Blogger Widgets

Wednesday, October 22, 2008

జై జవాన్ ............జై కిసాన్...........!

Wednesday, October 22, 2008

అరే ! ఏమిటిది అనుకుంటున్నారా ? ఏమి లేదండి ఈ రోజు మనం అందరు గుర్తు పెట్టుకోవలసిన రోజు.
అయ్యో ఏమిటి ఆలోచిస్తున్నారు ? ఈ రోజు మనం హాయిగా తింటున్నాము అతను లేకపొతే మనకు చాలాకష్టం. ఎవరనుకుంటున్నారా? మీరు ఎక్కవ ఆలోచించవద్దు . అతను ఎవరోకాదు దుక్కు దున్నీ, నీరు పెట్టి , నారు నాటి, పంటలు పండించే రైతు.
ఈ రోజు" రైతు దినోత్సవం "
భారతీయ రైతులకు అగ్రనాయకులల్లో ఒకరైన శ్రీ చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం ను పురస్కరించుకొని ప్రతీ సవత్సరం అక్టోబర్ ఇరవైరెండున రైతు దినోత్సవం ను జరుపుకుంటున్నారు.
రైతులనేవారు సమాజానికి రైతు వెన్నెముక్కలాంటివారు . రైతు పండించే పంటలమీదే మొత్తం సమాజం అంతా ఆదారపడి వుంది అంటే మనం ఆశ్చర్య పడనక్కరలేదు. రకరకాలైన పంటలను పండించే రైతులు, రాత్రి లేదు, పగలు లేదు ,ఎండనకా, వాననకా కష్టపడతారు.
ఈ దేశానికైనా సామాజిక, ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ శాతం ఆధారిపడి వుంది. ఇంత కష్టపడే రైతుకు జీవన పరిస్థితి అంత బాగోలేదు . ఇది చాలా బాధాకరమైన విషయం.
ప్రభుత్వం వీరికి సరైన సహకారం అందిస్తే బాగుంటుంది . వారి కి వారి కుటుంబానికి విద్యకు, ఆరోగ్యానికి , ఆధునిక వ్యవసాయ పద్దతులు లో శిక్షణ ఇచ్చి విత్తనాలు , ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఇప్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విషయాలలో సరైన రేటు ఇవ్వాలి. ఈ వస్తువు కొన్న అమ్మినా రైతులు మోసపోకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. రైతు కస్టపడి పండిస్తే మధ్యలో దారాలు లాభం పొందుతున్నారు. ఇలాజరగకుండా చూడాలి.
రాష్ట్రంలో సగటున ఒక్కో రైతుకు ఉన్న భూమి.. 3 ఎకరాలు.
ఒకటింపావు ఎకరా కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు… 45.70 లక్షలు.
రెండున్నర ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు… 28.47 లక్షల మంది. ఐదెకరాల లోపు భూమి కలిగినవారు 26.39 లక్షల మంది.
50 ఎకరాలకు మించిన భూమి ఉన్నవారు… కేవలం 6920 మంది.
ఈ రకం గా వున్నా వారు అంత కాస్త పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేధు. రైతులకి తగిన కష్టఫలం దొరకకపోతే రైతుకి వ్యవసాయం మీద విరక్తి కలిగి వారు కుడా ఉద్యోగాలకోసం వెళ్ళిపోతున్నారు.
ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వారి అవసరాలు తీర్చి వారిని ఉత్సాహపరచి , వారిని సత్కరించాలి.
లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ .........జై కిసాన్ .........అన్నారు . ఇది నిజం దేశాన్ని బోర్డర్ దగ్గర వున్నా జవాను, బోర్డరు లోపల వున్నా కిసాను మనకి చాలా అవసరం. వారి విలువలు మనం కాపాడాలి . రైతే రాజు అన్న నానుడి నిజం చెయ్యాలి. విష్ యు హ్యాపీ కిసాన్ డే.

3 comments:

 1. let us wish that Indian farmers will have the golden days back.

  ReplyDelete
 2. చాలా టెన్షన్ వ్యసాయం చేయటం .విత్తనాల కొరత,ఎరువుల కొరత ,వర్షం రాకపొఇనా బాదే ,వర్షం ఎక్కువైనా కష్టాలే .చివరకు పంట చేతికోచ్చేవరకు నమ్మకం లేదు .అంత కస్టపడి పండిం చినా గిట్టుబాటు దొర దొరకదు .రైతుల దగ్గరనుంచి వినియోగదారుల దగ్గరకు చీరే సరికి రెండు మూడు రెట్లు దర పెరుగుతుంది.
  దేశానికీ రైతువెన్నెముక తే
  రై తే రాజు ....ఇవన్ని ఉత్త మాటలే
  బిజినెస్ చీస్ వారైనా ,ఏవైనా వస్తువులు తయారు చీసేవరైనా తామూ పెట్టిన పెట్టుబడికి లాభాన్ని కలుపుకోని మార్కెటింగ్ చేసు కుంటారు .ఒక్క రైతు మాత్రం అలా చెయలేడు .. ఎవరో దర నిర్ణ ఇస్తారు .కరంటు ప్రి గా ఇస్తే ఉపయోగం లేదు . మార్కెటింగ్ వ్యవస్త మార్చాలి.అప్పుడే వెన్నెముక ఆరోగ్యం గా వుంటుంది .ధన్యం కోసం ఇతర దేశాల మిద ఆదరపడవలసిన అవసరం ఉండదు.

  ReplyDelete
 3. its really nice to see yah back in the format of really clever baby and you have got very very nice mother.

  all the best for ur future and missing you dear

  ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers