Blogger Widgets

Friday, May 29, 2009

చిన్ని కృష్ణయ్యా బేరము ( కధ )

Friday, May 29, 2009

శ్రీ కృష్ణునికి 3rd year ప్రారంభమయ్యింది . ఒకనాడు ఒక ముసల్లమ్మా కొన్ని అడవి పండ్లను అమ్మడానికి తీసుకొని వచ్చింది. కృష్ణుడు ఆ పండ్లను చూసి " అవ్వా! ఈ పండ్లంటే నాకు చాలా ఇష్టం . వీటిని నాకు ఇస్తావా?" అని అడిగాడు . ఆ అవ్వ - నాయనా నేను ఇవ్వటానికే వచ్చాను. అయితే వీటికి తగిన వెల నివ్వాలి మరి అప్పుడే ఇవ్వగలను అని అంది అవ్వ.
అప్పుడు కృష్ణయ్యా ఏమితెలియిని అమాయకుని వలె మొఖం పెట్టి అవ్వా వెల అంటే ఏమిటి ? అని అడిగాడు. అప్పుడు అవ్వ నేను నీకు ఫలము ఇస్తే - ప్రతిఫలమేమైనా నాకు ఇవ్వాలి . అని అంది . కృష్ణుడు లోపలి కి వెళ్లి తన చిట్టి చేతులతో కొన్ని బియ్యం తీసుకొని వచ్చి ముసలమ్మ వొడిలో వేసాడు. ఆమె చాలా సంతోషించింది వెంటనే కృష్ణునికి చేతులు నిండా పండ్లు పెట్టి తన ఇంటికి బయలు దేరింది. ఒక్కొక్క అడుగు వేస్తువుంటే నెత్తి మీద వున్నా బుట్ట బరువు పెరిగిపొతూ వుంది .ఇంటికి వెళ్లి బుట్టను క్రింద పెట్టి చూసింది అవ్వ. కృష్ణుడు ఇచ్చిన బియ్యపు గింజలు అనంతమైన రాత్నాలుగా మారిపోయి వున్నాయి.ఆమెకు బుట్టనిండా రత్నాలు కనిపించాయి. ఆహా ! ఇతనెవరో భగవంతునివలె వున్నాడు. లేనిచో ఈ ధన్యమంతా రత్నాలుగా మారడానికి వీలు అవుతుందా? నేనెంత అద్రుస్తావంతురాలను! అని తనలో తను ఆనందించింది పోరిగితి వారికి అందరిని పిలిచి మరీ చూపించి సంతోషించింది అవ్వ.

చిన్ని కృష్ణుని బేరము చూసారా ఎలావుందో. నాకు నచ్చింది మీకు నచ్చిందా మరి.

చెప్పుకోండి చూద్దాం? పొడుపు కధలు

నేను ఈ రోజు నేను పొడుపు కధలతో వచ్చాను , అయితే మీరు ఏమిచెయ్యాలో తెలుసా .................! వాటికి మీరు answar చెయ్యాలి మరి అందరు రడీనా అయితే అందుకోండి మరి.
1) ఒకాయన్ని నాలుగక్షరాల పేరుతొ పిలుస్తారు. మొదటి అక్షరం లేకపోతె `యుద్ధం' అని అర్ధం రెండో అక్షరం లేకపోతె `మెతుకు' అని అర్దము, ముడో అక్షరం లేకపోతె ` చెయ్యి' అని అర్ధము. ఇంతకీ నాలుగాక్షరాలాయన ఎవరు?
2) ఒకటి పట్టుకొంటే - రెండు ఉగుతాయి ఏమిటది ?
౩) ఓరోరి అన్నారో! నీ వాళ్ళంతా ముల్లురో! కారాకుపచ్చరో ! కండంత చేదురో ఏంటది?
4) కట్టుకొని పెట్టుకునేదేమిటి?
5) కతకతకన్గు, మాతాతపిమ్గు, తోలు తీసి మింగు ఏమిటది?
మరి answer చేయండి నేను waiting answer తెలుసుకోవాలని వుంది. చెప్పండి please. ok bye.

Friday, May 22, 2009

భగత్ సింగ్ జైల్లో వున్నప్పటి చిత్రము

Friday, May 22, 2009

చిత్రము భగత్ సింగ్ జైలు లో వున్నప్పటి ఫోటో, భగత్ సింగ్ కొద్దిగా పొడుగుగా , బక్క పలచగా చకచకా మాట్లాడే వ్యక్తిగా ఉండేవారుట . ఆయనకు నలుగురిలో మాట్లాడటమంటే కొంచెం బిడియమాట . భగత్ సింగ్ కొద్దికాలము విలేఖరి గాను, టీచర్ గా ను కుడా పని చేసారుట.

Wednesday, May 20, 2009

కప్పా - పాము

Wednesday, May 20, 2009
మొదటి ఫోటోలో పాము కప్పని పట్టుకుంది. 2 ఫోటోలో కప్పని వదిలిచే ప్రయత్నం. 3 కప్పని వదిలి వెళ్లి పోతున్న పాము.


4. బతికి పోయిన కప్పు.
అయితే వీటి మద్యలో పిల్లి కుడా జాయిన్ అయ్యింది కానీ మద్యలో ఎందుకో వెళ్ళిపోయింది నా కెమేరాకు చిక్కలేదు .

Tuesday, May 19, 2009

అబద్ధాలూ ఆడవచ్చా - ఆడకూడదా ?

Tuesday, May 19, 2009

హాయ్ అందరికీ! నాకు చాలా రోజులబట్టీ ఒక ప్రశ్న మనసులో వుంది . అసలు అబద్ధాలూ ఆడవచ్చా ఆడకూడదా అని.
నా కే కాదు నా స్నేహితులకు కుడా ఆ ప్రశ్న మనసులో వుంది. అందుకే వారి ఆలోచనలుతో మీ ముందుకు వచ్చాను. మా అమ్మా నాన్నలు , అమ్మమ్మలు కదలు చెప్తారు . అందులో ముఖ్యముగా సత్యమేవ జయతే అనే కదా అది అందరికీ తెలుసు ఆవు పులి కధే........! ఆ కధలో నీతి ఎప్పటి కైనా సత్యమే గెలుస్తుంది అని. తరువాత ఇంకో కదా అది నాన్నా పులి వచ్చే కదా........ఈ కధలో నీతి హాస్యానికి కుడా అబద్ధము ఆడకూడదు అని. దాని తో పాటు హరిశ్చంద్రుడు కదా......ఎన్ని కస్టాలు వచ్చినా అసత్యము ఆడకూడదు అని కదలు చెప్పి మరీ మాచేత అబద్దాలు ఆడకూడదు అని చెప్తారు పెద్దవారు.
ఓకే .... ...........
అలాగే అని నిజం చెప్తే ఒక్కొక్క సారి కొడతారు తిడతారు. మీరే కదా అబద్దం చెప్పద్దు అన్నారు అంటే నోరుమూసుకో మాట్లాడకు అని కోపపడతారు. ఈ సంగతి చూడండి మీరే మా ఫ్రెండ్ పేరెంట్స్ తో ట్రైన్ lo వెళ్తోంది . అయితే ట్రైన్ టికెట్ తీసుకున్నారు . అయితే మా ఫ్రెండ్ కి టికెట్ తీసుకోలేదుట . టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగితె నా ఫ్రెండ్ వయసు 4 1/2 సంవత్సరాలు అని చెప్పారు . అప్పుడు నా ఫ్రెండ్ నా వయసు 6 సంవత్సరాలు అని చెప్పిందిట . ఆ సంగటన జరిగిన కాసేపటికి ఆ అమ్మాయి పేరెంట్స్ కొట్టి తిటారుట. అదేమిటి నిజం చెప్తే అలా జరిగింది.
ఇంకో ఫ్రెండ్ ఇంట్లో అన్నా చెల్లెలు వున్నారు చెల్లి అబద్దము ఆడుతోంది అని అన్న వాళ నాన్నకి ఫిరియాదు చేసాడు. అయితే వాలనాన్న డబ్బలాడాడు చెల్లిని అబద్దం ఆడితే కళ్లు పోతాయి అని చెప్పారు.
అది ఒకే...వెంటనే వాలనాన్నకి ఎక్కడి నుండో ఫోన్ వస్తే వాళ అన్నయ్య ఫోన్ రిసీవ్ చేసుకున్నాకా నాన్న క్యాంపు వెళ్ళాడని చెప్పరా అని లోపలి నుండి వాలనాన్న చెప్పాడు. మరి అప్పుడే అబద్దము ఆడకూడదు అని చెప్పిన నాన్నా అప్పుడే ఫోన్ lo అబద్దము చెప్పించాడు మరి అది అబద్దము కాదా? పోనీ పెద్దవాలకి కళ్లు పోవా ..........పెద్దవారు అబద్దము ఆడవచ్చా????? పిల్లలే అబద్దము ఆడకుదడా???????
ఇంకో ఫ్రెండ్ నాన్న అయితే ఆఫీసు కి వెళ్ళటం ఇష్టం లేకపోతె మా అమ్మాయికి ఆరోగ్యం బాలేదు డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి అని ఫోన్ lo ఆ అమాయి ముందే వాళ నాన్న అబద్దము ఆడాడు . సెలవు తీసుకొని వలనాన్నా ఇంటిలోనే వున్నాడు.
ఇలాంటి సంగతులు జరుగుతున్నప్పుడు మాకు అస్సలు అర్ధం కావటం లేదు అబాద్దలు ఆడచ్చా ఆడకుదడా అని. మీరే చెప్పండి.
మా అమ్మ నాకు ప్రాణం పోయినా అబద్దము ఆడద్దు అని ఒకసారి అబద్దము ఆడితే దాని వేణు వెంటనే చాలా అబద్డాడు ఆడవలసి వస్తుంది అది తప్పు అని చెప్తుంది మరి.
ఏమి చేయాలి మేము మీరే చెప్పండి . మరి .

Wednesday, May 06, 2009

SAVE ENERGY GAME (శక్తి పొదుపు ఆట)

Wednesday, May 06, 2009

celebrateSAVE ENERGY GAME : Flip a cardboard piece shaped like a coin marked 1 on one side and 2 on the other side.
Flip and move to the places the cardboard coin indicates. If you reach a place where there is a saved energy message, you will get a chance to move up extra places.
If you reach a place which indicates ` waste of energy ' you will be demoted.
you can only a do - it- your self game idea.

+ Smokless chula-less fuel -5

+ social forestry for fuel food & wood -6

+ tube light - less electricity -3

_ deforestation destroying energy sources, -10

_ misuse of energy -4-8 (10)


శక్తి పొదుపు ఆట

Friday, May 01, 2009

సమ్మర్ సందడే సందడి

Friday, May 01, 2009
celebrate స్కూల్ ఎగ్జామ్స్ అయ్యిపోయాయి సమ్మర్ సెలవులు ఇచ్చారు . ఫుల్ సందడే సందడిcelebrate . హోం వర్క్స్ లేవు , చదువులు లేవు, ఆటలే ఆటలు, పాటలు చాలా సందడి చెయ్యాలని వుంది అందులో బాగంగా నృత్యము, సంగీతము నేర్చుకుంటున్నాము. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్లానే చేసుకున్నాము మీరు నాతో సందడి చేయటానికి రడీ కండి మరి .
మాతాత (శ్రీ చింతా . రామ కృష్ణా రావు ) అధ్యక్షణ తో శ్రీ ముత్యం రామమూర్తి సంగీత కళా పీఠం స్థాపించబడింది. సమ్మర్ లో నాలాంటి వారి కోసం వేసవి ఉచిత సంగీత ,నాట్య శిక్షణా శిభిరాన్ని ప్రారంభించారు. సిక్షనామ్సములు కర్ణాటకా సంగీతము, కూచిపూడి నాట్యము, నేర్పిస్తున్నారు . మా గురువుగారి పేరు " పంచముఖి తలావదాన తరుణ భాస్కర " శ్రీ ముత్యం రామకామేశ్వర రావు గారు.
కార్యక్రమానికి మూలము శ్రీమతి పి . మీనాక్షి&రాజశేఖర్ గారు , శ్రీ చింతా . రామకృష్ణారావు గారు , శ్రీ ముత్యం రామ కామేశ్వరరావు, శ్రీ పాకాల సురిబాబుగారు, మొదలగు ప్రముఖులు కలరు,
ప్రారంభోత్సవము : ప్రముఖ టీవీ మరియు రేడియో కళాకారిణి శ్రీమతి ఇందిరా బాల భాగవతారిని గారిచే ప్రారంబించబడింది .ros so I am bizzy in summer also. oke .

My Blog Lovers