సోమవారం, ఏప్రిల్ 13, 2015
1796 ఏప్రిల్ 13న భారత దేశం నుండి పంపిన ఏనుగు
అమెరికా చేరినది. అప్పటివరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూడలేదు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది అది తెలిసాక. మనకు అయితే బాగా తెలుసు మన చిన్నప్పట్టి నుండి మనకు ఏనుగు కదలు పాటలు నేర్పేవారు. నాకు ఇప్పటికి గుర్తువున్న ఏనుగు పాట
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
మన హిందు పురాణగాధలలో విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి వినాయకుడు తలఖండించిన శివుడు ఏనుగు తలను తెచ్చి అతికించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. గజేంద్ర మోక్షములో మహా విష్ణువు సుదర్శన చక్రం తో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు. క్షీరసాగర మథనంలో పుట్టిన ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని యొక్క వాహనముగా వుంది.
అష్ట లక్ష్మిలలో గజలక్ష్మి ఒకరు. ఏనుగు ఒక భారీ శరీరం, తొండం
కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు
మరియు ఆసియా ఏనుగు
. హిందువులు
ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు
మరియు బాగా తెలివైనవి. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు. యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.మహారాజులు
అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల లలో మరియు సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
గజారోహణం, లతో మహారాజులు ఆనాటి గొప్ప కవిపండితులను సన్మానించేవారు.
శనివారం, ఏప్రిల్ 11, 2015
ఈ రోజు నా జన్మదినం అందుకని నా బ్లాగ్ మిత్రులందరికి మరియు శ్రేయాబిలాషులకు నమస్కారములు నన్ను ఆశీర్వదించండి.
గురువారం, ఏప్రిల్ 09, 2015
మనం చాలా సులువుగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డ్ చేయగలుగుతున్నాం. అలా రికార్డ్ చేయటానికి ఈనాడు అయితే అనేకనేక పరికరాలు అందుబాటులో వున్నాయి. మన చేతిలో నిరంతరం వుండే మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం. అంతకు ముందు టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు. వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పుడు నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860 వ సంవత్సరం ఏప్రిల్ 9 న ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను కనుగొన్నారు. దాని పేరు ఫొనాటోగ్రాఫ్ యంత్రం ( Phonautograph ).

దీనిని మొట్ట మొదట ఫ్రెంచ్ మెన్
Édouard-Léon Scott de Martinville కనుక్కోనాడు. దానిమీద పూర్తి అధికారాలు మార్చి 25 1857 లో పొందాడు. 
ఇతను ఫ్రెంచ్ ప్రింటర్ మరియు పుస్తకాలు అమ్మకం వ్యాపారం చేస్తూవుండేవాడు. వృత్తిరీత్యా అతను ఒక ప్రింటర్, అతను ఎల్లప్పుడూ కొత్త కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు గురించి చదువుతూవుండేవాడు మరియు అతను ప్రయోగాలు కూడా చేసేవాడు . స్కాట్ డి MARTINVILLE కాంతి మరియు ఫోటో కోసం ఫోటోగ్రఫీ అప్పటి కొత్త టెక్నాలజీ ద్వారా అతనికి ఆలోచన వచ్చింది. ఒక విధంగా ఆలోచించి మనిషి యొక్క ప్రసంగం యొక్క ధ్వనిని రికార్డింగ్ చెయ్యాలి అనే ఆసక్తి కలిగింది.
1853 నుండి ఆయన స్వర శబ్దాలు లిప్యంతరీకరణ యంత్రాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒక భౌతిక పాఠ్య పుస్తకం లోని మానవుని శారిర శాస్త్రంలో చెవి అంతర్బాగం డ్రాయింగ్లు వున్నాయి . అతను కర్ణ భేరిని చూసి దాని మాదిరిగా, ఒక దీపపు మసితో కవర్ అయిన ఒక కాగితం, చెక్క లేదా గాజు ఉపరితలంపై వత్తుతారు ప్రతిపాదిత ఒక stylus తో చిన్న ఎముక కోసం లేవేర్ యొక్క ఒక ధారావాహిక కొరకు సాగే పొర చొప్పిస్తూ ఒక యాంత్రిక పరికరం ను తయారు చేసారు. జనవరి 1857 26 న, అతను ఫ్రెంచ్ అకాడమీకి తన సీల్ చేయబడిన కవర్లో డిజైన్ అందించాడు.
Phonautograph ను తయారు చేయటానికి ఒక దీపం నలుపు పూత, చేతితో త్రిప్పే క్రాంక్ సిలిండర్పై ఒక చిత్రం చెక్కబడివుంది. ఇది ఒక గట్టి bristle తో కంపింపచేసే ఇది ఒక డయాఫ్రమ్ జత, ధ్వని సేకరించడానికి ఒక కొమ్ము ఉపయోగించారు . స్కాట్ ధ్వని వాయిద్యం మేకర్ రుడోల్ఫ్ కోనిగ్ సహాయంతో పలు పరికరాలను నిర్మించారు. 1877 యొక్క ఎడిసన్ యొక్క ఆవిష్కరణ కాకుండా, ఫోనోగ్రాఫ్, Phonautograph మాత్రమే ధ్వని మరియు దృశ్య చిత్రాలు రూపొందించినవారు. కానీ దానిని రికార్డింగ్ ఆడడానికి వీలు లేదు. స్కాట్ డి MARTINVILLE యొక్క పరికరం మాత్రమే ధ్వని తరంగాల శాస్త్రీయ పరిశోధనలు కోసం ఉపయోగించారు.
స్కాట్ డి MARTINVILLE ధ్వని రికార్డర్ ను మాత్రమె శాస్త్రీయ ప్రయోగాల కోసం ప్రయోగశాల లో ఉపయోగించేవారు. అంతే కాదు phonautographs అమ్మకములను కూడా చేయగలిగారు . ఇది అచ్చు శబ్దాలు యొక్క అధ్యయనానికి ఉపయోగపడుతుంది అని నిరూపించాడు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ