Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 30, 2011

తిరుప్పావై షష్టాదస పాశురము

శుక్రవారం, డిసెంబర్ 30, 2011

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి  ప్రవేశింతురు .
పాశురము:
  నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ 
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.  

విక్రం సారాభాయ్

విక్రం అంబాలాల్ సారాభాయి
ఈ రోజు విక్రమ్ సారాభాయ్ మరణించిన రోజు డిసెంబర్ 31న ఈయన గురించి కొంచెము తెలుసుకుందాం. 
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు.
​విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్ , సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.  తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది.
వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. 
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. 
ఎప్పుడు ఐతే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యిందో అప్పుడు అతను ఇంటికి తిరిగి వచ్చారు మరియు ఈఈశ్c, బెంగుళూర్వద్ద సర్ సీ .వ్ .  రామన్ కింద ఒక పరిశోధన పండితుడు గా చేరాడు. అతను విశ్వ (కాస్‌మిక్ రేస్ ) కిరణాల లపై తను చేసిన కృషి పనిచేసింది. అతను బెంగుళూర్, పూనా మరియు హిమాలయాలు వద్ద కొలతలు కొలిచే అవసరమైన పరికరాలు నిర్మించారు. అతను తిరిగి 1945 లో కేంబ్రిడ్జ్  వచ్చాడు. 1947 లో అతను పీయెచ్ .డ్ పట్టా లభించింది. ​
ఇతని భార్య మృణాలిని సారాభాయ్. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు.   విక్రమ్ సారాబాయ్ గురించి చెప్పాలంటె చాలా ఉంది.  మనము వీలు చూసుకొని చెప్పుకుందాం.

జై హింద్

గురువారం, డిసెంబర్ 29, 2011

ఉరిమై ఉరిమెను పిడుగై సాగెను

గురువారం, డిసెంబర్ 29, 2011

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

తెల్లవారిపై నల్లత్రాచులా బుసలుకొట్టెను ఝాన్సీరాణి
నల్లమనసుల తెల్ల మనుషుల భరతంపట్టే ఝాన్సీరాణి
మీపాలిట యమదూతగమారి పాశంవిసెరెను లక్ష్మిబాయి
సాగదురాఇక మీపెత్తనము తప్పదురా మీ తిరుగుప్రయాణము

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

ఆత్మగౌరవము వెల్లువలాగా పెల్లుబికిన ఈఝాన్సీరాణి 
దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసుర మర్ధినిలాగ  
ఆటకట్టునీ ఆటకట్టునీ నీకపటాలన్ని కట్టిపెట్టు 
ఆంగ్లేయుడా ముటలుకట్టు నయవంచకుడా పయనంకట్టు

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

దుర్గాదేవి ఝాన్సీరాణి వీరనారి ఈనారీమణి 
నీపాలిట మృత్యువురా పారిపోండిరా ఆంగ్లేయులు 
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు 
నల్లమనసుల తెల్లమనుషులు   

వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను వీరనారి ఝన్సీరాణి 
ఆటకట్టు నీఆటకట్టు ఇకఆంగ్లేయుడా మూటకట్టు
వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి 

ఝాన్సీ లక్ష్మిబాయ్ జీ-తెలుగు సీరియల్ లోని టైటిల్ పాట నాకు  బాగా నచ్చినది. చాలా inspirational song .  ఆ సీరియల్ చూస్తూ వుంటే నాకు కళ్ళు చమరస్తున్నాయి.  పాటలో కూడా అంతే పవర్ ఉంది.    మీరు కూడా వినండి. 
Thank  you . 

తిరుప్పావై పంచదస పాశురము

ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు.  దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే  ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది.   ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
పాశురము:
  ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో  
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.   లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
జై శ్రీ మన్నారాయణ్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)