ ఇతర ప్రస్తావనే లేదు కదా ! నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుట ఏమి హేతువు? శ్రీ రాముడా! మనోభిరాముడా. రామునికంటే కృష్ణుడే సౌందర్యవంతుడు గదా అని ఇలా అనవద్దని కోపికలు వివాదంలో పడిరి. రాముని కీర్తిమ్చినవారు రాముడుకు కృష్ణునికి పోలికలు చెప్పి ఇద్దరు ఒక్కరే అని నిరూపించి గెలిచినారు. అప్పుడు ఇద్దరినీ కీర్తించుదుము అనుకొన్నారు. ఈ పాసురములో మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్టస్థానం కలది. తన నేత్ర సౌందర్యము వుండటం వల్ల ఆ కృష్ణుడు వేదక్కొని రాక ఎలా వుందగలడు అని భావించి ఆమె దైర్యముగా ఇంటిలోనే పరుండివున్నది. ఇక్క నేత్రము అనగా ఙ్ఞానము. ఙ్ఞానము కల చోటకు కృష్ణుడు తప్పక వచ్చును కదా అది ఆమె భావం. అలాంటి గోపికను నేడు ఎలా మేల్కొల్పుచున్నారో చూద్దాం.
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.
లలితశయనా! చలిత
లలితశయనా! చలిత
హరిణ నయనా! లెమ్మ!
తెలవారు చున్నదమ్మా
అలరు కొమ్మా! తళుకు
పసిడిబొమ్మా! లెమ్మా
తెలవారు చున్నదమ్మ! ||లలితశయనా||
పులుగు లవే మేతలకు తరలేను-
మెలమెల గురు డస్తమించేను-
అల శుక్రతార మింటను పొడిచెను!
కలసి మాతోరమ్మ! కపటమును విడవమ్మ ||లలితశయనా||
బక దైత్య వైరి ఆ దశకంఠ సంహారి
అకలంక చరితముల ఒకచోట చేరి
ఈ పుణ్యదివసాన సఖియలు పాడేరు
తీపారు వలినీట తీర్థమాడగదమ్మా !
తెలవారు చున్నదమ్మా!
లలితశయనా! హరిణ నయనా!
ఆదివారం, డిసెంబర్ 26, 2021
ఇది వెనుక మనము చూచినా స్థితప్రఙ్ఞానావస్థలలో నాల్గోదీయినది యాతనామావస్థ. ఈ అవస్థలో తాబేలు తన అవయవాలను వెనుకగు లాక్కొన్నట్లు భగవదనుభవమున్నవారు ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వావస్థలువుండును. ఇది ఒక నిద్ర వంటిదే. ఇంతవరకు నాల్గు పాశురములలో నలుగురు గొపికలను నిద్రించుట తగదు అని చెప్పి మెల్కొలుపుతలో ఈ స్థిత ప్రఙ్ఞావస్థలోని దశలనే వివరించినట్లు తెలుసుకున్నాం. ఈ అవస్థని భగవద్గీతలొ ఇలా వర్ణించారు.
"యదా సంహారతేచాయం కూర్మోంగానీవ సర్వశః
ఇంద్రియాణీంద్రి యార్ధేభ్యః తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || "
తాబేలు తన అవయవాలను బాగుగా వెనుకకు లాగినట్లు ఇంద్రియములు ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించుకొనినా అతని ప్రఙ్ఞ ప్రతిస్ట్టతమైనది. ఈ విధంగా భగవత్కైంకర్యనిష్ట గల, ఇంద్రియ ప్రవృత్తి విరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుతున్నారు. మరి ఈ పాసురములో ఏవిధంగా ఈమెను మేల్కొల్ప్తున్నారో కదా.
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
వయస్సునందున్న గేదెలు తమ దూడలు పాలుత్రాగుటకు రాకపోవట వలన పొదుగుల భాధచే అరచుచు దూడలు వచ్చి త్రాగబోవుచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచూ నీ ఇంటను అంతా బురద చేయుచున్నవి. ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడువక ఎప్పుడూ కలసివుండె గోపవీరుని చెల్లెలా! క్రింది నెల అంతా బురదతో నిండి ఉండగా మా తలలయండు పైనుండి పాడెడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిట నిలిచి ఉన్నాం. అంటే కాదు తన బార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన బంగారు లంకాపట్టణంనకు రాజైన రావణాసురుని వధించిన మునిజనమనోభిరాముడకు శ్రీ రాముని గురించి పాటలు పాడుతున్నాము. అయినాను నీవు పెదవి విప్పలేదు. ఇకనైనను మేల్కొని లేచి రావమ్మా! పోరిగిళ్ళవాళ్ళు వచ్చి నీ గాఢ నిద్ర చూచుచున్నారు.
ఏమి వింతలొగాని, చెలియరో!
ఏమి వింతలొగాని, చెలియరో! అయ్యయ్యో!
నీ మదిని క్రమ్మినది ఏ మాయ నిదురో!
జమాయె నీయింటి మోసాలలో వేచి,
ఈ మంచులో గడప నానుకొని నిలిచి! ||ఏమి వింతలొగాని||
వైరియౌ లంకాధిపతిని తునుమాడిన
శౌరిపై, ఆ మనోహరిపై, మా పాట
ఊరివా రెల్లరున చెవులార విన్నారు!!
ఔరౌర! ఇకనైనా లేవమ్మ! మా అమ్మ! ||ఏమి వింతలొగాని||
తన లేగలను తలచికొని అరచి చేపుగొను
చనుమొనల, ఎనుము ఎడతెగక కురిసే పాల!
మునివాకిటను బందగానైన వీటిలో
ఎనలేని సంపదలు గలవాని చెల్లెలా ! ||ఏమి వింతలొగాని||
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ