Blogger Widgets

Tuesday, December 22, 2009

తిరుప్పావై తొమ్మిదవ పాశురం

Tuesday, December 22, 2009

ఆండాళ్ తిరువడిగలే శరణం :


ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు . ముదడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారి ని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.
అటువంటి ప్రేమ మనకు కావాలికదా, అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వరుఉపము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.
ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది . అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు మేల్కొల్పబదుచున్నధి.

పాశురం:

Pasuram09-HH.mp3
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం

మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో

ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:

పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తెమూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటార 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఎదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంభందాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విదముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.
జై శ్రీ మన్నారాయణ !

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers