Blogger Widgets

బుధవారం, ఆగస్టు 31, 2011

Online Jai Ganesh Pooja.

బుధవారం, ఆగస్టు 31, 2011

         
వినాయక చవితి శుభాకాంక్షలు 


అవిఘ్నమస్తు
వినాయకుడు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న దేముడు. పిల్లల దేముడు. చదువుల దేముడు. కుడుము యిస్తే వరాలు ఇచ్చే భోళామూర్తి, గరిక పూజలకే సంబరపడే మంచి దేముడు. వినాయక చవితి వచ్చే కాలంలో నేలతల్లి తొలకరితో పులకరించి పచ్చపచ్చగా ఉంటుంది. కొత్త మోసులతో, గరికపచ్చలతో డొంకలు తివాచీ పరిచినట్లు ఉంటాయి. పున్నాగలు, గన్నేరులు పూజ కోసమే అన్నట్టు విచ్చుకుంటాయి. వినాయకుణ్ణి అర్చించే 21 రకాల పత్రిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.

వాటిని ఎరుక పరచడానికి, వాటిని స్మరించి తద్వారా విఘ్నేశ్వరుని స్తుతించడానికి సంప్రదాయం వచ్చింది. ఆటంకాలు రాకుండా కార్యసాఫల్యం కలిగిస్తాడనీ, విద్యాబుద్ధులు ఇస్తాడనీ విశ్వసించి పూజిస్తారు. పూలు, పత్రి సేకరించడం, వాటిని నేస్తాలతో పంచుకోవడం, మారకాలు వేసుకోవడం అదంతా పండుగలో పూజలో భాగమే. పూజ తరువాత తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపి, వినాయకుని జల నిమజ్జనం చేయడం మన ఆచారం. కొలిచిన వారికి కొంగు బంగారమై వినాయకుడు అందరికీ సకల శుభములూ చేకూర్చాలని కోరుతూ...
శ్రీ వినాయక పూజ




శ్రీ వినాయక పూజా విధానము
శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము
ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని, విధంగా ప్రార్థించుకోవాలి.
ప్రార్థన:
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు
శ్లో॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి
సుముహూర్తోస్తు
శ్లో॥ లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః
యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
సుమఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
దూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః
అష్టావష్టౌ నామాని యః పఠేచ్ఛ­ృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే।
అభీప్సితార్థ సిద్ధ్యర్థం, పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః (నమస్కరించుకుని ఆచమనము - ప్రాణాయామము చేసి విధంగా సంకల్పము చెప్పుకోవాలి)


సంకల్పం:
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (శ్రీశైలానికి దిక్కులో వుంటే దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ఖర నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షర్తౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ బృహస్పతివాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ ....గోత్రః .... నామధేయః, శ్రీమతః ....గోత్రస్య ....నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి.


పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే
తదంగ కలశపూజాం కరిష్యే


కలశపూజ:
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ మంత్రం చదవాలి)
కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుసమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మ­ృతాః,
కుక్షౌతుసాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి.
శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)
శ్లో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.


విఘ్నేశ్వర పూజ
గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం॥
శ్రీ మహాగణాధిపతయే నమః
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)


ధ్యానం :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అనే శ్లోకం చదువుతూ పూవులూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత వుంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు)
ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్ధరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి. పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరు వత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి శోడశోపచార పూజ చేయాలి. యధాభాగం గుడం నివేదయామి శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి.


మరలా ఆచమనం చేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి.
అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే- అంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.


శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ :
(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి) ఓం ఆంహ్రీంక్రోం యంరంలంవం శంషంసంహం - ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్క­ృత్వా (నమస్కారం చేస్తూ) ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శ్లో స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు॥
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)


షోడశోపచార పూజ :
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
శ్రీ గణాధిపతయే నమః ధ్యాయామి॥ (వినాయకుడి
విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)


అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ.
ఆవాహయామి॥ (మరల అక్షతలు వేయాలి)
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి (అక్షతలు లేదా పూలు వేయాలి)
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి॥ (ఉద్ధరిణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
పాద్యం సమర్పయామి॥ (మరలా కొంచె నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి॥ (కొంచె నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే-
మధుపర్కం సమర్పయామి॥ (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.


స్నానం
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృత స్నానం సమర్పయామి॥ (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి నీటిని స్వామిపై చల్లాలి)
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వభగవన్వుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదక స్నానం సమర్పయామి॥ (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి॥ (స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు)


రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి॥ (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
గంధం సమర్పయామి॥ (కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి॥ (స్వామికి అక్షతలు సమర్పించాలి)
సుగన్ధాని పుష్పాణి జాతీకుంద ముఖాని
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే
పుష్పాణి పూజయామి॥ (స్వామిని పూలతో పూజించాలి)


అథ అంగపూజ
గణేశాయ నమః పాదౌపూజయామి॥ ఏకదంతాయ నమః గుల్ఫౌపూజయామి, శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి, విఘ్నరాజాయ నమః జంఫౌ పూజయామి, ఆఖువాహనాయ నమః ఊరూం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయనమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందాగ్రజాయనమః స్కందౌపూజయామి, పాశహస్తాయ నమః హస్తౌపూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రంపూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరఃపూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి॥


అథ ఏకవింశతి పత్ర పూజ
(
ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి)

ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.


పూజకు కావలసిన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యిలేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.


చిన్నారి దేవుళ్ళ పండుగ
వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం. వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో వుంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు.


పూజా సన్నాహం
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించు కోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో వుంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పని సరిగా తయారు చేసుకోవాలి.


వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను వుంచుకుంటే బాగుంటుంది.
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
( క్రింది నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం దైవమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిథయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః,
ఓం లంబజఠరాయ నమః,
ఓం హ్రస్వగ్రీవాయ నమః,
ఓం మహోదరాయ నమః,
ఓం మదోత్కటాయ నమః,
ఓం మహావీరాయ నమః,
ఓం మంత్రిణే నమః,
ఓం మంగళస్వరాయ నమః,
ఓం ప్రమధాయ నమః,
ఓం ప్రథమాయ నమః,
ఓం ప్రాజ్ఞాయ నమః,
ఓం విఘ్నకర్త్రే నమః,
ఓం విఘ్నహంత్రే నమః,
ఓం విశ్వనేత్రే నమః,
ఓం విరాట్పతయే నమః,
ఓం శ్రీపతయే నమః,
ఓంవాక్పతయే నమః,
ఓం శృంగారిణే నమః,
ఓం ఆశ్రితవత్సలాయ నమః,
ఓం శివప్రియాయ నమః,
ఓం శీఘ్రకారిణే నమః,
ఓం శాశ్వతాయ నమః,
ఓం బలాయ నమః,
ఓం బలోత్థితాయ నమః,
ఓం భవాత్మజాయ నమః,
ఓం పురాణపురుషాయ నమః,
ఓం పూష్ణే నమః,
ఓం పుష్కరోత్షిప్తవారిణే నమః,
ఓం అగ్రగణ్యాయ నమః,
ఓం అగ్రపూజ్యాయ నమః,
ఓం అగ్రగామినే నమః,
ఓం మంత్రకృతే నమః,
ఓం చామీకరప్రభాయ నమః,
ఓం సర్వస్మై నమః,
ఓం సర్వోపాస్యాయ నమః,
ఓం సర్వకర్త్రే నమః,
ఓం సర్వనేత్రే నమః,
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః,
ఓం సర్వసిద్ధియే నమః,
ఓం పంచహస్తాయ నమః,
ఓం పార్వతీనందనాయ నమః,
ఓం ప్రభవే నమః,
ఓం కుమారగురవే నమః,
ఓం అక్ష్యోభ్యాయ నమః,
ఓం కుంజరాసుర భంజనాయ నమః,
ఓం ప్రమోదాయ నమః,
ఓం మోదకప్రియాయ నమః,
ఓం కాంతిమతే నమః,
ఓం ధృతిమతే నమః,
ఓం కామినే నమః,
ఓం కపిత్థవనప్రియాయ నమః,
ఓం బ్రహ్మచారిణే నమః,
ఓం బ్రహ్మరూపిణే నమః,
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః,
ఓం జిష్ణవే నమః,
ఓం విష్ణుప్రియాయ నమః,
ఓం భక్తజీవితాయ నమః,
ఓం జితమన్మథాయ నమః,
ఓం ఐశ్వర్యకారణాయ నమః,
ఓం జ్యాయసే నమః,
ఓం యక్షకిన్నర సేవితాయ నమః,
ఓం గంగాసుతాయ నమః,
ఓం గణాధీశాయ నమః,
ఓం గంభీరనినదాయ నమః,
ఓం వటవే నమః,
ఓం అభీష్టవరదాయ నమః,
ఓం జ్యోతిషే నమః,
ఓం భక్తనిథయే నమః,
ఓం భావగమ్యాయ నమః,
ఓం మంగళప్రదాయ నమః,
ఓం అవ్యక్తాయ నమః,
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః,
ఓం సత్యధర్మిణే నమః,
ఓం సఖయే నమః,
ఓం సరసాంబునిథయే నమః,
ఓం మహేశాయ నమః,
ఓం దివ్యాంగాయ నమః,
ఓం మణికింకిణీ మేఖలాయ నమః,
ఓం సమస్త దేవతామూర్తయే నమః,
ఓం సహిష్ణవే నమః,
ఓం సతతోత్థితాయ నమః,
ఓం విఘాతకారిణే నమః,
ఓం విశ్వగ్ధ­ృశే నమః,
ఓం విశ్వరక్షాకృతే నమః,
ఓం కళ్యాణగురవే నమః,
ఓం ఉన్మత్తవేషాయ నమః,
ఓం పరాజితే నమః,
ఓం సమస్త జగదాధారాయ నమః,
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః,
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః,
ఓం విఘ్నేశ్వరాయ నమః,
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః
అష్టోత్తర శతనామార్చనం
సమర్పయామి.


ధూపం
శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ
ధూపమాఘ్రపయామి॥
(అగరబత్తి వెలిగించి ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో కాని, అరటి పండుకు కానీ గుచ్చాలి.)


దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి॥ (దీపాన్ని స్వామికి చూపించాలి)


నైవేద్యం
(కొబ్బరి కాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి)
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్।
భక్ష్యం, భోజ్యంచ లేహ్యం చోష్యం పానీయ
మేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక-
మహానైవేద్యం సమర్పయామి॥ అంటూ ఆకుతో పదార్థాలన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. తరువాత స్వామికి నైవేద్యం పెట్టాలి.


తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్,
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
తాంబూలం సమర్పయామి.
(తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.)


నీరాజనం
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి॥
ఘృతవర్తి సహస్రైశ్చ
కర్పూరశకలైస్తథా నీరాజనం మయాదత్తం
గృహాణవరదోభవ నీరాజనం సమర్పయామి॥
(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, తరువాత హారతి పాత్రపై కొంచెం నీటిని వుంచి కళ్ళకు అద్దుకోవాలి)


మంత్రపుష్పం
(పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని శ్లోకాన్ని పఠించాలి)
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండః మహాకాయ కోటిసూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా
్ఙ(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)


ప్రదక్షిణ
శ్లో॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ।
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం)


తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకొని శ్లోకం చెప్పుకోవాలి.
యస్యస్మ­ృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్వో వందే తం గణాధిపం
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ... అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. నీటిని, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి. పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా అక్షతలు శిరసుపై ధరించాలి.
శ్రీ వినాయకవ్రతకథ
(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.
కథ పూర్తయిన తరువాత అక్షతలను శిరసుపై వేసుకోవాలి)


పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి "అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది'' అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.


"ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి- తండ్రీ! మానవులు వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు- నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. రోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతో గాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి.


అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమమైన వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.
కనుక ధర్మరాజా నువ్వు కూడా వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు వ్రతం చేయడం వల్లనే శ్యమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.


పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనేరాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియందుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు.


నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాదిదేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరు గంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూతధారియగు నాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై "ఏమి కావాలో కోరుకోండి.... ఇస్తాను'' అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి "ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుడ్ని అప్పగించు'' అని కోరాడు. మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు.


వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి "స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు'' అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. 'దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు - ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.


వినాయకోత్పత్తి
కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానా లంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్యసుందరుని వాకిట్లో వుంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది.


శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో వున్న బాలుడు పరమశివుడ్ని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో బాలుని శిరచ్ఛేదము చేసి, లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును బాలుని మొండెమునకు అతికించి శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.


విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు.


అందుకు శివుడు తన కుమారుల నుద్దేశించి "మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర దులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంద''ని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా, సులువుగా సాగివెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని, తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు.


జలములన్నియూ నారాయణుని అధీనములు. అనగా నారాయణ మంత్రం అధీనంలో వుంటాయి. వినాయకుడు మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. మంత్ర ప్రభావమున ప్రతితీర్థ స్నానమందును కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూచి నమస్కరించి "తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి ఆధిపత్యం అన్నగారికే ఇమ్మ''ని ప్రార్థించాడు.


చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి, పూజించగా, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు.


ఉదరం భూమికానిన చేతులు భూమికానక ఇబ్బంది పడుచుండగా, శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి, అందున్న కుడుములన్నీ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి "పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాపనిందల పొందుదురుగాక'' యని శపించింది.


ఋషిపత్నులకు నీలాపనిందలు
సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్యయైన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి, ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి నీలాపనింద కలిగింది.


దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా, అతడు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి, మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీపరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు " పార్వతీ! నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా''లని ప్రార్థించారు. తనయుడు మరల బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. " రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో రోజున చంద్రుని చూడరాదు'' అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇలా కొంతకాలము గడచె.


శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి, స్తుతించాడు. మాటల సందర్భంగా స్వామీ! సాయంకాలమయింది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఇక సెలవు అని పూర్వవృత్తాంతమంతయూ శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలుపిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. "ఆహా! ఇక నాకెట్టి అపనింద రానున్నదో'' అని అనుకున్నాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి మణిని మన రాజుకిమ్మని అడిగాడు.


"రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చు దానిని ఆప్తునకైన నెవ్వరు ఇవ్వ''రనిన సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగ ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, కృష్ణుడు, మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోష ఫలమని అనుకున్నాడు. దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది.


అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ ఘోరముగ యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు, రాళ్ళతోను, తుదకు ముష్టిఘాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది.


తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి "దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసికొంటిని. కాలమున నాయందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా, నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం జేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచూ అనేక యుగములు గడిపాను, ఇపుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితేచ్ఛ లేదు.


నా అపరాధములు క్షమించి కాపాడుము. నీ కన్న వేరు దిక్కులేదు'' అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయూ తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగ తన కుమార్తెనగు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోను, మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు "అయ్యో! లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితి''నని విచారించి "మణి సహితముగ తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి, తప్పు క్షమింపు''మని వేడుకున్నాడు.


శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు, మునులు స్తుతించి "మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి మాకేమి గతి'' యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై "భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్రదర్శనమయ్యెనేని ఆనాడు గణపతిని యధావిధి పూజించి శమంతక మణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక'' అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి, తమ ఇళ్ళకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమతమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి పొందుతూ సుఖసంతోషాలతో వున్నారు.


సర్వేజనాః సుఖినోభవంత

సోమవారం, ఆగస్టు 29, 2011

Eco-Friendly Ganesh Idol

సోమవారం, ఆగస్టు 29, 2011

మీరు ఈ గణేష్ చతుర్థి సృజనాత్మకముగా మరియు పర్యావరణ అనుకూలముగా  ఉండాలని చూడండి, అప్పుడు మీరు ఇంటి వద్ద గణేష్ విగ్రహాలు చేయవచ్చు. గణేష్ విగ్రహాలు మట్టి, కాగితం, కలప, పూలు, కూరగాయలను ఉపయోగించి ఇంటి వద్ద తయారు చేయవచ్చు. మీరు ఒక గణేష్ బొమ్మ కొనుగోలు ఉంటే, ఒక వాతావరణం అనుకూల వినాయకుడి కోసం ఎంచుకోండి.
పదార్థాలు పేపర్ వినాయకుడి అవసరమైన: పేపర్, ఘటి గమ్, తెల్లబడటం పొడి, పిండి,అల్యూమినియం రేకు లేదా మట్టి.

మీ బొమ్మ ఆధారంగా దీనికి, పాత న్యుస్ పెపర్లు మరియు నీటిలో కొంచెముసేపు వుంచి తరువాత ఒకసారి ఇది గ్రౌండింగ్ ద్వారా దాన్ని గుజ్జులా చెయ్యాలి.  దానికి ఘటి గమ్ ను 150 గ్రాముల టేక్ మరియు అది నీటి లో సజల మరియు కాగితపు గుజ్జుతో అది కలపాలి.

ఆ గుజ్జుకు  కొన్నిwhitening powder కలపాలి.  ఇప్పుడు గుజ్జు చపాతి పిండి వలె ఉంటుంది. పిండితో అవ్ట్ నిర్ధారించుకోండి.మరియు వినాయకుడి అచ్చు వాటిని స్టిక్.  ఇప్పుడు ఒక పిండి పేస్ట్ తయారు అయ్యింది. పిండి పేస్ట్ రెండు మూడు పొరలు తో అచ్చు కవర్ చివరకు అది కాగితం ఉంటుంది కవర్ మరియు ఇది పొడిగా వదిలి.
ఎండిన తరువాత, పిండి పొరను లాగండి. ఐడల్ చదును కు ఒక బ్రష్ లేదా sandpaper ఉపయోగించండి.
వాటిని పెయింట్ నీటి రంగులను ఉపయోగించండి.
కళ్ళూ, తిలకం మరియు ఇతర అంశాలు,అల్యూమినియం రేకు లేదా మట్టి ఉపయోగించి ఆభరణాలు, కిరీటం మరియు ఇతర అంశాలను మనం ఏర్పాటుచేయచ్చు.
మీకు చెక్కిన ఆసక్తి ఉన్నట్లయితే, మీరు గుమ్మడికాయ వలె కూరగాయలు నుండి గణేషుని తయారు చేయవచ్చు. కూరగాయలు ఎంపికను మీరు తయారు చేయలని అలోచనబట్టి వినాయకుడి పరిమాణం మరియు శైలి ఆధారపడి ఉంటుంది.
గణేష్ చతుర్థి సందర్భంగా ప్రతి సంవత్సరం, వినాయకుడి విగ్రహాలు నేల కాలుష్యం మరియు నీటి వనరులు endanger ఇది నదులు మునిగిపోతాడు ఉన్నాయి. అది మా పర్యావరణం సేవ్ మరియు ఇది మన పర్యావరణం అనుకూలమైన మార్గము.
వినాయకుడి రూపంలో ఒక sculptural marvel ఉంది. ఒక మానవుడు మరియు ఒక ఏనుగు యొక్క తల శరీరం తో, దాని నిష్పత్తిలో భారతదేశం నలుమూలల నికోచాలు మరియు కృషికారులు ద్వారా సూచిస్తారు పరిపూర్ణం అది హరావైరా వారి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.వినాయకుడి నిరంతరం వివిధ కొత్త అవతారం రూపాంతరం  ఉంది ఎవరు కళాత్మక స్వేచ్ఛ అత్యంత తట్టుకుంటాయి దేవతలను ఒకటి. దేవత రూపం అందం మరియు చక్కదనం సృజనాత్మక మరియు పర్యావరణ అనుకూలమైన వాటిగా  ప్రయత్నించండి ఎవరు సంప్రదాయ కృషికారులు పని లో వెంటనే స్పష్టంగా ఉంది.
e-Coexist  పర్యావరణ స్నేహపూర్వక ప్రత్యామ్నాయాలు అభివృద్ధి దృష్టి సారించి, ఒక సామాజిక సమూహం. ఒక 100 చేతులు చిన్న కళాకారులు మరియు కమ్యూనిటీలు వారి చేతిపనుల తార్కాణంగా ఒక వేదిక ఇస్తుంది మరియు చేతితో తయారు చేసినట్లు ప్రోత్సహిస్తుంది ఒక లాభాపేక్షలేని ట్రస్ట్ ఉంది. వారు ప్రస్తుతం ఒక 'సేఫ్ పండుగ ప్రచారం' వారు ప్రజల పండుగలు సమయంలో పర్యావరణ స్నేహపూర్వక ప్రత్యామ్నాయాలు ఉపయోగం ప్రోత్సహిస్తున్నాము.
 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలుషితం ప్రభావాల చాలా ఎక్కువ వుంటుంది.  దాని వాడకం చాలా వరకు తగ్గించాలి.  

విష రసాయన పేయింట్లు స్థానంలో - natural colors గురించి తీసుకురావడంలో విజయవంతమైన ఉంది మొదటి మార్చు వంటి పసుపు మరియు ఎరుపు భూమి వంటి సహజ రంగులు ఉపయోగించడం. "ఇప్పుడు మనము ఎప్పటికి తరగని ఉన్నప్పటికీ కూడా సహజ మట్టి అనుభూతి గా కాగితం ఉండగా ప్రయోగం కృషి చేస్తున్నారు కానీ అది దీర్ఘకాలిక పరిష్కారం కాదు."
ఒక హండ్రెడ్ చేతులు కృషికారులు కలిసి వచ్చి భారతదేశం యొక్క దాదాపు ప్రతి భాగం లో వారి సేకరణ తార్కాణంగా సహాయపడుతుంది. సురక్షిత ఫెస్టివల్ ప్రచారం హోలీ, దీపావళి మరియు గణేష్ ఛతుర్ధి సమయంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ వుంటుంది.  ఈ ప్రచారం మీడియా ద్వారా చాలా సాధ్యపడుతుంది.
గణేష్ చతుర్ధి పండుగను మనం ఆనందంగా జరుపుకోవాలని అశిస్తున్నాను.  పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి మనం చేద్దాం.  Thank You.

ఆదివారం, ఆగస్టు 28, 2011

First one is always alone.

ఆదివారం, ఆగస్టు 28, 2011

 ANNA WON!! ANNA WON!! ANNA WON!!
“First one is always alone till others follow. 
Do not stop your progressive efforts because you are not in majority at start.”






JAI HIND


శుక్రవారం, ఆగస్టు 26, 2011

నవనీత చోరుడమ్మా

శుక్రవారం, ఆగస్టు 26, 2011

గురువారం, ఆగస్టు 25, 2011

గోకుల్ చాట్బాంబు పేలుళ్లు నేటికి నాల్గేళ్ళు.

గురువారం, ఆగస్టు 25, 2011


ఈ రోజు రోజున అనగా  ఆగష్టు 25, 2007 మన రాష్ట్ర రాజదాని అయిన హైదరాబాదు లో జనసమ్మర్దంగా ఉండేచోట్ల బాంబు పేలుళ్ళు జరిగి 42 మంది వరకు మరణించారు మరియు మరో 70 మంది గాయపడ్డారు. లుంబినీవనంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించగా, కోఠి వద్ద గల గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుడులో 33 మంది మరణించారు.  


లుంబినీవనంలో రాత్రి ఏడున్నరకు లేజర్‌షో మొదలైంది. దాదాపు 500 మంది వరకు సందర్శకులు దాన్ని చూస్తున్నారు. వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయింది. 'గుడ్‌ ఈవినింగ్‌ హైదరాబాద్‌' అంటూ స్వాగత వచనం! అప్పుడూ సీట్ల మధ్యలో బాంబు పేలింది. పేలుడు ధాటికి ఘటనా స్థలిలోనే ఇద్దరు చనిపోగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 40-50 మంది వరకు గాయపడ్డారు. 


కోఠి ప్రాంతంలో గోకుల్ చాట్ ప్రముఖ స్థలం. సాయంత్రాల వేళ ప్రజలక్కడ ఎక్కువగా గుమిగూడుతారు. చాట్ మసాలా వంటివి దొరుకు ప్రదేశంగా పేరు పొందినది.  ఆ సంఘటన ఆ రోజు సాయంత్రం 7:40 ప్రాంతంలో, బాగా రద్దీగా ఉన్న గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మంది ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఆ నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను.

నందుడూ తెల్లన, యశోదమ్మ తెల్లన, నల్లని వాడవు......?

                 

శనివారం, ఆగస్టు 20, 2011

Happy Krishna Janmastami

శనివారం, ఆగస్టు 20, 2011





 లాలి శ్రీ కృష్ణయ్య



లాలి శ్రీ కృష్ణయ్య, నీల మేఘ వర్ణా
బాల గోపాల నీవు, పవ్వళింపరా

శృంగారించిన మంచి, బంగారు ఊయలలో

శంఖు చక్ర ధర స్వామి, నిదుర పోరా

లలితాంగి రుక్మిణి, లలనయె కవలెనా

పలుకు కోయిల, సత్య భామె కవలెనా

ఎవ్వరు కావలెనయ్య, ఇందరిలో నీకు 

నవమోహనంగనా, చిన్ని కృష్ణయ్య

అలుకలు పోవేల, అలమేలు మంగతొ

కులుకుతు శయనించు,వేంకటెశ్వరుడా


"Wishing that the Makanchor fills your life with all the colors of happiness!"

ఆదివారం, ఆగస్టు 14, 2011

Happy Independence Day

ఆదివారం, ఆగస్టు 14, 2011





శుక్రవారం, ఆగస్టు 12, 2011

రాఖీ పండుగ శుభాకాంక్షలు

శుక్రవారం, ఆగస్టు 12, 2011

వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు


సోమవారం, ఆగస్టు 08, 2011

నేత్రదానం (Donate Eyes)

సోమవారం, ఆగస్టు 08, 2011


నేత్రదానం గురించి చెప్పాలనుకుంటున్నాను.  మా అమ్మ చాలా రోజులు బట్టి నేత్రదానం చెయ్యాలని అనుకుంటుంది. అయితే దానికి ప్రొసీజర్ తెలియదు. అనుకోకుండా ఈరోజు సరోజిని ఐ హాస్పిటల్ కి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుని వచ్చింది దానితో పాటు అప్లికేషని కూడా తెచ్చింది.  అయితే అమ్మ తెలుసుకున్న విషయాలు మీకు కూడా తెలియచెయాలి అని నెను అమ్మా అనుకున్నాం అంతే కాదు అప్లికేషన్ కూడా యాడ్ చేస్తున్నా.  సరె అసలు విషయానికి వస్తే.

సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అన్ని ఇంద్రియాలకెల్లా కళ్ళే అతి ముఖ్యమైనవి. ఇవి లేకపోతే ప్రపంచం ఓ చీకటి గుయ్యారం. విదాత నిర్లక్ష్యంతో విధి వక్రించి అంధత్వంతో అనేక మంది జీవితాలను నెట్టుకొస్తున్నారు. వీరిలో కొందరికైనా వారి జీవితాలలో వెలుగులు ప్రసాదించాలనే ఉద్దేశం అందరిలో కలగాలని అనుకుంటున్నాను.
చూపు  వున్న ప్రతీ వారికి కంటి విలువ తెలుసు.  మనం అన్నీ చుడగలుగుతున్నాం అంటె కేవలం కళ్ళు వుందటం వల్లే.  శ్రుష్టిలో వున్న అందాలన్నీ చూడగలుగుతున్నాం.  అవే కళ్ళు లెకపోతే మనపరిస్తితి చాలా ఘొరంగా వుంటుంది. రాత్రుల్లు కరంటు పోయినప్పుడు ఎంత ఇబ్బందిగా వుంటుందో అందరికీ తెలుసు.  మనం కొంచెంసేపే ఏమీ చూడకుండా వుండలేము.  ఆ కొంచెం సేపులోనే కరంటు వాడిని తిట్టుకుంటాం కదా కదా మరి అల్లాంటప్పుడు కంటి చూపు లేని వారు ఎంత ఇబ్బంది పడతారో కదా. సరే

కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు.
ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికి కార్నియాలు నల్లగ్రుడ్డు  అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్‌ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు.

నేత్రదానం ఎవరు చేయవచ్చు అంటే:  కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్‌ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు.

నేత్రదానం ఎవరు చేయకూడదు అంటే:  హెచ్‌.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్‌(కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్‌ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తిచేసి ఇవ్వాలి. దానిమీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు.
వ్యక్తి మృతిచెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు తెలియజేయాలి.
ఆరు గంటల లోపు నేత్రాలను మృతిచెందిన వ్యక్తి నుంచి తీసుకోవాల్సి ఉంది.
సమాచారం తెలియగానే సంబంధిత ఆసుపత్రుల వైద్యుల బృందం అక్కడికి చేరుకుంటుంది.
అప్పటివరకు మృతుని నల్లగుడ్డు ఎండిపోకుండా చూడాలి. కళ్ళు రెండు మూసి తడిగుడ్డ పెట్టడం మంచిది. తలకింద తలగడపెట్టి తల ఎత్తుగా ఉండేలా చూడాలి. ఫ్యాన్‌ వేయకూడదు. ఏసీ సౌకర్యం ఉంటే ఆ గదిలో ఉంచవచ్చు.
మృతిచెందిన వ్యక్తి నుంచి సేకరించిన కార్నియాలను అవసరమైన వ్యక్తులకు 72 గంటల లోపు ఏర్పాటు చేయాలి. పెద్ద ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉన్నచోట నాలుగు రోజులు వరకు నిల్వ చేయవచ్చు.
వారు ఏమిచెప్పారు అంటే దరఖాస్తు చేయకపోయినా మన ఇంట్లోవాళకు ఎవరైనా చనిపొతే నేత్రదానం చేయాలనుకునేవారు కూడాచేయచ్చు.
మనం చనిపోయాకా ఎందుకూ పనికి రాని కళ్ళను దానం ఇచ్చి వేరే ఇద్దరికి చూపునిచ్చినవారం అవుతాము. దయచేసి నేత్రదానం చేయండి.

Eye Pledge form
Congratulations! on taking the first step in spreading the gift of sight. We can assure you there can be no other cause that is nobler. Please fill out these details below and we will send across this information to the nearest eye bank, which will then provide you with the eye pledge card.
More importantly, please ensure all your family members, near and dear ones are informed about your desire to donate your eyes, because if they do not give their consent, this pledge form will be rendered useless.


Visit to find the list of eye banks in INDIA

ఆదివారం, ఆగస్టు 07, 2011

Happy Sister's Day.

ఆదివారం, ఆగస్టు 07, 2011


Today not only Friendship Day, today also Sister’s Day is a special day as this day is dedicated to only sisters. On this day, sisters shower each other with gifts, flowers and chocolates. Sister’s Day is celebrated all over the world. It is a day when sisters rejuvenate their old memories and bond with each other by doing small activities.
They meet up for a cup of coffee, watch their favorite movie together or just simply chat. The whole idea of Sister’s Day is building a special bond for each other.
So happy Sister's Day. Enjoy with your sister's.

Happy Friendship Day


ఆదివారం, జులై 31, 2011

Lamarckianism

ఆదివారం, జులై 31, 2011

ఫ్రెంచి జీవశాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్ 1744 ఆగస్టు 1 న జన్మించాడు.

జీవ పరిణామవాదాన్ని మొట్ట మొదట ప్రతి పాదించింది. ఈయనే, ఈయన సిద్దాంతం ప్రకారం మొక్కలు జంతువులు పరిసరాలకు తగినట్లు తమ ఆకారాలు మార్చుకుంటాయని, ఆ మార్పులు వాటి తర్వాత తరాలకు సంక్రమిస్తాయని వివరించాడు. ఆయన సిద్దాంతంలోని 2 ముఖ్య సూత్రాలు ఏమిటంటె
1. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం ఉదాః ఎత్తయిన చెట్ల ఆకులు అందుకోవడాని జిరాఫీ మెడసాచి, సాచి అలా పొడవు పెరిగింది.
2. ఆర్జిత గుణాల అనువంశికతః జీవులు తాము పొందిన లక్షణాలనే తర్వాత తరాలకు అందిస్తాయనేది ఈ సిద్దాంత సారాంశం.
ఉదాః మెడపొడవైన జిరాఫీలు ఆ లక్షణాన్ని తమ తర్వాత తరాలకు అందిస్తాయి.
ఈయన సిద్ధాంతాలు తిరస్కరించబడినా, ఆ తర్వాత డార్విన్ లాంటి జీవపరిణామ సిద్దాంత వేత్తల్లో ఆలోచనలను తండ్రి ఒక మతపరమైన స్కూలులో చేర్పించాడు. లామార్క్ మతసంబంధ విషయాలేమీ రుచించలేదు. మత పాఠశాలను వదిలి, మెలిటరీలో చేరి ఫ్రెంటి సరిహద్దు దళంలో అనేక స్థావరాలలో పనిచేశాడు. ఆ సమయంలోనే ఫ్రాన్స్ లో గల సకల వృక్షజాతుల గురించి, పూర్తిగా అధ్యయనం చేసే అవకాశం లామార్క్ కు లభించింది. లామార్క్ కు చిన్నప్పటి నుండి శాస్త్రం అంటే చాలా ఇష్టం.

సైన్యంలో చేరిన తొమ్మిదేళ్ళకు ఆరోగ్య క్షీణించడంతో మిలటరీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు వైద్య శాస్త్రం రసాయన శాస్త్రం అభ్యసించాడు. జీవపరిణామ సిద్దాంతానికి పునాదులు వేశాడు.
లామార్క్ వ్యక్తి గత జీవితం, పేదరికం, విషాదంతో ముగిసింది. 1829 మరణించాక ఆయన, పుస్తకాలు, సేకరించిన వస్తువులు, గవ్వలు వేలంవేసి ఆ డబ్బుతో దహనక్రియలు జరపాల్సి వచ్చింది..

నిజంగా చాలా కష్ట పడ్డారు లామార్క్.  అతని గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా వుంది.

శనివారం, జులై 16, 2011

National Ice Cream Day

శనివారం, జులై 16, 2011

ప్రతీ సంవత్సరం జూలైలో మూడవ ఆదివారం National Ice Cream Day జరుపుకుంటారు.  మనలో చాలామందికి తెలియదు అని అనుకుంటాను. అందుకే నాకు చాలా ఇష్టమైన్ Ice Cream తో మీ ముందుకు వచ్చాను.
మనకు Ice Cream బాగా గుర్తుకు వచ్చేది వేసవి కాలంలో కదండి.  నాలాంటి వారికి అయితే ఎప్పుడైనా ఇష్టమే. బాగా వాతావరణం వేడిగా వున్నప్పుడు చల్లచల్ల గా తినాలనిపిస్తుంది.  Ice Cream పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ఇష్టమే. అలాంటి Ice Creams చాలా రకాలు వుంటాయి. ఇలాంటి Ice Cream Day  ఈ ఆదివారం జరుపుకుంటున్నారు. అసలు మొట్టమొదట Ronald Reagan జూలైలో వచ్చే మూడవ ఆదివారం జరుపుకోవాలని ప్రకటించారు.  
Ice cream లో పోషక విలువలు కూడావున్నాయి. కొంచెం ఎక్కువ  పంచదార, మరియు పాలు తో ఆరోగ్యకరమైన్ విటమిన్స్ వాడతారు. ఇందులో calcium శాతం ఎక్కువ వుంటుంది.
Charles E. Minches of St. Louis, Missouri గారు మొట్టమొదట తయారుచెసారు. దానిని On July 23, 1904 లో World's Fair in St. Louis, లో అతను పస్ట్రీ కోన్ లో రెండు స్కూప్స్ పెట్టి మొట్టమొదటి Ice Cream Cone ను పరిచయంచేసారు. దానిని మొట్టమొదట Italo Marchiony of New York City filed లో పేటెంట్ తీసుకుని అప్పుడు Ice Cream Fair ఏర్పాటు చేసారు.  అతను మొట్టమొదట lemon Ice Cream ను అమ్మటానికి వాడారు.
మరలా Ice Cream Day ను December 13 న జరుపుకుంటారు. మనం Ice Cream తింటూ చాలా సంతోషిస్తాం కదా మరి ఆలాంటి Ice Cream గురిచి తెలుసుకుంటున్నందుకు నాకు చాలా Happy గా వుంది.
So enjoy with Ice Cream, and I wish you happy Ice Cream Day. Thank you. 

మంగళవారం, మే 17, 2011

అన్నమయ్య పుట్టిన రోజు శుభాకాంక్షలు

మంగళవారం, మే 17, 2011

అన్నమయ్య పుట్టిన రోజు శుభాకాంక్షలు
    Get this widget |     Track details  | eSnips Social DNA    

సోమవారం, మే 09, 2011

Ultimate Pie Theft

సోమవారం, మే 09, 2011

ఆదివారం, మే 08, 2011

Happy Mother's Day

ఆదివారం, మే 08, 2011


ఆదివారం, ఏప్రిల్ 10, 2011

Wish Me

ఆదివారం, ఏప్రిల్ 10, 2011

Thank  You 

సోమవారం, ఏప్రిల్ 04, 2011

Happy Ugadi

సోమవారం, ఏప్రిల్ 04, 2011

శుక్రవారం, మార్చి 18, 2011

Happy Holi

శుక్రవారం, మార్చి 18, 2011



మంగళవారం, మార్చి 08, 2011

Happy women's day

మంగళవారం, మార్చి 08, 2011


బుధవారం, మార్చి 02, 2011

Wedding Day Greetings

బుధవారం, మార్చి 02, 2011


హాయ్! ఫ్రెండ్స్
 మా అమ్మమ్మ తాతయ్యల పెళ్ళిరోజు మార్చి 3 వ తేదిన 36 వ పెళ్ళిరోజు జరుపుకుంటున్నారు. కావునా నా బ్లాగు ద్వారా మా అమ్మమ్మ చింతా.విజయలక్ష్మి, మా తాత చింతా రామకృష్ణారావు గార్లకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి. నాతోపాటు మా అమ్మ రేవతీ రామకృష్ణ, మా మావయ్య రామశర్మ, మా అత్త లక్ష్మి, మొన్ననే పుట్టిన చిట్టి పాపాయి మావయ్య కూతురు మరియు మా పిన్ని లక్ష్మిసాయిరాం, మా చెల్లెళ్ళు- మెఘన, స్ఫూర్తి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితోపాటు, మా బందుమిత్రులు, మా బ్లాగ్ మిత్రులు కూడా వారికి 36 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరు కూడా చెప్పండి.
 
తాతా, అమ్మమ్మా మీ ఇద్దరికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు. Thank you for all. bye.
From 
Sree Vaishnavi


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)