Blogger Widgets

ఆదివారం, మార్చి 27, 2016

ఆహా నమో నమో ఆదిపురుష నీకు

ఆదివారం, మార్చి 27, 2016






ఆహా నమో నమో ఆదిపురుష నీకు
ఈహల నెంతవాడను ఎట్టుగాచితివి

లోకాలోకములు లోన నించుకొన్న నీవు
ఈకడ నా యాత్మలోన నెట్టణగితివి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాక్కుచే నీ నామముల వడి నెట్టణగితివి

అన్నిటా బ్రహ్మాదుల యజ़్జ భోక్తవైన నీవు
అన్న పానాదు లివి యెట్టారగించితివి
సన్నుతి పూర్ణుడవై జనియించిన నీవు
 వున్నతి నా పుట్టుగలో వొకచో నెట్టుంటివి

దేవతలచే పూజ తివిరి గొనిన నీవు
ఈవల నాచే పూజ ఎట్టుగొంటివి
శ్రీ వేంకటాద్రి మీద సిరితో గూడిన నీవు
ఈ వీధి మా యింట ఇపుడెట్టు నిలిచితివి ||

బుధవారం, మార్చి 23, 2016

వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ"

బుధవారం, మార్చి 23, 2016

"హోళికా" దహనం. 
ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.
శ్రీ మహా లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు.  
శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
’డోలోత్సవ౦ శుభాకాంక్షలు. 

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦!
ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!!

ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦.
వినోద సంబరాల రంగుల పండుగ "హోలీ" శుభాకాంక్షలు. 
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.  
 హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ.  హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు.  ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది. 


హోలీ పండుగను అందరు సంతోషము గా జరుపుకోవాలని అనుకుంటున్నాను.  
అయ్యప్ప జననదినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు అయ్యప్ప స్వామీ వారి జయంతి కూడా.  ఒకేరోజు ఎన్ని విశేషాలు వున్నాయో కదా !
ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్తమణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అయ్యప్ప జననదినోత్సవ శుభాకాంక్షలు. 

మంగళవారం, మార్చి 22, 2016

ప్రపంచ జలదినము (నీరు మరియు ఉద్యోగం )

మంగళవారం, మార్చి 22, 2016

నేడు 22 వ మార్చి 2012 ప్రపంచ జలదినము గా జరుపుకుంటున్నాం.  ఈనాటి జలదినోత్సవం జలము మరియు ఉద్యోగాలు అన్న థీమ్ తో జరుపుకుంటున్నాం.  ఆరోగ్యకరమైన ప్రపంచం కొరకు నీరు శుభ్రంగా వుంచుకోవాలి. అన్న ముఖ్య ఉద్దేశముతో జలదినము జరుపుకుంటున్నాం.

మనకు నీరు చాలా విలువైనది.  నీరు మనము బ్రతకటానికి ఎంతో ఉపయోగకరమైనది.  ఇది మనకు ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి అని నా అభిప్రాయం.  నిత్యావసరాలు అన్నీ నీటితోనే నిండి వుంది.  మనము దాహం వేసినప్పుడు నీరు దొరకపోతే. మన ప్రాణాలు నీటికోసము కొట్టుకుపోతాయి.  ఆ క్షణములో గ్రుక్కెడు నీళ్ళు దొరికితే మన ప్రాణాలు నిలబడినట్టు వుంటుంది.  అటువంటి నీటిని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి కదండి.  

అంతర్జాతీయ ప్రపంచ జల దినోత్సవం మంచినీటి యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించవచ్చు మరియు మంచినీటి వనరులకు  స్థిరమైన నిర్వహణ కోసం ఒక ఆలోచనకోసం మార్చి 22 న ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. మంచినీటి జరుపుకునేందుకు ఒక అంతర్జాతీయ రోజు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ (UNCED) 1992 వ సంవత్సరములో యునైటెడ్ నేషన్స్ సమావేశం వద్ద సిఫార్సు జరిగినది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మొదటి ప్రపంచ జల దినోత్సవం గా మార్చి 1993 , 22  న  కేటాయించడం ద్వారా ప్రతిస్పందించారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ జల దినోత్సవం మంచినీటి ఒక ప్రత్యేకముగా హైలెట్ చేసారు. 

ఈరోజు జలదినోత్సవ సందర్భముగా మనము నీటిని వృదా చేయద్దు అన్న ఉద్దేశ్యము తో ఇవిధంగా చెప్తున్నాను.  జనరల్ గా మనము నీటిని చాలా విదాలుగా వృదాచేస్తున్నాము.  ఉదాహరణకి మనలో చాలా మంది  దినచర్యలో  వారి దంతాలు బ్రష్ చేస్తూ tap విప్పి బ్రష్ కంప్లేట్ అయ్యేవరకు వదిలేస్తాము.   షవర్ ద్వారా బాత్రూమ్ లలో  ట్యాప్ ఉచితంగా నడుస్తున్న వదిలి యొక్క అలవాటు ఉంటుంది. అవివేకముగా  అనవసరముగా నీరు వ్యర్థం అవటానికి కారణమవుతుంది.  

ఆరోగ్యకరమైన ప్రపంచము కోసము పరిశుద్ధ నీరును పొదుపుగా మనము వాడుకుందాం.  దీనికోసము మనము అనవసరముగా నీటిని వృదా చేయద్దు.  మరియు పరిశుద్ధ నీటిని కలుషితము చెయ్యద్దు అని ప్రామిస్ చేద్దాం.

మంగళవారం, మార్చి 08, 2016

మహిళలూ మహారాణులు

మంగళవారం, మార్చి 08, 2016

ఈరోజు ప్రపంచం అంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక మహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.  ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో, అక్కడ దేవతలు ఆనందిస్తారు అంటారు.  ఒక్కొక్క ప్రాంతంలో వారి ప్రదేశాన్ని బట్టి వారి మహిళలకు ఇచ్చే ప్రేమ, గౌరవం, మర్యాద, ఆర్ధిక స్వాతంత్రం,  సామాజిక స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం, వారివారి సొంత గుర్తింపు కలిగించుకోవటానికి ఒక గుర్తుగా వుంటుంది ఈ మహిళా దినోత్సవం.  ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఈరోజును గుర్తించారు.  మన భారతదేశం లో అనాదికాలం నుండి మహిళకు ప్రత్యేకత నిచ్చేవారు.  స్త్రీని ఒక దేవతా స్వరూపంగా భావించేవారు.  పర స్త్రీ అంటే మాతృమూర్తిగా భావించేవారు. 

 నేడు మనదేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయి.  ఆధునికత అనే పేరుతో పరిస్థితులు మారిపోయాయి.  ఇది చాలా బాధాకరమైన విషయం.  అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా ప్రయాణిస్తున్న మహిళ మరలా అసమర్ధురాలిగా, అభద్రతా భావంవల్ల తను నిజంగా ఆత్మన్యూన్యతా భావం కలిగి మేము అసమర్దులమని దేనికి దైర్యం లేక  ఎన్నో ఆసలు కోరికలు వున్నా మేము ఏమి చెయ్యలేము అన్న భావంతో అడుగుముందుకు వేయలేకపోతున్నారు.  ఒకవేళ దైర్యం తెచ్చుకొని అడుగుముందుకు వేస్తే దానికి అనేక అడ్డంకులు కలిగి మానసిక వత్తిడి కలిగి ప్రయాణాన్ని ఆపేస్తున్నారు.   కుటుంబాలలో కూడా వారికి శారీరక మానసిక హింస ను ఎదుర్కొంటున్నారు.  అలాంటి జీవితాన్ని కాదని బయటికి వచ్చి స్వేచ్చగా వుండాలని వున్నా వుండలేని సామాజిక పరిస్థితి.  ఇవన్ని ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు.  ఈ మహిళా దినోత్సవాలు లాంటివి ఎన్ని జరుపుకున్నా మార్పు వస్తుందా?    స్త్రీ పట్ల వివక్ష అసలు అమ్మ కడుపులో నుండే మొదలు అవుతుంది.  స్త్రీగా పుట్టడమే పాపం అన్నట్టు వుంటుంది ఆమె జీవితకాలం ఎదుర్కొనే పరిస్థితులతో.  ఎన్ని చట్టాలలో మార్పు తెచ్చినా విద్యాభివృద్ది సాధించినా,  భూ ఆస్తి హక్కు కలిగించిన నేటి మహిళా పరస్థితి మారలేదు అనటంలో జగమెరిగిన సత్యం.
చట్టాలలో ఎన్ని మార్పులు వచ్చినా ఎక్కడికక్కడ స్త్రీకి అన్యాయం జరుగుతూనే వుంది.  ‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం’ అంటూ మహిళలను ఒకవైపు ఆకాశానికి ఎత్తేస్తున్నా. మరోవైపు రోజురోజుకూ వారిపై దాడులు పెరిగిపోతున్నాయి.  భ్రూణహత్యలు, అత్యాచారాలు, గృహహింస తదితర వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తున్నా వీటిపై సరైన అవగాహన లేక ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతీ అంశానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీగారు అన్నట్టు ఏనాడైతే ఒక మహిళా అర్దరాత్రి నడి రోడ్డు పై ఒంటరిగా నడవగాలదో ఆనాడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది . కాని 69 సంవత్సరాలు గడిచినా ఈ మహిళా స్వాతంత్ర్య పోరాటం చేస్తూనే వున్నారు.  అలా మారినరోజు ను నిజమైన మహిళా దినోత్సవంగా జరుపుకుందాం.  
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)