శివకేశవార్చన:
వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.
గురువారం, నవంబర్ 07, 2024
బుధవారం, నవంబర్ 06, 2024
కార్తీక పురాణం 5వ రోజు
బుధవారం, నవంబర్ 06, 2024
దీపదాన మహాత్య్మం:
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెలరోజులూ పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.
దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమఅని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము.
ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్టుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.
లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట:పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను. దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను.ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధావులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడి దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను.
ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావు కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.
సోమవారం, నవంబర్ 04, 2024
కార్తీక పురాణం 3వ రోజు
సోమవారం, నవంబర్ 04, 2024
శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః
కార్తీక స్నాన మహిమ
జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.
బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట
ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.
తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.
ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.
అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.
ఒకటవ బ్రహ్మరాక్షసుని కధ
నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
రెండవ బ్రహ్మరాక్షసుని కధ
ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.
మూడవ బ్రహ్మరాక్షసుని కధ
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని. భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.

ఆదివారం, నవంబర్ 03, 2024
కార్తిక పురాణం 2వ రోజు
ఆదివారం, నవంబర్ 03, 2024
బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు.
''రాజా! ఈ కార్తీకమాసంలో స్నాన దాన జపాల్లో దేనినైనా, కొద్దిపాటిగా ఆచరించినా సరే.. అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే,సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరిన్చారో అలాంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
పౌర్ణమ్యాం కార్తీకమాశ స్నానాందీస్తు నాచారాన్|
కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప||
క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః|
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం||
భావం:
కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు చండాల జన్మలు ఎత్తి, చివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి..
తత్వనిష్ఠోపాఖ్యానం
పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలను పలకనివాడు, భూతదయ గల దయాళువూ, తీర్థాటనప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్ధయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరీ తీరాన ఉన్న ఒకానొక ఎత్తయిన మర్రిచెట్టు మీద కారునలుపు శరీర ఛాయ గలవారు, ఎండిన డొక్కలు, ఎర్రని కళ్ళు, పెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడిఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులు, కపాలాలూ ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసులవల్ల భయంచేత మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళదూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోబాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు.
తత్వనిష్ఠుడి శరణాగతి
త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్|
త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ! త్వట్టోహం జగదీశ్వర||
భావం:
''దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివి అయినవాడా! నారాయణా! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతం చేసేవాడా! నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను అన్నివిధాలా కాపాడు'' అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడినుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకే పరిగెత్తసాగింది. రాక్షసులు దగ్గరౌతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవడంవల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడంవల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయింది. అదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి దండప్రణామం చేసి, అతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టామని నమ్మబలికి ''ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలు నసిమ్చిపోయాయి'' అని మళ్ళీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిణ హృదయంతో తత్వనిష్ఠుడు ''మీరెవరు? చేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారు? మీ మాటలు వింటే బుద్దిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి.. మీ భయాలు, బాధలు తొలిగే దారి చెప్తాను'' అన్నాడు.
ద్రావిదుని కథ
పారుని పలుకులపై, ఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు.
''విప్రోత్తమా! నేను ద్రావిడిని. ద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాదికారిని. కావడానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని,వంచించే చమత్కారిగా ఉండేవాణ్ణి. ణా కుటుంబ శ్రేయస్సుకై అనేకమంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గానీ,బ్రాహ్మణులకు గానీ ఏనాడూ పట్టెడు అన్నం పెట్టలేదు. నయ వంచానలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంవల్ల ణా కుటుంబం నాతొ సహా ఏడు తరాలవాళ్ళు అథోగతి పాలయ్యారు.
మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు'' అన్నాడు.
ఆంధ్రదేశీయుని గాథ
రెండవ రాక్షుసుడు ఇలా విన్నవించుకున్నాడు.
''ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఆంధ్రుడిని. నిత్యం ణా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను ణా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నం పెట్టేవాడిని. బాంధవ బ్రాహ్మణకోటికి ఎన్నడూ ఒక పూటయినా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడిని. చనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతిఘోరమైన భాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికి మల్లేనే నాక్కూడా ముక్తి కలిగే మార్గం బోధించు''
పూజారి కథ
మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ''ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదెస బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడిని. భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చి, విష్ణు సేవలను సక్రమమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించి, వేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా గడిపేవాణ్ణి. పాపపుణ్య విచక్షణ తెలిసేది కాదు. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఓ విప్రుడా! నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు'' అని ప్రార్ధించాడు.
బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట
తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు ''భయపడకండి. నాతొ కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి'' అని చెప్పి వారిని తన వెంట తీసికెళ్ళాడు. అందరూ కలిసి కావేరీనది చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా మున్ డు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తర్వాత
అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్ధం |
అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే | |
అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులూ,దివ్యరూపులూ అయి, తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
విదేహరాజా! అజ్ఞానం వల్ల కానీ, మోహ, ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతఃకాల స్నానం చేయాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు.
కనుక ఎటువంటి మీమాంసలూ లేకుండా స్త్రీలు గానీ, పురుషులు గానీ కార్తీకమాసంలో తప్పక ప్రాతఃస్నానం చేయాలి. అప్పుడు జనకుడు ''హే బ్రహ్మర్షీ! నువ్వు ఇంతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరిన్చాలో, ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి'' అనడిగాడు.
వశిష్ట ఉవాచ:
అన్ని పాపాలనూ హరించేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయం. కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలను, తత్ఫలితాలను చెప్తాను విను.
కార్తీకమాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుంది. శివాలయ గోపురద్వారా,శిఖరాలయందు గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలౌతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారు. కాంక్షతో గానీ కనీసం నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులౌటారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను.
కార్తీక
దీపారాధన మహిమ
పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీ, కుమారులు లేని కారణంగా కుంగిపోయి, కురంగపాణికై తపస్సు చేశాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ''ఓ రాజా! ఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి, బ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది'' అని చెప్పాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాన్చాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి, శివప్రీతికై బ్రాహ్మణులకు దీప దానములు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెల తప్పి, యుక్తకాలంలో మగ శిశువును ప్రసవించింది. రాజా దంపతులు ఆ శిశువుకు ''శత్రుజిత్తు'' అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు చరిత్ర
శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై ఇంకా తృప్తి చెందక పర స్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. హితవు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమ హీనంగా జీవిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడు. ఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది. భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేది. ఇద్దరూ ఆనందించేవారు. ఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది.కానీ, ఆ విప్రుడు పైకి ఏమీ తెలీనట్లు ఉన్నాడు. ఇద్దరూ కలిసుండగా చూసి చంపాలి అనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడు. వారికి ఈ సంగతి తెలీదు. ఒక కార్తీక పౌర్ణమినాడు సోమవారం కలిసివచ్చింది. ఆవేళ కాముకులిద్దరూ సురత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. ఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్ర స్త్రీ తన చీర కొంగును చింపి, ఒత్తిని చేసింది. రాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలో పోశాడు. మొత్తానికి దీపం వెలిగించారు. ఇక ఇద్దరూ ఏకమయ్యారు.
విప్రుడు అక్కడికొచ్చి, వారిద్దర్నీ చంపేసి, తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడు. అటు యమదూతలు, ఇటు శివ దూతలూ కూడా వచ్చారు. శివదూతలు విప్ర స్త్రీని, రాజును కైలాసానికి తీసికెళ్ళారు. యమదూతలు విప్రుని నరకానికి లాక్కేళుతుంటే అతను ఆక్రందన చేస్తూ ''పాపం చేసినవారికి కైలాసం, నాకేమో నరకమా?'' అన్నాడు. అందుకు యమదూతలు''వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి. పైగా సోమవారం. ఏ కారణం అయితేనేం దీపం వెలిగించారు. అందునా ఆలయంలో వెలిగించారు. కనుక పుణ్యాత్ములయ్యారు. అలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావు. అందుకే వారికి కైలాసం, నీకు నరకం'' అన్నారు.
బ్రాహ్మణుడికీ, శివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని ''అయ్యా, దోషం చేసింది మేము. మాకు కైవల్యం ఇచ్చి, ఈ పుణ్యదినాన మమ్మల్ని చంపి, మాకు స్వర్గప్రాప్తి కలగాజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు.
కార్తీకమాసం గొప్పది అయితే, సోమవారం ఇంకా పుణ్యమైంది అయితే, దీపారాధన మరీ పుణ్యప్రదమైంది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు'' అని వాదించాడు. ఫలితంగా శత్రుజిత్తు తానూ, తన ప్రేయసి చేసిన ఒత్తులు, ఆముదం పుణ్యం తాము ఉంచుకుని, దీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసికెళ్ళారు. కనుక, ఓ మిధిల నగరాధీశ్వరా! కార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీ, విష్ణుఆలయంలో గానీ దీపారాధన చేసి తీరాలి.నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగల్గుటారు. అందునా శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీకమాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి''
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)