1796 ఏప్రిల్ 13న భారత దేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అప్పటివరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూడలేదు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది అది తెలిసాక. మనకు అయితే బాగా తెలుసు మన చిన్నప్పట్టి నుండి మనకు ఏనుగు కదలు పాటలు నేర్పేవారు. నాకు ఇప్పటికి గుర్తువున్న ఏనుగు పాట
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
మన హిందు పురాణగాధలలో విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి వినాయకుడు తలఖండించిన శివుడు ఏనుగు తలను తెచ్చి అతికించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. గజేంద్ర మోక్షములో మహా విష్ణువు సుదర్శన చక్రం తో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు. క్షీరసాగర మథనంలో పుట్టిన ఐరావతం అనే తెల్లని ఏనుగు, ఇంద్రుని యొక్క వాహనముగా వుంది.
అష్ట లక్ష్మిలలో గజలక్ష్మి ఒకరు. ఏనుగు ఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగుమరియు ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు మరియు బాగా తెలివైనవి. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు. యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.మహారాజులు అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా జంతుప్రదర్శనశాల లలో మరియు సర్కస్ లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు.
గజారోహణం, లతో మహారాజులు ఆనాటి గొప్ప కవిపండితులను సన్మానించేవారు.
గజారోహణం, లతో మహారాజులు ఆనాటి గొప్ప కవిపండితులను సన్మానించేవారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.