Blogger Widgets

Saturday, December 26, 2009

తిరుప్పావై పన్నెండవ పాశురం

Saturday, December 26, 2009


ఆండాళ్ తిరువడిగళేశరణం :
వెనుకటి పాశురము స్వ ధర్మ నిరతులగు గోపాలుర వంశమున జన్మించిన యామె మేల్కొలుపబడినది.
శరీరము కర్మచేయుతకు వీలుగా నుండునట్లు సృజింపబడినది. ఒక్క క్షణము మైనను కర్మచేయకుండా ఎవరు ఉండలేరు. అందుచే శరీరియయిన ప్రతీ వ్యక్తికి స్వధర్మము కర్మ; పరధర్మము జ్ఞానము . స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా నుండు పాపములను తొలగించును.
అందుకుగాను "
యజ్ఞము ,దానము, తపస్సు మున్నగున్నవి క్రియా కల్లాపమును విడువరాదు . ఆచరిచితీరాలి. యజ్ఞము,దానము,తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి ఙానము, తద్వారా భక్తి కలుగుటకు సాయపడును.
కర్మను విడుచుట యనగా కర్మలను మానుట కాదు. కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును, ఫలమునందాశను ,సంగమును విడచుటయే కర్మ సన్యాసము. కాని నియతమగు కర్మను విడచుట సన్యాసమను మొహముతో విడచుట తామస త్యాగము. శరీర క్లేశము కల్గునను భయముచే కర్మలను మానుట రాజసత్యాగము. భగవద్గీతలొ కర్మన్యాసము అని చెప్పబడి ఉన్నది.
వెనుకటి పాశురములో గోపాలుర స్వధర్మమును ఫల సంగ కర్తృత్వాభిమానములను వదలి యాచరించెడి స్వభావము కలవారని వర్ణించబడింధి.
ఈ పాశురములో అట్టి స్వధర్మము ను కూడా ఆచరించని ఒకానొక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నధి.
గోపాలురందరును పరమాత్మయే ఉపాయము -ఉపేయము అని నమ్మినవారు. వారి యెమి చేసినా పరమాత్ముని ప్రీతి కొరకే చేస్తున్నామన్న కోరిక లక్ష్యము కలవారు.
ఇంద్రియ ప్రవ్రుత్తి నిరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుచున్నారు.

పాశురము :
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్తాత్పర్యము :

లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి. కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers