పద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .
అమ్మ తన బిడ్డ అన్నము తినటానికి మారం చేసినప్పుడు ప్రతీ ఇంట్లోని అమ్మ చందమామని చూపిస్తూ , గోరుముద్దలు తినిపిస్తూ తన బిడ్డకి "చందమామరావో జాబిల్లిరావో" అన్నపాట ను పాడుతుంది. ఈ పాట తెలియని తెలుగు లోగిలి వుండదు. ఇలాంటి పాటలు రాసిన వారు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అయిన "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" అను బిరుదాంకితుడు అన్నమయ్య. నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని ఒక కధ కలదు. అలా జన్మిచిన వాడే అన్నమయ్య . సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేటమండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడిపోయింది.
అన్నమయ్య ఇంటిలోతల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు. ఈ పాటరాసింది తెలుగువాగ్గేయకారుడు కలియుగదైవము వేంకటేశ్వరస్వామికి గొప్పభక్తుడు అయిన అన్నమయ్య . అన్నమయ్య చాలాపాటలు రాసారు పాడారు .స్వామి వారికి మేలుకొలుపు అన్నమయ్య పాడినప్పుడు "మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవె నా పాలి మించిన నిధానమా " వంటి మేలుకోలుపు పాటలకు స్వామి వారు నిద్రలేసారు. మళ్ళీ రాత్రి జోల పాటలు అన్నమయ్య రాసిన"జో అచ్యుతానంద జోజో ముకుందా, రావె పరమానంనద , రామ గోవిందా జోజో జోజో" అన్నపాటకు స్వామి వారు హాయిగా నిద్రపోతారు. అన్నమాచార్యలవారు అనేఅనేక వేలపాటలు రాసారు పాడారు. అయానపాటలవల్లే స్వామి వారికి అంతకీర్తికలిగిందా అనిపించేటట్టు వుంటాయి అన్నమయ్య పాటలు సామాన్యమానవులు కు అర్ధమైయ్యె టంత వీలు గా వుంటాయి. అన్నమయ్యపాటలు స్వామి వారికే కాదు అమ్మవారికి కూడాచాలా ఇష్టం అమ్మవారిమీదకూడా చాలాపాటలు రాసారు. "క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం" అన్నపాట అమ్మవారి నీరాజనం ఇచ్చుసమయమున పాడారు. అమ్మను చూసి చక్కని తల్లికి చాంగుభళా అంటూ పాట చలా బాగుంటుంది. అంతే కాకు తిరుతిరు జవరాల అన్న పాట, వుయ్యాల పాటల,తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జనపదాలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంన్నాయి. అన్నమయ్యరచనలు ఇంచుమించు ముప్పైరెండువేలు పాటలు వుంటాయి. అన్నమయ్యకు పదకవితాపితామహుడు అన్నబిరుదు కలదు. అన్నమయ్య 32,000 సంకీర్తనలతో పాటు, సంస్క్రత వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తనా లక్షణం, ద్విపద రామాయణం, 12 తెలుగు శతకాలు, శృంగార మంజరి, వంటి "నానా ప్రబంధములను" రచించినట్టు చిన్నన్న రచించిన ద్విపద వల్ల తెలుస్తుంది. పద కవితా పితామహుడు, శ్రీహరి గాన లోలుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి శుభాకాంక్షలు .
రూథర్ ఫర్డ్ విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరు గలిగినవాడు. రాజుమంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవి పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవి పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత, 1923మే 7నకొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.
ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.
రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్ తో పోల్చింది.
1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు. శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో.
సుభాష్ చంద్ర బోస్ ఇలా అన్నారు సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.
"సీతారామరాజు" మీద పిల్లలతో ఎకపాత్రాభినయము చేయించేవారు. అప్పట్లో "సీతారామరాజు" బుర్రకధ ముగింపులో ఇలా చెప్పేవారు శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది. అని పాడేవారు.
అల్లురివారు ఎంత గొప్ప విప్లవ వీరుడొ కదా!
శ్రీ సీతారామరాజుగారికి మనబ్లాగ్ ద్వారా నివాలితో నీరాజనాలు అర్పిస్తున్నాను.