ఈరోజు విశ్వామిత్రుని జన్మదినముగా జరుపుకుంటారు. విశ్వామిత్రుడు హిందూపురాణ కధలలో ఒక ముఖ్యమైన ఋషిగా చెప్పుకోవచ్చు. ఈయన త్రేతాయుగము, ద్వాపరయుగానికి మద్య కాలము వాడు. ఈయన రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను రామాయణ, మహాభారత, భాగవతాది కధలలో విశ్వామిత్రుని గురించి ఉన్నది.
విశ్వామిత్రుని పుట్టిన రోజు కాబట్టి ఆయన జననము గురించి ఒక కధ వుంది. గౌతమ మహర్షి, అహల్య ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండలో 51-65 సర్గల మధ్య వర్ణించాడు.
కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది. గాధికి సత్యవతి అనే కుమార్తె కలదు ఆమెను ఋచీకుడు కు ఇచ్చి వివాహము చేస్తాడు. వీరికి ఋచీకుడుకు మరియు గాధికి పుత్రా సంతానము లేకపోవటం తో ఋచీకుడు పుత్రకామేష్టి యాగం చేసి యోగాఫలంగా వున్న పాయసాన్ని రెండు భాగాలుగా చేసి సత్యవతికి ఒకభాగాముగా రెండవ భాగము సత్యవతి తల్లికి ఇమ్మన్నాడు. సత్యవతి తీసుకోవలసిన భాగము వాల్ల మంచి బ్రహ్మర్షి అవుతాడు అని , రెండవ భాగము వలన మంచి బలవంతుడు, శక్తివంతుడగు రాజు కలుగుతారు అని చెప్పి. రెండవ భాగాన్ని తన తల్లికి ఇమ్మని చెప్పాడు ఋచీకుడు. తను సరే అని చెప్పి మరచి పొరపాటున తను రెండవ భాగము తీసుకొని మొదటి భాగాన్ని తల్లికి ఇచ్చింది. ఋచీకుడు తెలుసుకొని వారికి శక్తివంతమైన రాజు పుట్టి అతను బ్రహ్మర్షి అవుతాడని చెప్పాడు. అలా జన్మించిన వాడే గాధి పుత్రుడు ఈ విశ్వామిత్రుడు. అందుకే రాజుగా జన్మించి కూడా ఋషి గా బ్రహ్మర్షిగా వున్నాడు. విశ్వామిత్రుడు వసిష్టుని పై పట్టుదలతో ఎంతో కాలము తపస్సు చేసారు. ఎన్నో ఎన్నెన్నో అస్త్రాలు సాధించారు ఐషికాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, విష్ణుచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనే వివిధ అస్త్రాలు ఆయన తపశక్తి తో సాధించారు. బ్రహ్మబలా న్ని క్షత్రియ బలం తో జయించడం జరగదని భావించి, తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.చివరికి వసిష్టుని బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. ఈయన కదా ద్వారా మనిషి సాధించలేనిది ఏమిలేదు అన్నది ప్రయత్నాపూర్వకముగా నిరూపించిన గొప్ప ఆధార్శవంతుడుగా చెప్పుకోవచ్చు.
విశ్వామిత్రుడు మనకు అందించినవి రామాయణం బాలకాండలో ఈ శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. నిదుర లెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు విశ్వామిత్రులవారు. ఇంకా గాయత్రీ మంత్ర సృష్టిని చేసారు, శ్రీరామున కు గురువుగా వుండి అనేక అస్త్రాలు అందించి రాక్షస సంహారానికి కారకులు అయ్యారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని మనకు చెప్పటానికే హరిశ్చంద్రుని పరీక్షించినాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
విశ్వామిత్రుడు శకుంతలకు తండ్రి. ఆ విధంగా మనదేశానికి భారతదేశము అని పేరు కలగటానికి అయిన భరతునకు తాత కూడా .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.