Blogger Widgets

సోమవారం, జులై 27, 2009

పక్షి పిల్లల చిత్రాలు

సోమవారం, జులై 27, 2009







ఈ పక్షి పిల్లల photos నేనే తీసాను. మా ఇంటి ముందు వున్న పోస్ట్ బాక్శ్ లో పక్షి eggs పెట్టింది. అవి పిల్లలు అయ్యాయి. మీరు చూస్తున్నది ఆ పక్షి పిల్లలే. అవి మూలగా వున్నాయి కదా. మా ఇంట్లో కి ఎగిరి వస్తే అమ్మమ్మ పట్టుకుంది. నేను కొంచెం సేపు ఆడుకుని వదిలి పెట్టాను.

శుక్రవారం, జులై 24, 2009

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

శుక్రవారం, జులై 24, 2009


ఈ రోజు శ్రావణమాసంలో వచ్చిన మొదటి శుక్రవారము కదా. అందుకు అమ్మమ్మ పూజ చేసుకుంది . అయితే అమ్మమ్మ మహాలక్ష్మి పూజ చేసింది. అమ్మవారికి హారతి ఇచ్చినప్పుడు నేను ఈ పాట పాడాను. అన్నమాచార్యులవారు రచించినది. క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మినికి నీరాజనం. పాట చాలా బాగుంటుంది.




క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ll


జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం ll


చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ll


పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం ll

నాకు ఈ పాట చాలా ఇష్టం అందుకే ఈ పాటని మీరు వింటారని . సరె మరి వచ్చే వారానికి అమ్మవారిపాట ఇంకొకటి పెడతాను . సరెనా. bye.

గురువారం, జులై 16, 2009

Success

గురువారం, జులై 16, 2009

బుధవారం, జులై 15, 2009

చెడు ఆలోచనలు ప్రభావం

బుధవారం, జులై 15, 2009

హాయ్! అందరికీ అమ్మమ్మ చిన్నకధ చెప్పింది ఇప్పుడే అది మీకూ చెప్పనా. ఐతే కధ చాలా చిన్నది మరి. సరె ఐతే చెప్తున్నాను.

అనగనగా ఒక మంత్రిగారు పనిమీద ఒక వూరు మీదుగా ఉన్న పొలంలోకి వెళ్ళాడు. మంత్రిగారు కి రైతు తన చెరకు తోటలోని తాజాచెరుకు రసం ను తీసి ఇచ్చాడు. తీయని చెరకు రసం తాగిన మంత్రిగారికి కళ్ళు చెరకు తోటపై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చెయచ్చునో అని మనసులో లెక్కలు వేసుకున్నాడు . మంత్రి ఇంకోంచెం చెరకు రసం తీసుకురమ్మనాడు. ఈ సారి తెచ్చిన రసం అంత తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యాన్ని వెల్లిబుచాడు. మీ మనసులో అసూయ ప్రవేసించింన వెంటనే చెరకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది. అని రైతు సమాధానం ఇచాడు. తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి.
అయితే ఈకధలో నీతి ఉంది. అది ఏమిటంటే
చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితము చేస్తాయి అని. కధ బాగుంది కదండి. మరో సారి ఇంకో విషయంతో వస్తాను మరి bye.

మంగళవారం, జులై 14, 2009

annamayya keerthana

మంగళవారం, జులై 14, 2009

From Exported Videos

శుక్రవారం, జులై 10, 2009

చక్కని తల్లి కి చాంగుభళా. (అన్నమాచార్య కీర్తన)

శుక్రవారం, జులై 10, 2009


రచన: అన్నమాచార్యులవారు
రాగము: పాడీరాగము
తాళము: ఆది తాళము
పాడినవారు:బాలకృష్ణ ప్రసాద్ గారు
  చక్కని తల్లి కి చాంగుభళా

------------------------------
చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా ll


కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసరెడి
చలముల యలుకకు చాంగుభళా ll


కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెరుగులలకు చాంగుభళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా ll


జందెపు ముత్యపు సరుల హారముల
చందనగంధికి చాంగుభళా
విందయి వేంకటవిభు పెనచిన తన
సందిదండలకు చాంగుభళా ll

బుధవారం, జులై 08, 2009

Nice story with a good moral.

బుధవారం, జులై 08, 2009

Do not hurt yourself:


One night a snake while it was looking for food, entered a carpenter’s workshop.


The carpenter, who was a rather untidy man, had left several of his tools lying on the floor.

One of them was a saw. As the snake went round and round the shop, he climbed over the

saw, which gave him a little cut.

At once, thinking that the saw was attacking him, he turned around and bit it so hard that his mouth started to bleed. This made him very angry. He attacked again and again until the saw was covered with blood and seemed to be dead.

Dying from his own wounds, the snake decided to give one last hard bite then turned away. The next morning the carpenter was surprised to find a dead snake on his doorstep.


Lesson to Learn:


Sometimes in trying to hurt others, we only hurt ourselves

మంగళవారం, జులై 07, 2009

Sree vaishnavi group song

మంగళవారం, జులై 07, 2009

Posted by Picasa

కొత్త కొత్త గా వుంది ,

హాయ్ ! కొత్త కొత్త గా వుంది అంటున్నాను ఏమిటి అనుకుంటున్నారా...........................? మీతో చాలా కబుర్లు చెప్పాలి అన్నాను కదా ! గుర్తు వచ్చిందా. సరే మరి చెప్తాను . అది ఏమిటంటే ..................
సమ్మర్ అయ్యిపోయింది కదా ! నేను చోడవరంలో వుండే దానిని కదా ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసాను . హైదరాబాద్ బలే బాగుంది . కొత్త స్కూల్లో చేరాను . కొత్త క్లాస్ లోకి వచ్చాను. కొత్త స్నేహితులు దొరికారు, కొత్త పుస్తకాలు , కొత్త uniform అవీ అవీ కాదు అన్నీ కొత్తవే. అందుకే కొత్త క్రొత్తగా వుండి అన్నాను ఇప్పుడు అర్ధమైందా మరి.
మాకు స్కూల్లో క్లాసు లు మొదలు పెట్టారు హోం వర్క్స్ ఇస్తున్నారు . సంగీతం , డాన్స్ , కరాటే నేర్చుకుంటున్నాను. నాకు కరాటే కంటే డాన్స్ బాగా నచ్చింది. పాటలు నాకు ఎలాగు ఇష్టమే కదా. మిగతా సబ్జక్ట్స్ కుడా బాగున్నాయి. నాకు అన్నిటి లోని మాథ్స్ చాలా నచ్చాయి. నాకు ఫ్రీ టైం దొరికితే మాథ్స్ చేస్తున్నాను . అవి అయిపోయాకా మా అమ్మమ్మ తో స్టోరీస్ చెప్పించుకుంటున్నాను. ఈ మధ్య నేను పోస్ట్ లు పెట్టలేదు కానీ మంచి మంచి కధలు చాలా చెప్పింది . నాకు వీలు కలిగినప్పుడు మీకు చెప్తానే మరి.
ఇక్కడ హైదరా బాదులొ నాకు చెట్లు బాగా నచ్చాయి . మేము వుండే ప్రదేశంలో పక్షులు వున్నాయి . వాటి సౌండ్స్ ఎంత బాగున్నాయో. నేను అప్పుడు అప్పుడు ఫొటోస్ కుడా తీశాను నాకు పక్షులు చాలా నచ్చాయి. అవికూడా మీతో వీలున్నప్పుడు షేర్ చేసుకుంటాను .
మరి నాకు అన్నీ కొత్తే కదా .............

సోమవారం, జులై 06, 2009

sree vaishnavi group dance and song photos

సోమవారం, జులై 06, 2009






గురువారం, జులై 02, 2009

సమ్మర్ కేంప్ అయిపోయింది.

గురువారం, జులై 02, 2009

హాయ్! నేను చాలా బిజీ అయిపోయి ఈ మధ్య అస్సలు పోస్ట్ చేయలేకపోయాను . సరే మరి సమ్మర్ అంతా ఏమి చేసాను అనుకుంటున్నారా. చెప్పాను కదా నేను డాన్స్ పాటలు నేర్చుకున్నాను అనీ. నేర్చుకున్నాను. దానికి మేము స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చాము. ఆ ప్రోగ్రామ్ ఫొటోలు పోస్ట్ చేస్తున్నాను చూడండి. . సరే మరి మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని వుంది . తరువాత మాటాడు తాను మరి OK.

NICE MESSAGE FOR U


Opportunities – Small or Big. They come and go.
Some will be easy to take advantage of, some will be difficult.
But once we let them pass in hopes of something better,

those opportunities may never again be available.
Always grab the first opportunity.


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)