Blogger Widgets

శనివారం, నవంబర్ 17, 2012

కార్తీక పురాణము 4వ రోజు

శనివారం, నవంబర్ 17, 2012



వనభోజన మహిమ
ఓ జనకమహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలమునందు గాని, విష్ణ్వాలయము నందుగానీ శ్రీ భగవద్గీత గీతా పారాయణం తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి స్వర పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకు అందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండివున్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యధోచితముగా పూచింజి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించవలయును. వీలునుబట్టి పురాణ కాలక్షేపము చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్టులువారు చెప్పిరి.
అది విని జనకరాజు మునివర్యా! ఈ బ్రాహ్మణ యువకునికి నీచజన్మేల కలిగెను? దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా, వశిష్టులవారు ఈ విధముగా చెప్పనారంభించిరి.  రాజా! కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేశవర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నప్పటి నుండి భయభక్తులు లేక అతి గారాబముగా పెరుగుటవ వలన నీచసహవాసములు చేసి దురాచారపరుడై పెరుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, 'బిడ్డా! నీ దురాచారములకు అంతలేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుచూ నేను నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుము' అని బోధించెను.
అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట ఒంటి మురికి పోవటకే కానీ వేరు కాదు! స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతిరేకార్థముతో పెడసరిగా సమాధానమిచ్చెను.  కుమారుని సమాధానము వుని తండ్రి 'ఓరి నీచుడా! కార్తీక ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు ఎలుక రూపములో బ్రతికెదువు గాక' అని కుమారునిని శపించెను.  ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై, భయపడి తండ్రి పాదములపై పడి 'తండ్రీ! క్షమింపుము. అజ్ఞానాందకారములో పడి దైవమును, దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచనము ఎపుడు, ఏ విధంగా కలుగునో తెలుపుమని' ప్రాధేయపడెను. అంతట తండ్రి 'బిడ్డా! నా శాపమును అనుభవించుచూ మూషికమువై పడివుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తినొందుదువు' అని కుమారుడిని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికిపోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచూ, ఫలములను తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమైన నదికి వెళ్ళువారు ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచూ నదికి వెళ్ళుచుండెడివారు.  ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీ నదీ స్నానార్థం బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొఱ్ఱలో నివసించుచున్న మూషికము తినేందుకు ఏమైనా వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కి యుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు. వీరివద్ద ఉన్న ధనము, అపహరించవచ్చుననే తలంపుతో వారి వద్దకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి 'మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సుకు చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన, వివరింపుడు' అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు 'ఓయీ కిరాతకమా! మేము కావేరీ నదీ స్నానముకై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుని శ్రద్ధగా వినమని' చెప్పిరి.  అటుల కిరాతకుడు కార్తీకమహత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము గుర్తుకు వచ్చినది. పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను.అటులనే ఆహారమునకై చెట్టు మొదల దాగివుండి పురాణమంతయూ విన్న ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపముపొంది 'మునివర్యా! ధన్యోస్మి. తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని' అని తన వృత్తాంతమంతయూ చెప్పి వెడలిపోయెను.
కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరు వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించవలయును.

శుక్రవారం, నవంబర్ 16, 2012

నాగులు చవితి శుభాకాంక్షలు.

శుక్రవారం, నవంబర్ 16, 2012





నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమో స్తుతే


మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 
నాగులు చవితి శుభాకాంక్షలు. 

విశ్వామిత్రుని జన్మవృత్తాంతం

ఈరోజు విశ్వామిత్రుని జన్మదినముగా జరుపుకుంటారు.  విశ్వామిత్రుడు హిందూపురాణ కధలలో ఒక ముఖ్యమైన ఋషిగా చెప్పుకోవచ్చు.  ఈయన త్రేతాయుగము, ద్వాపరయుగానికి మద్య కాలము వాడు.   ఈయన రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను రామాయణ, మహాభారత, భాగవతాది కధలలో విశ్వామిత్రుని గురించి ఉన్నది. 
విశ్వామిత్రుని పుట్టిన రోజు కాబట్టి ఆయన జననము గురించి ఒక కధ వుంది.  గౌతమ మహర్షి, అహల్య ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండలో 51-65 సర్గల మధ్య వర్ణించాడు.
కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు.  విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.  గాధికి సత్యవతి అనే కుమార్తె కలదు ఆమెను ఋచీకుడు కు ఇచ్చి వివాహము చేస్తాడు.  వీరికి ఋచీకుడుకు మరియు గాధికి పుత్రా సంతానము లేకపోవటం తో ఋచీకుడు పుత్రకామేష్టి యాగం చేసి యోగాఫలంగా వున్న పాయసాన్ని రెండు భాగాలుగా చేసి సత్యవతికి ఒకభాగాముగా రెండవ భాగము సత్యవతి తల్లికి ఇమ్మన్నాడు.  సత్యవతి తీసుకోవలసిన భాగము వాల్ల మంచి బ్రహ్మర్షి అవుతాడు అని , రెండవ భాగము వలన మంచి బలవంతుడు, శక్తివంతుడగు రాజు కలుగుతారు అని చెప్పి.  రెండవ భాగాన్ని తన తల్లికి ఇమ్మని చెప్పాడు ఋచీకుడు.  తను సరే అని చెప్పి మరచి పొరపాటున తను రెండవ భాగము తీసుకొని  మొదటి భాగాన్ని తల్లికి ఇచ్చింది.  ఋచీకుడు  తెలుసుకొని వారికి శక్తివంతమైన రాజు పుట్టి అతను బ్రహ్మర్షి అవుతాడని చెప్పాడు.  అలా జన్మించిన వాడే గాధి పుత్రుడు ఈ విశ్వామిత్రుడు.  అందుకే రాజుగా జన్మించి కూడా ఋషి గా బ్రహ్మర్షిగా వున్నాడు.  విశ్వామిత్రుడు వసిష్టుని పై పట్టుదలతో ఎంతో కాలము తపస్సు చేసారు.  ఎన్నో ఎన్నెన్నో అస్త్రాలు సాధించారు ఐషికాస్త్రంవారుణాస్త్రంరౌద్రాస్త్రంఇంద్రాస్త్రంపాశుపతంమానవాస్త్రంముసలంగదలుధర్మచక్రంవిష్ణుచక్రంబ్రహ్మపాశంకాలపాశంవిష్ణుపాశం అనే  వివిధ అస్త్రాలు ఆయన తపశక్తి తో సాధించారు. బ్రహ్మబలా న్ని క్షత్రియ బలం తో జయించడం జరగదని భావించి, తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.చివరికి వసిష్టుని బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. ఈయన కదా ద్వారా మనిషి సాధించలేనిది ఏమిలేదు అన్నది ప్రయత్నాపూర్వకముగా నిరూపించిన గొప్ప ఆధార్శవంతుడుగా చెప్పుకోవచ్చు.  
విశ్వామిత్రుడు మనకు అందించినవి  రామాయణం బాలకాండలో  శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.  
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు  రామాపురుషోత్తమాతూర్పు తెల్లవారుచున్నదిదైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నదినిదుర లెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు  విశ్వామిత్రులవారు. ఇంకా గాయత్రీ మంత్ర సృష్టిని చేసారు,  శ్రీరామున కు గురువుగా వుండి అనేక అస్త్రాలు అందించి రాక్షస సంహారానికి కారకులు అయ్యారు.  ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని మనకు చెప్పటానికే  హరిశ్చంద్రుని పరీక్షించినాడు.  త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
విశ్వామిత్రుడు శకుంతలకు తండ్రి. ఆ విధంగా మనదేశానికి భారతదేశము అని పేరు కలగటానికి  అయిన భరతునకు తాత కూడా .

కార్తీక పురాణం 3వ రోజు


శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,

శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

కార్తీక స్నాన మహిమ
జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.

బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట
ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.
తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.
ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.
అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.
ఒకటవ బ్రహ్మరాక్షసుని కధ 
నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను.  వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

రెండవ బ్రహ్మరాక్షసుని కధ
ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.

మూడవ బ్రహ్మరాక్షసుని కధ  
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని. భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.

ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.
కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)