ఈ రోజు సూర్య గ్రహణము ట మా అమ్మమ్మ సూర్య గ్రహణమని ఇంట్లో ఉండే ఊరగాయలలొ దర్బ అనే పత్రము వేసింది. ఎందుకు అంటే. ................. సూర్య గ్రహణము రోజు కొన్ని హాని కలిగించే కిరణాలు ప్రవేసిస్తాయని. ఈ దర్బ ఆ చెడు రాకుండా చేస్తుందని చెప్పింది. ఆ దర్బకి అంత పవర్ ఎలా వచ్చింది అని అడిగితె పెద్ద కాదే చెప్పింది .కశ్యపుని కద చెప్పింది . కస్యపునికి ఇద్దరు బార్యలు వారికి వారి పేర్లు వినత ,కద్రువ వారికి పిల్లలు లేరు అందుకు కశ్యపుడు పుత్ర కామేష్టి యాగము యాగుచేసి. వారివారి కోరికలు ప్రకారమూ ................ కద్రువకు వెయ్యి మంది సర్పాలుగా ముందుగా పుట్టారు. వినత తొందరతో ఆమె బిడ్డలు పెరుగుతున్న అందాలలో ఒకదానిని పగులగోట్టినది. అందుకు గాను అనురువుడు తొడలు లేకుండా పుడతాడు. అతను వినత తొందర కు తన సవతికి దాసివి కా అని శపించాదుట . రెండో అండమునుండి పుట్టినవాడు శాపవిమోచానము కలిగించునని చెప్పినాడు. వినత రెండవ పుత్రుడే గరుత్మంతుడు.
కద్రువకు దుర్భుద్ధి పుట్టి వినతను దాసిగా చేసుకోవాలన్న ఆలోచనతో కద్రువ వినతి ఒక పందెములో ఎవరు ఓడి పొతే వారు గెలిచినవారికి దాసీ గా వుండాలని అనుకున్నారు. అయితే క్షీర సాగర మదనములో లభించిన గుర్రము పరుగు పెడుతోంది. అది తెల్లగా వున్నా తోక నల్లగా వుందని కద్రువ ,కాదు తెల్లగావున్నదని వినత పందెము కాచుకున్నారు.
అయితే కద్రువ తనపిల్లలతో గుర్రము తోక చుట్టుకొని నల్లగా మార్చమని చెప్పినది. వారు అలాచేయ్యమనగానే మీరు సర్పయాగాములో పది మరణిస్తారని శపించినది. అది విన్న కర్కోటకుడు మాత్రము గుర్రముతోకకు చుట్టుకొని కద్రువను పందేమునుంది గెలిచేటట్టు చేసాడు. అన్నట్టుగానే వినత కద్రువకు దాసిగా మారినది. కొన్నాళ్ళకు గరుత్మంతుడు పెరిగి వాళ అమ్మ ను దాసీ విముక్తి చేయుటకు ఏమిచేయ్యాలని పెద్దమ్మను అడిగాడు . అప్పుడు అమృతము తెచ్చి ఇస్తే వినత దాసితత్వము పోతుంది అని చెప్పింది.గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళ్ళుతుంటే మార్గమధ్యములో ఇంద్రుడు కనిపించి "నాయనా గరుత్మంతా! అమృతం నువ్వు తీసుకొని వెళ్ళడం తగదు. అందరికి అమరత్వం సిద్దించరాదు" అని అంటాడు. అప్పుడు గరుత్మంతుడు - ఇంద్రుడు ఒడంబడిక చేసుకొంటారు. గరుత్మంతుడు అమృతకలశం తీసుకొని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు, అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకొని పారిపోయేటట్లు. గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్బ ల పై ఉంచుతాడు. అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాసీత్వము, అతడి తల్లి దాసీత్వము పోతుంది. ఆ దర్బలమీద అమృతము సేవించుటకు వారు వచ్చే సరికి ఇంద్రుడు కలశాన్ని తీసుకుంటాడు. కద్రువ పిల్లలు దర్బమీద అమృతము ఉందని నాకేసరికి వారి నాలుకలు రెండుగా చీలి పోతాయి. ఇది కదా .
అయితే ఆ దర్బలమీద అమృతము వుంటుంది అని ఆ దర్బలను గ్రహణము రోజు అన్నిటి మీద వేస్తె . దానిలో వుండే అమృత గుణమువల్ల దోషాలు పోతాయిట. ఈ దర్బని సూర్య గ్రహణమునకు, చంద్ర గ్రహణమునకు అందుకే వుపయోగిస్తారుట.
ఈ రోజు సూర్య గ్రహణము ఇండియన్ టైం ప్రకారమూ మద్యాన్నాము 2-44 నుండి సాయంత్రము 4-2 కు వుంటుంది. ఈ గ్రహణాన్ని మకర రాశి వారు చూడకుడదట. అసలు ఎవరు డైరక్టుగా చుడదనుకోండి. కళ్ళకు సమస్యగా అవుతుందిట. అమ్మ కాబోతున్నవారైతే అస్సలు కదలకుడదట. కాబట్టి జాగ్రత్తగా వుండండి. ఆ చెడు కిరణాలకు దూరంగా వుండండి. ఇదే మా అమ్మమ్మ నాకు చెప్పింది . నేను మీకు చెప్పుతున్నాను .
thank you for the given piece of information.
రిప్లయితొలగించండిmana vignaana milaa kthalugaa telikagaa pillalaku chere prakriya ichchaaru mana peddalu baagaavraasaavu
రిప్లయితొలగించండి