అవధానం :-అవధానము అనే సాహిత్య ప్రక్రియ తెలుగు వారి సొత్త. ప్రంచంలో ఏ భాష లోను లేని ఈ అవధానంలో ముఖ్యమైన వ్యక్తి అవధాని. అంటే ఎంతో ఏకాగ్రత వున్న పండితుడు. విశేషమైన భాషా పాండిత్యం, సమయస్పూర్తి , కల్పనా చాతుర్యము , చమత్కారం సరి అయిన వాళ్ళలో ఉండాలి. అవధాని కలం కాగితం పట్టకూడదు. కేవలం తన ధారణ లేక జ్ఞాపక శక్తితో, మధ్య మధ్య ఏకాగ్రతను భంగపరస్తూ అప్రస్తుత ప్రసంగి వేసే వింత ప్రశ్నలకు సముచితంగా సమాధానం చెబుతూ, కవితా వ్యాసంగం కావించాలి. అలా చెప్పిన కవిత్వాన్ని , ధారణ చేసి అఖరి అంశంగా అన్ని ప్రశ్నల సమాధానాల్ని అప్పచెప్పవలెను.ఎనిమిది అంశాలపై జరిగే అవధానం అష్టావధానము. అవధానములందు ఆశుకవితా ధార రసగంగా ప్రవాహమై పొంగుతుంది. అవధాని వూహలో... జార్జిబుష్, లాడెన్ చెట్టపట్టాలు వేసుకుని రామాయణ ఇతివృత్తంలోనో ఇంకేదో ఇతిహాసంలోనో ఇట్టే ఒదిగిపోతారు.
ఆంగ్ల పదాలు అచ్చ తెలుగు పవిట వేసుకుని కొత్త అర్థాలూ అందాలూ సంతరించుకుంటాయి.
నిషిద్ధాక్షరి పేరుతో పృచ్ఛకుల ఎత్తులూ, నానార్థాల సాయంతో అవధాని పై ఎత్తులూ.
అది అత్యద్భుత సాహితీ సమరం . కమ్మటి కందపద్యాలూ, సింగారాల సీసపద్యాలూ, చవులూరించే చంపకమాలలూ, ఉత్తేజమును కలిగించే ఉత్పలమాలలూ, అసందర్భ ప్రసంగంలో నవ్వుల జల్లులూ,
ఇవీ ఆ యుద్ధ ఫలితాలు.
అవధాన ప్రక్రియ గురించి ఇంకాతెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ ఇవ్వండి.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.