Blogger Widgets

సోమవారం, నవంబర్ 01, 2021

దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!

సోమవారం, నవంబర్ 01, 2021

Diwali Crackers

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
కాని దీపావళికి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.

దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దశిని ప్రేతచతుర్దశి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తొలి  జాములో నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్య్రం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రకృతి  సామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకం భయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకుంటాముట . స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణాలు ఇవ్వాలి.

ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    
దీపావళి శుభాకాంక్షలు

ఆదివారం, అక్టోబర్ 31, 2021

అండుకొర్రలు గురించి అన్నివిషయాలు.......(Healthy facts about browntop mil...

ఆదివారం, అక్టోబర్ 31, 2021

శుక్రవారం, అక్టోబర్ 29, 2021

మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు?

శుక్రవారం, అక్టోబర్ 29, 2021

 మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚(White rice is good or bad)

ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం

గురించి మాట్లాడానండి. అదేమిటంటే మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు. తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది. అసలు ఏ రైస్ తింటే మంచిది. ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.

శనివారం, అక్టోబర్ 02, 2021

ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ (Protein Rich Breakfast)

శనివారం, అక్టోబర్ 02, 2021

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)