జనవరి 26 వ తేదిన మనము గణ తంత్ర దినోత్సవమును జరుపుకున్తునాము ఈ సందర్బముగా స్కూల్ దగ్గర పెరేడ్ గ్రౌండ్స్ లలో జండా ఆవిష్కరించి వందనము సమర్పిస్తారు . ఇండిపెండేన్స్ డే , రిపబ్లిక్ డే రోజులలో ప్రతి భారతీయుడు తప్పనిసరిగా , విధిగా పతాకావిష్కరణకు హాజరై , ఇతరులతో మాతలాదకుండా, కదలకుండా క్రమశిక్షణ గా వుండాలి. ఎవరి వాహనాలమీద పడితే వారి వాహనాలమీద జాతీయ జండాలు ఎగరవేయరాడు . ఆ గౌరవం కొందరు దేశనాయకులకు ప్రభుత్వ అధినాయకులకు మాత్రమె పరిమితము చేయబడినది.
భారత రిపబ్లిక్ డే --మొట్ట మొదట మంత్రిత్రియ రాయబారము ప్రతిపాదనల ప్రకారము క్రీ. శ 1946 డిసంబరు 9 న భారత రాజ్యామ్గ పరిషత్తు ఏర్పడినది. దానికి రాజేంద్రప్రసాదు ను అద్యక్షునిగా ఎన్నుకొన్నది. ఈ సభ రాజ్యంగా ముసాయిదాను తయారు చేయటానికి డా . బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షణ ఒక కమిటి ఏర్పాటుచేసింది . రాజ్యాంగ సలహాదారుడైన బి. ఎస్. రావ్ సహకారముతో ఈ కమిటీ ఒక ముసాయిదా రాజ్యాగాన్ని తయారు చేసింది. ఈ ముసాయిదా రాజ్యామ్గాన్ని క్రీ. శ . 1948 ఫిబ్రవరి లో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటించబడినది. రాజ్యామ్గ పరిషత్తు చె ఏడాదిన్నర పాటు జరిగిన సుదీర్గ చర్చల అనంతరము క్రీ. శ . 1949 నవంబరు 26 వ తేదీన రాజ్యాంగ పరిస్త్తుచే ఆమోదించబడినది . ఈ రాజ్యాంగం క్రీ . శ . 1950 జనవరి 26 వ తేదీనుండి అమలులోకి వచ్చింది. కాబట్టి జనవరి 26 న ప్రతీ సంవత్సరము మనము గణతంత్ర దినోత్సవముగా జరుపుకుంటున్నాము.
నాటి నుండి భారత దేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం (Sovereign Democratic Republic )
గా మారినది. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశంలో భారత రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడుగా బాబు రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ను భారతదేశ ప్రప్రధమ ప్రదానిమంత్రిగా ఎన్నుకున్నారు.
ఇంకా చరిత్ర వుందిట. మా అమ్మమ్మ ఈ గణతంత్ర దినోత్సవముగురించి నాకు చెప్పినవిషయాలు ఇవే మరి.
మీ అందరికి మా హృదయపురక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.