Blogger Widgets

శనివారం, మార్చి 20, 2010

Humble Request for All :

శనివారం, మార్చి 20, 2010


Humble Request for All :doa
Kindly put a pot full of water in the balcony for birds to protect them in hot summer.If your house is a row house type, request to do the same for animals.
We must protect our birds &animals, those who can’t speak their troubles. ayam


sembah Thank You . 


సోమవారం, మార్చి 15, 2010

ఉగాది పండగ శుభాకాంక్షలు

సోమవారం, మార్చి 15, 2010

ఉగాది తెలుగు వారి పండుగ ఈ పండుగ తో తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగనే సంవత్సరాధి అని కూడా అంటారు. ఈ సంవత్సరం పేరు  వికృతి .  దీనిని వికృతి నామసంవత్సరం అంటారు.
ఉగాది పండుగరోజు ఉదయమునే లేచి, తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.  ఇంటిని మామిడితోరణాలతో పూలదండలతో అలంకరిస్తారు.  పరగడుపున ఉగాది పచ్చడి తినటం ఈ పండుగ ప్రత్యేకత. ఈ పచ్చడిలో చేదు, పులుపు, ఉప్పు, తీపి , వగరు, కారం అనే ఆరు రుచులు వుంటాయి.
మరి పచ్చడి చెయడానికి  వేప పూత, మామిడి, ఉప్పు, బెల్లం, కారం, చింతపండు వేసి పచ్చడి తయారుచేస్తారు.
ఈ పచ్చడి జీవితంలో మనకు కలిగే తీపి లాంటి సుఖాలను, చేదులాంటి కష్టాలను,సమానంగా అనుభవించాలని తెలుపుతుంది.  ఈ పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈపచ్చడి  వసంతలక్ష్మి కి నైవేద్యంపెట్టి అందరు స్వీకరించి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానిస్తారు.
ఉగాది రోజు సాయంత్రం గుడి ఆవరణలో పురోహితుడు పంచాంగం వినిపిస్తారు.  రాబోయే సంవత్సర్ ఫలితాలు , పాడి ఫంటలు ఎలా వుంటాయో చెబుతారు. మనకు జరగబోయే మంచి చెడులు చెపుతారు.  దీన్నే పంచాగశ్రవణం అని అంటారు.  ఇది చాలా ఆసక్తికరంగావుంటుంది.
ఈ పండుగ ను అందరు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అని  నాకు మా స్కూల్లో చెప్పారు.

ఈ సంధర్భంగా నా బ్లాగు మిత్రులు అందరుకు వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.

శుక్రవారం, మార్చి 12, 2010

అన్నిమంత్రములు నిందే యావహించెను.

శుక్రవారం, మార్చి 12, 2010


అన్నమాచార్యలవారి కీర్తన




AnniManthramulu.mp...

ప : అన్నిమంత్రములు నిందే యావహించెను


వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశుమంత్రము


చ : నారదుండు జపియించె నారాయణమంత్రము


చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహమంత్రము


కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము


వేరె నాకుఁగలిగె వేంకటేశుమంత్రము


చ : రంగగు వేసుదేవమంత్రము ధ్రువుఁడు జపించె


నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును


ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె


వింగడమై నాకునబ్బె వేంకటేశుమంత్రము


చ : యిన్ని మంత్రములకెల్ల యిందిరానాథుఁడే గురి


పన్నినదిదియే పరబ్రహ్మమంత్రము


నన్నుఁ గావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను


వెన్నెలవంటిది శ్రీవేంకటేశు మంత్రము 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)