శనివారం, ఫిబ్రవరి 11, 2012
పానుగంటి వారు
పానుగంటి లక్ష్మీ నరసింహరావు ఫిబ్రవరి 11 ,1865 న జన్మించారు. రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ మరియు వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. లక్ష్మీ నరసింహరావు గొప్ప తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి ఎనలేని కీర్తిని సంపాదించారు. ఈయన రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. లక్ష్మి నరసింహారావు గారిని జనులందరు 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర ఎడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులను ఇచ్చి సత్కరించారు.
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు లక్ష్మీనరసాపురం జమిందారిణి రావు చెల్లయమ్మ గారి దివానుగా చేరారు. ఆరు సంవత్సరాల తర్వాత అభిప్రాయభేధాల మూలంగా ఉద్యోగం మానివేశారు. తరువాత ఉర్లాము సంస్థానం లోను, బళ్ళారి జిల్లాలోని ఆనెగొంది సంస్థానంలోను దివానుగా కొంతకాలం పనిచేశారు.
పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూరు వారికి మైనారిటీ తీరగా రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పంతులుగారిని 1915-16 మధ్య 'నాటక కవి'గా తమ ఆస్థానంలో నియమించారు. వీరి కోరికపై అనేక నాటకాలు వ్రాసారు. వాటి నన్నింటిని మహారాజుగారే అచ్చువేయించారు.
సుమారు ఇరవై సంవత్సరాలు వీరికి జీవితం సుఖంగా జరిగింది. ఆ రోజుల్లో దివాణం తరువాత వ్యయానికి వీరి గృహమే అనేవారు. ఆధునిక శ్రీనాధునిగా జీవించారు. వాణి సంఘములో చురుకైన సభ్యునిగా ఉండేవాడు.
ఉద్యోగాల వలన మరియు రచనల వలన వీరు విశేషంగా డబ్బు గడించినా దానిని నిలువచేయడంలో శ్రద్ధ కనపరచలేదు. ఆధునిక శ్రీనాధుని వలెనే అనుభవించినన్నాళ్ళూ బాగా అనుభవించి, తుది రోజులలో పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. మహారాజావారు బాగా పోషించినా, పంతులుగారికి తుదిదశలో వైషమ్యాలేర్పడి, తమదగ్గర ఏనాడో చేసిన ఋణం కొరకు వారికి ఇచ్చే నూటపదహారు రూపాయల గౌరవ వేతనం వేతనంలో కొంతభాగం తగ్గించడానికి ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్యంలో వీరు అటు ఇటు తిరిగి సంపాదించలేకపోయారు. చేతికి అందివచ్చిన కుమారులు ఉన్నా వారిని ఉద్యోగాలకు పంపలేకపోయారు.
కవి శేఖరుని దుస్థితి గురించి పానుగంటి వ్రాసిన లేఖను ఆంధ్రపత్రికలో యర్రవల్లి లక్ష్మీనారాయణ ప్రచురించాడు - నాకెవరును దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు నూటయాభై సెట్ల పుస్తకాలు యాభై మంది కొని, నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును.
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో పిఠాపురంలో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన అక్టోబరు 7న, 1940లో మరణించాడు. పానుగంటి వారు చివరి పరిస్తితిలో ఆయన పడిన మానసిక వేదన, పేదరికము చాలా బాధకలిగిస్తున్నది. ఈ మహాకవికి మన తెలుగు ప్రజలు తరుపున నివాళ్ళు అందిస్తున్నాను.
అష్టావధానము 2
అవధానం :-అవధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు వారి సొత్త. ప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలో ముఖ్యమైన వ్యక్తి అవధాని. అంటే ఎంతో ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం సరి అయిన వాళ్ళలో ఉండాలి. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. అలా చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను.ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము. అవధానములందు ఆశుకవితా ధార రసగంగా ప్రవాహమై పొంగుతుంది. అవధాని వూహలో... జార్జిబుష్, లాడెన్ చెట్టపట్టాలు వేసుకుని రామాయణ ఇతివృత్తంలోనో ఇంకేదో ఇతిహాసంలోనో ఇట్టే ఒదిగిపోతారు.
ఆంగ్ల పదాలు అచ్చ తెలుగు పవిట వేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి.
నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ, నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ.
అది అత్యద్భుత సాహితీ సమరం . కమ్మటి కందపద్యాలూ, సింగారాల సీసపద్యాలూ, చవులూరించే చంపకమాలలూ, ఉత్తేజమును కలిగించే ఉత్పలమాలలూ, అసందర్భ ప్రసంగంలో నవ్వుల జల్లులూ,
ఇవీ ఆ యుద్ధ ఫలితాలు.
అవధాన ప్రక్రియ గురించి ఇంకాతెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ ఇవ్వండి.
ఆంగ్ల పదాలు అచ్చ తెలుగు పవిట వేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి.
నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ, నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ.
అది అత్యద్భుత సాహితీ సమరం . కమ్మటి కందపద్యాలూ, సింగారాల సీసపద్యాలూ, చవులూరించే చంపకమాలలూ, ఉత్తేజమును కలిగించే ఉత్పలమాలలూ, అసందర్భ ప్రసంగంలో నవ్వుల జల్లులూ,
ఇవీ ఆ యుద్ధ ఫలితాలు.
అవధాన ప్రక్రియ గురించి ఇంకాతెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ ఇవ్వండి.
శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012
థామస్ అల్వా ఎడిసన్
శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012
సృజనాత్మకంగా
ఆలోచించడం, శాస్త్ర విజ్ఞాన సహాయంతో మానవాళికి అవసరమైన వాటిని ఆవిష్కరించడం ఎంతో ఓపికతో కూడిన
వ్యవహారం. నిరంతరం ప్రయోగాలతో మునిగితేలుతూ ప్రజలకు అవసరమైన సాంకేతిక ఉపకరణాలను సృష్టించి, కొన్ని వందల పేటెంట్లు
పొంది, నిత్య స్మరణీయుడైన వ్యక్తి
'సర్ థామస్ అల్వా ఎడిసన్'.
థామస్
అల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 న అమెరికా లోని
ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో
జన్మించి మిషిగాన్ రాష్ట్రంలోని పోర్టుహ్యురాన్ అనే ప్రదేశంలో ఎదిగారు.
తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ 1804-1896 మరియు తల్లి నాన్సీ
మాథ్యూస్ ఎడిసన్ 1810-1871 లకు ఏడవ మరియు
చివరి సంతానం.ఇతని కుటుంబం లో
జన్మించారు.
పాఠశాలస్థాయి వయస్సులోనే సొంత ప్రయోగశాల ఏర్పరచుకొని,
ప్రయోగాలు చేసేవాడు.అయితే తన ప్రయోగాలకు
అవసరమైన డబ్బును స్వయం ఉపాధి ద్వారా
పొందాలనుకున్నాడు. తాముండే గ్రామం మీదుగా వెళ్ళే రైలులో దినపత్రికలు, పండ్లు అమ్మి వచ్చిన డబ్బుతో
ఏకంగా ఒక వారపత్రికను సొంతగా
అచ్చువేసేవాడు. రైల్లోనే ఖాళీ సమయంలో చదువుకోవడం,
ఏకంగా రైల్లోనే ఒక ప్రయోగశాలను ఏర్పరచుకోవడం
మనం ఊహించలేని విషయాలు. నిరంతర పఠనం, పరిశీలన చేసి
ప్రయోగాల ద్వారా నిర్ధారించుకోవడం ఎడిసన్ నిత్యకృత్యం. అలాగే సమయాన్ని సద్వినియోగపరచుకున్న
తీరు మనకందరికీ స్ఫూర్తిదాయకం. తెలుసుకోవాలన్న
ఆసక్తి, నిరంతర తపన, ప్రజలందరికీ ఉపకరించే
ఫలితాన్ని వెలువరించాలన్న దృఢకాంక్ష, నిద్రాహారాలు మరచి తదేక దీక్షతో
ప్రయోగాలు చేయడం, తన జ్ఞానాన్ని నిత్యం
అభివృద్ధిపరచుకోవడం.. ఒక కార్యసాధకుడు, పరిశోధకుడైన
ఎడిసన్ మానవాళి పురోగతికి సూచించిన మార్గాలు. ఎడిసన్ స్ఫూర్తితో మనం ఎంచుకున్న రంగంలో
ఏకదీక్షతో, పట్టుదలతో కృషి చేయడమే ఆయన
జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది.
Edison's great quotations .
- “Genius is one percent inspiration and ninety-nine percent perspiration.”
- “I haven't failed, I've found 10,000 ways that don't work”
- “Good fortune is what happens when opportunity meets with planning.”
- “The three great essentials to achieve anything worth while are, first, hard work; second, stick-to-itiveness; third, common sense.”
- “Opportunity is missed by most people because it is dressed in overalls and looks like work.”
- “I never failed once. It just happened to be a 2000-step process.”
- “I never did a day's work in my life. It was all fun.”
- “Restlessness is discontent and discontent is the first necessity of progress. Show me a thoroughly satisfied man and I will show you a failure.”
- "There's a way to do it better - find it.”
- "We now know a thousand ways not to build a light bulb”
- “Be courageous! Have faith! Go Forward!”.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)