విక్రం అంబాలాల్ సారాభాయి
ఈ రోజు విక్రమ్ సారాభాయ్ మరణించిన రోజు డిసెంబర్ 31న ఈయన గురించి కొంచెము తెలుసుకుందాం.
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు.
విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్ , సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు. తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది.
వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు.
ఎప్పుడు ఐతే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యిందో అప్పుడు అతను ఇంటికి తిరిగి వచ్చారు మరియు ఈఈశ్c, బెంగుళూర్వద్ద సర్ సీ .వ్ . రామన్ కింద ఒక పరిశోధన పండితుడు గా చేరాడు. అతను విశ్వ (కాస్‌మిక్ రేస్ ) కిరణాల లపై తను చేసిన కృషి పనిచేసింది. అతను బెంగుళూర్, పూనా మరియు హిమాలయాలు వద్ద కొలతలు కొలిచే అవసరమైన పరికరాలు నిర్మించారు. అతను తిరిగి 1945 లో కేంబ్రిడ్జ్ వచ్చాడు. 1947 లో అతను పీయెచ్ .డ్ పట్టా లభించింది.
ఇతని భార్య మృణాలిని సారాభాయ్. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. విక్రమ్ సారాబాయ్ గురించి చెప్పాలంటె చాలా ఉంది. మనము వీలు చూసుకొని చెప్పుకుందాం.
జై హింద్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.