Blogger Widgets

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

శ్రీ రామకృష్ణ పరమహంస

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012

శ్రీ రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18, 1836 న జన్మించారు.  ఈయన హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని  ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను రచించెను.

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు.  అతను సాధువులు చెప్పే ఉపన్యాసములు చాలా శ్రద్ధగా వినేవారు. అప్పటినుండి ఆయనలో ఆద్యాత్మిక భావన ఎక్కువ అయ్యింది అనుటలో సందేహం లేదు.
గుడిలో విగ్రహం లో ఆయినా సజీవ దేవుడును చూసారు. కాళీ మాతను పూజించేవారు.  ఎక్కువ అద్యాత్మికత కలిగివుండటం వాళ్ళ రాత్రి పగలు తేడాలేకుండా ఎప్పుడు ద్యానంలోనే వుండేవారు.  అది చూచి అందరు రామకృష్ణ కు వివాహం చేయమని అందరు సూచించారు.  అప్పుడు ఐదు సంవత్సరాల శారదామాత తో వివాహం జరిపించారు.  ఈ శారదా మాతే శ్రీ రామకృష్ణ పరమహంస వారి ప్రధమ శిష్యురాలు గా వుంది.  ఆమె రామకృష్ణ పరమహంస గారి అడుగు జాడలలోనే నడిచింది.  ఆమె కూడా ఆద్యాత్మికత అలవర్చుకున్నది. 
రామకృష్ణ పరమహంస శారదామాతను దేవత పూజించుట 
 ఆమెను రామకృష్ణులవారు కాళీమాతగా కొలచి పూజించేవారు.   రామకృష్ణ పరమహంస అనేకమంది శిష్యులను మనకు అందించారు అందులో ముఖ్యడు వివేకానంద స్వామి.
రామకృషుని బోధనల లో ముఖ్యాంశములు. భగవద్ తత్వం గురించి చెప్పారు.
  1. సృష్టి లో ఏకత్వము
  2. అన్ని జీవులలో దైవత్వము
  3. ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
  4. మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
  5. మానవసేవే మాధవసేవ
  6. ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
  7. జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
  8. మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
  9. భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.
  10. బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
  11. కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.
 కొన్నాళ్ళకు క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 16 ఆగష్టు, 1886న మహాసమాధిని పొందెను. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారధ్యము వహించెను. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ది చెందారు.

బుధవారం, ఫిబ్రవరి 15, 2012

పుష్పవిలాపం

బుధవారం, ఫిబ్రవరి 15, 2012


కరుణశ్రీగా ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఖండకావ్యంలోని ఒక కవితా ఖండంపేరు పుష్పవిలాపం. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పుష్పవిలాపం మంచి పేరు వచ్చింది.  జంధ్యాల వారికి గుర్తింపు వచ్చింది.  పువ్వులు గురించి కవులు అనేక కావ్యాలు, కవిత్వాలు రాసారు.  వాటి అన్నిటికంటే పుష్పవిలాపంకు పేరు బాగా వచ్చింది. కరుణరసంతో సాగుతున్న ఈ కావ్యం వల్లే జంధ్యాల వారికి కరుణశ్రీ అన్నపేరు వచ్చిందేమో కదా!  
ఇందులో ఎలా వివరించారో చూడండి. ఘంటసాలవారి గాత్రముతో వున్నా కొన్ని పద్యాలను మాత్రం under  line  చేసాను. 


చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి
నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.
తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?
జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!
ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.
అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను

మంగళవారం, ఫిబ్రవరి 14, 2012

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ

మంగళవారం, ఫిబ్రవరి 14, 2012

 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||

 కమలాసతీ ముఖకమల కమలహిత |
 కమలప్రియ కమలేక్షణ |
 కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీపదకమలమే శరణు ||

పరమయోగిజన భాగధేయ శ్రీ |
 పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరి దేవ శరణు ||

గెలీలియో

టెలిస్కోప్ ఎవరు కనుక్కున్నారు అనగానే అస్సలు ఆలోచించకుండా చెప్పే ఆన్సర్  గెలీలియో అని. గెలీలియో జయంతి ఫిబ్రవరి 15, 1564లో జన్మించిన గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్ధిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. తరువాత అక్కడే  గణితశాస్త్రాచార్యుడిగా పనిచేశారుగడియారంలోని లోలకం ఈయన పరిశోధనల ద్వారానే తరువాత ఆవిష్కరించబడింది. మొదటిసారిగా చంద్ర మండలాన్ని పరిశీలించాడు. పాలపుంత అనేక నక్షత్రాల సముదాయమని మొదటగా చెప్పింది ఈయనే. ఈయన పరిశోధనలూ, అభిప్రాయాలూ నచ్చని మతాధిపతుల హింసలు భరించలేక వారికి లొంగి పోయాడు.
గెలీలియో కాలం అనగా 16 శతాబ్దం వరకు క్రీ..పూ. 4 శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు.
భౌతికశాస్త్ర పితామహునిగా పరిగణింపబడే గెలీలియో జనవరి 08, 1642లో మరణించాడు.
అన్నింటికన్నా దారుణం ఆయన పరిశోధనా వ్యాసాలను మతాధికారులు ఆయన మరణానంతరం తగలబెట్టారు. అయినా, విజ్ఞాన ప్రగతి ఆగిందా? ఆయన నిరూపించిన సిద్ధాంతం ఈనాటికీ అందరికీ ఆమోదయోగ్యమైంది. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి, ప్రపంచంమంతటా వెలుగులు నింపాలని, ప్రయత్నించిన ఒక మహానుభావుడిని మతాధికారుల మూర్ఖత్వం బలిగొంది. ఆయన కీర్తిని సూర్యమండలం మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తుంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)