హాయ్ బాగున్నారా! నేనొక కధ చెపుతాను వింటారా . జాగ్రత్తగా వినాలి మరి ఒకే నా ..........
సరే మరి వినండి. అనగనగా ................. అనగనగా...........అనగనగా................
అనగనగా............ జలజలా పారే ఏరు. ఏటి ఒడ్డున ఒక చెట్టు .చెట్టు పై ఒక గూడు . గూడులో ఒక పిట్ట
. పిట్టకి మూడు చిన్న చిన్న పిట్టలు కలవు . అమ్మా , పిల్లలు చాలా సంతోషముగా వుండేవి .
అవి ఆడుకొంటూ, పాడుకొంటూ సరదాగా వుండేవి. .
ఒకనాడు పిట్ట తన పిల్లలకు మేత కోసము వెళ్లి తిరిగి వచ్చు సమయమునకు తన పిల్లలు లో ఒక పిల్ల
గూటి నుండి తల బయటికి పెట్టి బయటి ప్రపంచం చూచుచున్నది .
అంతలో అమ్మ వచ్చి ఆ పిల్లల్నికోపగించుకోని అలా ఇంకెప్పుడు చూడవద్దని చెప్పింది . పొరపాటున క్రిందపడిపోవచ్చు . లేక మన శత్రువులు వచ్చి ఎత్తుకొని వెళ్ళగలరు. మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటికి వెళ్ళవచ్చు,అని ముద్దు గా మందలించింది అమ్మ .
మరునాడు ఉదయము పిట్ట మేతకు వెళ్ళింది అమ్మ మాట లెక్క చేయక ఆ పిల్ల మరలా బయటికి చూచింది గూటిలో నుండి బయటికి వింతలను . చూచుచున్నది .ఆ సమయమున గూటి అంచు వరకు వచ్చి పట్టు తప్పి కాలుజారి నదిలో పది కొట్టుకు పోయినది.
ఈ కధలో నీతి పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు. అందుకే అలా ఈ కధలో అమ్మ మాట వినకుండా వుండటం వల్ల పిల్ల పడిపోయింది . అమ్మ మాట విని వుంటే ఆ పిట్ట కి బాగుండేది వినలేదు. ఆపదలో పడింది.
ఇది మాతాత చెప్పిన కధ. బాగుంది కాదా.
మరి నేను ఉంటా
గురువారం, జనవరి 29, 2009
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.