Blogger Widgets

మంగళవారం, ఏప్రిల్ 24, 2012

రేడియో@మార్కొని

మంగళవారం, ఏప్రిల్ 24, 2012



Radio పితామహుడు గూగ్లీమో మార్కొని గురించి మనం చెప్పుకుందాం.  
వైర్‌లెస్‌ను మొట్ట మొదట  ఇటలీ దేశానికి చెందిన గూగ్లీమో మార్కొని కనుగొన్నాడు. మార్కొని 1874 ఏప్రిల్ 25న ఇటలీలో దేశములో జన్మించాడు. ఈయన  గొప్ప ధనవంతుల కుటుంబంలో జన్మించటం వలన ప్రవేట్‌గానే చదువు కొనసాగించాడు. ఈయనికి చిన్నతనము నుండి కొత్తవిషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనబరిచేవారు.  ఎప్పుడు కొత్త కొత్త వస్తువులు కనిపెట్టే ప్రయత్నం చేసేవారు.  ప్రతీ విషయాన్ని బాగా లోతుగా పరిశీలించేవారు.

వివోర్నో టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న సమయంలో ఒక వ్యాసం ఆయన దృష్టిని ఆకర్శించింది. ఆ వ్యాసం పేరు ‘వైర్లు లేకుండా రేడియో తరంగాల ప్రసారం సాధ్యమా?’ అన్నది.  అప్పట్లో 1894 నాటికి టెలిగ్రాఫ్‌ని తీగల ద్వారా పంపడమే గొప్ప. మరో రెండేళ్లలో మార్కొని ప్రయోగాలు చేసి రెండు మైళ్ల దూరం వరకూ తీగల సాయం లేకుండా రేడియో తరంగాలను ప్రసారం చేయగలిగాడు.   ఎలాంటి యానకం లేకుండా ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళగలిగిన తరంగాలు కాంతి (విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సాధ్యమవుతుందని మార్కొని గుర్తించాడు. తక్కువ తరంగా ధైర్ఘ్యము వున్న దృశ్య కాంతి కన్నా ఎక్కువ తరంగ  ధైర్ఘ్యము వున్న రేడియో తరంగాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయని మార్కొని  కనుగొన్నాడు. అందుకే ఈ సాధనాన్ని రేడియో  అని అంటారు.  తన పరిశోధనను ఇటలీ ప్రభుత్వం ఆమోదించకపోవడంతో బ్రిటిష్ వారికి ఇచ్చాడు. 1897 వ సంవత్సరములో ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.  అప్పట్లో మార్కొని కనుక్కొన్న  రేడియో పరికరాన్ని కొన్ని నౌకలలో వాడేవాడు.  క్రమంగా 1899 నాటికి రేడియో సంకేతాలను 31 మైళ్ల్ల దూరానికి ప్రసారం చేయగలిగాడు. 1901లో అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటి రేడియో సంకేతాలను ప్రసారం చేశారు. దీంతో వైర్ లెస్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఆ తర్వాత వైర్‌లెస్ వ్యవస్థ వలన ఎన్నో ఉపయోగాలు కలిగాయి. మార్కొని 1909లో భౌతికశాస్త్రంలో కార్ల్ ఫెర్డినాండ్ అనే మరో శాస్త్రవేత్తతో కలిసి నోబెల్ బహుమతి పొందాడు. నేడు తీగ లేకుండా సంకేతాలు పంపుతున్న, అందుకుంటున్న టెక్నాలజీకి ఆద్యుడు మార్కొని.  ఆ రేడియోని మార్కొని కనుకున్నారు దీని వలన అప్పట్లో ఒకరినుండి ఒకరికి కమ్యునికేషనికి బాగాఉపయోగించారు. అప్పడు తయారు చేసిన రేడియో చాలాచాలా  మార్పులు చెంది నేటి FM  వరకు రూపు దిద్దుకుంది.  ఈరోజుల్లో టీవీ లు వున్నా  రేడియో  అంటే ప్రజలు ఎక్కువ ఉపయోగిస్తున్నారు.  మనకు ఎక్కడ బడితే అక్కడ  రేడియో వినటానికి వీలుగా వుంది.  మనకు Online Radio లు కూడా ప్రజలుకు అందుబాటులోకి వచ్చాయి.   అలాంటి రేడియోని కనుక్కొన్న మార్కొని పుట్టినదినము ను గుర్తు చేసుకున్నందుకు  నాకు చాలా సంతోషంగా వుంది.  అతనికి భౌతికశాస్త్రములో నోభుల్ బహుమతి కూడావచ్చింది.

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

భూలోక స్వర్గం

శుక్రవారం, ఏప్రిల్ 20, 2012

దివాన్-ఎ-ఖాస్
"భూమి మీద ఎక్కడైనా స్వర్ఘము అంటూ వుంటే అది ఇదే" అని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ ద్వారా నిర్మించబడినది  ఈ భవనము.  ఈ భవనం ఢిల్లీ లో వుంది మరి ఆభవనం పేరు ఏమిటో తెలుసా  దివాన్-ఎ-ఖాస్.  ఇది రెడ్ ఫోర్ట్ లోని ఒక భాగము.  ఇది అద్భుతమైన కట్టడము. చక్రవర్తి గారి ప్రవేట్ విషయాలు చర్చించుకోవటానికి నిర్మించారు.  మొత్తం పాలరాయితో నిర్మించబడింది.  అక్కడ విలువైన నెమలి సింహాసనం మీద కూర్చొని విషయాలు చర్చించటానికి నిర్మించారు.  ఈ హాల్ నిర్మాణానికి పాలరాయి నవరత్నాలను ఉపయోగించి బంగారంతో నిర్మించారు.  నెమలి రూపంలో నిర్మించారు.  ఇలా తీర్చి దిద్దటానికి ఏడు సంవత్సరాలు కాలం పట్టిందిట. ఇలా చెప్తూ వుంటే ఈ నిర్మాణాన్ని చూడాలి అనిపిస్తోంది.  షాజహాన్ అన్నట్టు నిజంగా భూలోక స్వర్గంగా అనిపిస్తోంది కదండి. 

గురువారం, ఏప్రిల్ 19, 2012

ఛార్లెస్ డార్విన్

గురువారం, ఏప్రిల్ 19, 2012

మహావిశ్వాన్నీ, భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని ఎవరూ సృష్టించలేదనీ, వాటి కవే ఏర్పడ్డాయనీ, డార్విన్  చెప్పారు.  మన పాఠాల్లో చదువుకుంటున్నాం కదా!.  మరి ఈ డార్విన్ ఎవరు ఆయన సంగతి తెలుసుకోవాలని వుంది కదా!  చాలా క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఛార్లెస్ డార్విన్ ష్రుబర్రీ లో ఫిబ్రవరి 12, 1809  జన్మించాడు. వీరి తండ్రిగారు తాతగారు డాక్టర్లు. డార్విన్ తన చిన్నతనము లోనుండి ప్రకృతిని చాలా బాగా పరిశీలనా తత్వం కలవారు.  అదే ప్రకృతి పరిశీలనాశక్తి వారసత్వంగా సంక్రమించిందని మనకు తెలుస్తున్నది.  ప్రకృతి పరిశీలనపట్ల డార్విన్ కున్న ఇష్టం వల్లన డాక్టర్ కాలేకపోయాడుతన తండ్రి కోరిక మేరకు మతాచార్యుడిగా మారాడుతన పరిశీలనలకు ఎక్కువ సమయం దొరకడమే దీనికి కారణం.  175 ఏళ్ల క్రితమే భూమ్మీదే లేవంటే చాలా ఆశర్యంగా ఉంటుంది.  చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ జాతుల పుట్టుక అనే తన గ్రంథంలో జీవులన్నీ తమ కంటే సరళమైన ప్రాథమిక జీవుల నుండి ఆవిర్భవించాయని ప్రకటించి మత వాదుల సృష్టి వాద సిద్ధాంతాన్ని దెబ్బతీశారు. అప్పట్లో డార్విన్ చెప్పిన సిద్దాంతాలు ఎవరు నమ్మలేదు.   అప్పట్లో డార్విన్ పై అనేకమైన వ్యతిరేక ప్రచారాలు వుండేవి.  మనుషులు కోతులునుండి పరిణామం చెందాడు అని డార్విన్ అన్నదానికి.  డార్విన్  గేలిచేస్తూ ఇలా అనేవారు "మనుషులంతా కోతుల నుండి పరిణామం చెందలేదు డార్విన్ మాత్రమే కోతి నుండి వచ్చాడని"
NewsListandDetails
లండన్ కు చెందిన నావికాదళం దక్షిణ అమెరికా సముద్ర తీరాన్ని సర్వే చేయడానికి బీగల్ అనే ఓడలో బయలుదేరింది.  ప్రకృతి శాస్త్రజ్ఞుడైన డార్విన్ కు బృందంతో ప్రయాణించే అవకాశం దొరికింది. డార్విన్ డిసెంబర్ 27,1831 బీగల్ ఓడలో బయలుదేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు.  అప్పుడు ఆ  యాత్రలో డార్విన్ అనేక జీవ జాతులను, శిలాజాలాలను నిశితంగా పరిశీలించాడు. ప్రతి జీవజాతి వేరువేరుగా సృష్టించబడినదా అవి ఒకదానినొకటి ఒకానొక సామాన్య జీవజాతితో సంబంధం కలిగే వున్నాయా. అనే ప్రశ్నలకు సమాధానాలు వెదకసాగాడు. 1859 లో జాతుల పుట్టుక అనే గ్రంథాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట కొద్ది మంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. క్రమక్రమంగా తర్వాత వచ్చిన ఉత్పరివర్తన సిద్దాంతాలు కూడా పరిణామ వాదాన్నే బలపరిచాయి. దీంతో అన్ని చోట్ల డార్వాన్ సిద్దాంతానికి బలం వచ్చింది.  ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 19 డార్విన్ మరణించాడు. ప్రపంచ ప్రజలలో ఆలోచనలకు శాస్త్రీయత వైపు మళ్ళించిన మహా గొప్పమేథావిగా జీవశాస్త్ర చరిత్రలో నిలిపోయాడు.  

బుధవారం, ఏప్రిల్ 18, 2012

చూడచిన్నదానవింతే సుద్దులు

బుధవారం, ఏప్రిల్ 18, 2012

అన్నమాచార్యులు వారు రచించిన  మంచి పాట .  ఈ పాటను మనం గొప్ప సంగీత విద్వాంసులు అయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అద్బుత గళం నుండి మనం విందాం.

చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి

యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ 
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి

సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి

కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)