Blogger Widgets

సోమవారం, సెప్టెంబర్ 28, 2009

చిట్టి చిట్టి బొమ్మల పెళ్ళి

సోమవారం, సెప్టెంబర్ 28, 2009

దసరా కదండి అందరు బొమ్మల కొలువులు పెడతారు కదా అప్పుడు బొమ్మల పెళ్ళి కూడా పెడతారు కదా అందులో బొమ్మల పెళ్ళి కూడా పెడతారు అందుకు పాటలు పాడతాం కదా అందుకు నేను చిట్టి చిట్టి బొమ్మల పేళ్ళి పాట నేర్చుకున్నాను మీరు చూడండి.

చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెనగా
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు
గాజుపాలికలతో, గాజుకుండలతో
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.

చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము
పోతునే బొమ్మ, నీకు పెన్నేఱునీళ్ళు

కట్టుదునె బొమ్మ, నీకు కరకంచుచీర
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు
అత్తవారింటికీ పోయి రమ్మందు

అత్త చెప్పినమాట వినవె ఓ బొమ్మ
మామచెప్పినపనీ మానకే బొమ్మ
రావాకుచిలకమ్మ ఆడవే పాప
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు..

శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకం

ఆదివారం, సెప్టెంబర్ 27, 2009

దసరా పండగ శుభాకాంక్షలు

ఆదివారం, సెప్టెంబర్ 27, 2009


నాబ్లాగ్ మిత్రులకు , నా స్నేహితులకు, నా ఆత్మ బందువులకు, అందరికీ ఈ దసరా పండుగ ఆనంద ఆరోగ్య ఐస్వర్యాలు లభించాలని కోరుకుంటున్నాను. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.

Shaheed Bhagat Singh

Let salute Bhagadh Singh


ఈ రోజు ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు. సెప్టెంబర్ 27th 1907 లో ప్రస్తుత పాకిస్తాను లోని లాయల్ జిల్లా బంగాగ్రామంలో జన్మించారు. భగత్ సింగ్ తల్లి తండ్రులు విద్యావతి,కిషన్ సింగ్. వీరు సర్దార్ కుటుంబము.భగత్ సింగ్ కుటుంబంలోని వారందరు స్వాతంత్రపోరటయోదులే. భగత్ సింగ్ పుట్టిన రోజు నాడు వారందరూ జైలు నుండి విడుదల అయ్యారు. అప్పుడు వారి కుటుంబము పండగ చేసుకుని ఆసందర్బములోని భగత్ సింగ్ అని నామకరణము చేసారు.

భగత్ సింగ్ చాలా గొప్ప దేశభక్తుడు. ఎలాఅంటే జిలియన్ వాలాబాగ్ ఉదంతంజరిగినప్పుడు ఆ ప్రదేశము అంతా రక్తముతో తడిసినది. భగత్ సింగ్ ఆ ఘటన జరిగినప్పుడు చిన్నవయసు అప్పుడు భగత్ సింగ్ అక్కడ భూమికి ముద్దుపెట్టుకొని ఆ మట్టిని ఇంటిదగ్గర పెట్టుకున్నాడు. అంత దేశభక్తికలవాడు.అతని ఉద్యమాలు భారత స్వాతంత్ర ఉద్యమం.
అయన ప్రద్దాన సంస్ఠలు నజవాన్ భారత్ సభ,కీర్తికిసాన్ పార్టి, హిందుస్తాన్ సోసలిస్ట్ రిపబ్లికన్ అసోషియెషన్. మొదలగున్నవి ప్రద్దాన సంస్తలు.
భగత్ సింగ్ ఉద్యమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు.అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్‌దేవ్‌కు రాసిన లేఖలో భగత్ సింగ్ " నాకూ ఆశలూ, ఆంక్షలూ ఉన్నాయి. ఆనందమైన జీవనం గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను. ఇదే అసలైన బలిదానం."
భగత్ సింగ్ ముఖ్యమైన కొటేషన్ ఇన్క్విలాబ్ జిందాభాద్.

బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

Let salute the people who made us prude.
Shahid Bhagat singh's birth day
Hope you all Indian's are aware of this day
Damnit , no most of your not,
hmm don't worry
Lemmy show your something
why this this is important days for Indians.


మహిషాసుర మర్ధిని ఆది శంకరాచార్య విరచిత


మహిషాసుర మర్ధిని అమ్మవారు నవరాత్రులు నవ అవతారాలలో ధర్శనము ఇచ్చారు. మహిషాసురుని వధించుటకు అమ్మ ఉగ్ర రూపము ధరించారు.అప్పుడు ఆమెను దేవతలు అందరు అమెను స్తుతించారు. అలానె శంకారాచార్యులవారు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పాడారు అది మంచిగా గుర్తింపు ఉన్న పాట.నవరాత్రుల తరువాత ఈరొజు మహిషాసుర మర్ధిని స్తోత్రము చదువుతారు.

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయికరే
త్రిభువన మస్తకశూలవిరోధి శిరోధికృతామల శూలకరే
దుమి దుమి తామర దుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురనుసంగరరక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే
కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హటావటుకే
కృత చతురంగబలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజ్ఞయశబ్దపరస్తుతితత్పర విశ్వనుతే
ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే
నటితనటార్ధనటీనటనాయకనాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మహితమహాహవమల్లమతల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే
సృతకృతఫుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమలదళామలకోమలకాంతిబలాకలితాతులఫాలతలే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితమిలిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే
నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖసాంద్రరుచే
జితకనకాచలమౌళిపదోఝితదుర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కధం న భవేత్
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం
తవ చరణం శరణం కరవాణి నతామర వాణి నివాశి శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

అయి మయి దీన దయాళు తయా కృప యైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే
యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురుతాప మపా కురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

శనివారం, సెప్టెంబర్ 26, 2009

బతకమ్మపండగ శుభాకాంక్షలు

శనివారం, సెప్టెంబర్ 26, 2009

మా బ్లాగ్ మిత్రులకు అందరకు బతకమ్మ పండగకు శుభాకాంక్షలు .

దుర్గాదేవి (దుర్గాచాలిసా)

నవరాత్రులలో అమ్మవారు ఈ రోజు దుర్గామాతగా మనకు దర్శనము ఇస్తారు. మహిషాసురుని వధించుటకు అమ్మ అష్టమి రోజు కాళీ మాత దుర్గాదేవిగా కనిపిస్తారు.ఈ దుర్గాఅవతారంలో అమ్మ మహిషాసురినితో భయంకరమైన యుద్దంచేస్తారు.ఈమె అరుణ వర్ణ వస్త్ర దారిఅయి సింహవాహనము కలిగి సర్వఅయుధ దారియై రాక్షసులనుండి మనలను రక్షించుటకు వున్నట్టు దర్శనము ఇస్తున్నది.
ఈమెకి ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షింతలు, ఎర్రని వస్త్రాలు , దనిమ్మ పండ్లు వంటివి సమర్పించి . అమ్మ కరుణ మనపై కురిపించుకోవచ్చు.

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

సరస్వతి వందనం

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2009

మరి ఈ రోజు మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి.

పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.


.

గురువారం, సెప్టెంబర్ 24, 2009

HAPPY BIRTHDAY TO MY............

గురువారం, సెప్టెంబర్ 24, 2009



మా తాత చింతా. రామకృష్ణారావు(ఆంద్రామృతము బ్లాగ్) గారికి ఈరోజు జన్మదినము . మా తాత పుట్టినరోజు మాకు పండగ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాతగారికి నా తరుపున నా బ్లాగ్ మిత్రులద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తాతా ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.అమ్మమ్మ, అమ్మ, మామయ్య, కాబోయె అత్తయ్య,నా చెల్లెల్లు తరుపున కూడా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు..

శ్రీమహాలక్ష్మి LAXMI DARSHAN ॐ


ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన
(ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.


కాత్యాయినీ మాత


నవదుర్గలలో ఈ రోజు కాత్యాయిని మాత.

"కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.


కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.


ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.


బుధవారం, సెప్టెంబర్ 23, 2009

సరస్వతి మాత

బుధవారం, సెప్టెంబర్ 23, 2009


అయిదవరోజు అమ్మవారు సరస్వతి మాతగా దర్శనము ఇస్తారు. ఈమె కనకాంబర వర్ణినిగా వుంటారు. చదువుకునేవారికి మంచి చదువును ప్రసాధించు తల్లి కావున ఈమెను చదువులు తల్లిగా కూడా అంటారు. తెల్లని వస్త్ర దానిణి చేతిలో వీణ పుస్తకాలు కలిగి వుంటుంది. ఈమెకి పెరుగన్నము నేవేద్యముగా సమర్పిస్తారు.
స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

నాలగవరోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
కూష్మాండ మాతగా కూడా కొన్ని ప్రదేశాలలో పూజిస్తారు.

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.

గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.
అప్పారావుగారు అన్నారు ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది అని అన్నారు.
ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.
తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌

గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌


పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌


దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌


సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి.

ఈ రోజు అయన గురించి తెలుసుకున్నాను. మా అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఆ వురిలోనే పెరిగారుట నాకు ఇవి అన్నీ అమ్మా, తాత నాకు చెప్పారు. నా బ్లాగుద్వారా నేను తెలుసుకున్నది మీరూ తెలుసుకున్నారు కదూ..........

శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి (అన్నపూర్ణాష్టకము)

ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణేశ్వరి అవతారములో దర్శనము ఇచ్చును.ఆమెను నిత్యం కొలిచిన వారికి అన్నానికి లోటు ఉండదని ప్రతీతి. మానవులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు ఆహారం అనేది ఆమె కృపవల్లనే... లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. పార్వతీ దేవీ అవతారమైన దుర్గాదేవీ సాక్షాత్తు భర్త అయిన పరమేశ్వరునికి ఓ సమయంలో భిక్షాటనకు వస్తే పాయసాన్నాన్ని వడ్డిస్తుంది. అంటే ఆకలిగొని ఎవరైనా తన ఇంటికి వస్తే... కలిగిన దాంట్లో సగమైనా పెట్టాలనే విధానాన్ని లోకానికి బోధించడమే దీని అర్థమని పండితులు చెబుతున్నారు.

Happy Ramadan


I wish you all Happy Ramadan

చంద్రఘంటాదేవి ( నవదుర్గా స్థోత్ర)

చంద్రఘంటాదేవి
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

ఆదివారం, సెప్టెంబర్ 20, 2009

దసరా వచ్చింది ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం(Bala Kavacham)

ఆదివారం, సెప్టెంబర్ 20, 2009

దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

ఈ పండుగకు ఈ పది రోజులు పది అవతారాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తారు. రోజు ప్రతి ఇంట్లోను లలితా సహస్త్రమ్ చదువుతారు. బొమ్మలకొలువులు పెడతారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది .త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

ఈ దసరా రోజులలో అమ్మవారి అవతారాలు:


మొదటి రోజు -శైలపుత్రి అవతారం
రెండవ రోజు- బ్రహ్మచారిణి (బాలా త్రిపురసుందరి)
మూడవ రోజు-చంద్రఘంటాదేవి
నాల్గవ రోజు-కూష్మాండాదేవి
ఐదవ రోజు-స్కందమాత
ఆరవ రోజు-కాత్యాయినీదేవి
ఏడవ రోజు-కాళరాత్రీదేవి
ఎనిమిదవ రోజు-మహాగౌరీదేవి
తొమ్మిదవ రోజు-సిధ్ధిదాత్రీదేవి
గానవరాత్రులు అమ్మవారు దర్సనం ఇస్తారు . ఒక్కొక్కప్రదేశంలోను ఒక్కొక్క పేరుతో అమ్మవారిని కొలుస్తారు.కొన్ని ప్రదేశాలలో పార్వతిదేవిని కనకదుర్గగాను,మహాలక్ష్మిగాను, అన్నపూర్ణగాను,బాలాత్రిపుర సుందరిగాను,రాజరాజేస్వరీ దేవిగాను,మహిషాసుర మర్ధినిగాను కొలుస్తారు.
నిన్నటి రోజును శైలపుత్రిగా పూజించారు.

శైలపుత్రి

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.

నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈమెను బ్రహ్మచారిణి అని అందురు.

బ్రహ్మచారిణి

'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

గురువారం, సెప్టెంబర్ 17, 2009

విశ్వకర్మ పుట్టినరోజు.

గురువారం, సెప్టెంబర్ 17, 2009


విశ్వకర్మ పుట్టిన రోజును ఈరోజు పెద్దపెద్ద కంపెనీలలోను పరిస్రమలలోను జరుపుకుంటారు.

అసలు విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? మన భూమిని తయారుచేసింది విశ్వకర్మ.అతను దేవతల శిల్పి, బ్రహ్మ ఆదేశించటం తో అతను భూమిని విశ్వాన్ని తయారు చేసారు.
విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు.
సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు.
త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు.
ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

Animated cats

మంగళవారం, సెప్టెంబర్ 15, 2009

నాకు animation అంటే చాలా ఇష్టము అందులో పిల్లులు నాకు బాగా నచ్చాయి. మీరు చూడండి.





ఆదివారం, సెప్టెంబర్ 13, 2009

Happy Grand parents day

ఆదివారం, సెప్టెంబర్ 13, 2009


Happy Grand Parents day
Ocean waves crash on shore
It's Grandparents Day,
and We Want to
Let You Know Once Again
How Much We Love You

It would be so nice
if we had an extra-special message
this Grandparents Day --
something that had never been
said before,
new words to express how much
we love and appreciate you.

This Grandparents Day,
it would be so nice
to surprise you with something
completely original that lets you know
how much you mean to us.
It would be nice to find a new way
to let you know how grateful we are
for all that you are and all that you do.

But the best message
is probably the simplest.
And that is to say, once again,
"Thank you for caring so much about us,
for being a part of our lives,
and may you always know
how very much we love you."
- Taylor MacKenzie

Happy Grandparents Day!

from


శనివారం, సెప్టెంబర్ 12, 2009

శ్రీ జయంతి సందర్భంగా - Birth of Krishna (Animation)

శనివారం, సెప్టెంబర్ 12, 2009


ఈ రోజు శ్రీ కృష్ణుడు అవతరించిన దినము.అసలు కృష్ణాస్టమి శ్రావణమాసంలో జరుపుకున్నాము.కదా సూర్యుడు సింహమాసంలో ఉండాలి, బహుల ఆష్టమి రోహిని నక్షత్రం ఉండాలి. మొట్టమొదట స్వామి అవతరించినప్పటి గ్రహ స్థితి అది. ప్రతి సంవత్సరం అన్నీ కలిసి అట్లానే రావడం రాక పోవచ్చు, కానీ అవతారం జరపాలి అంటే నక్షత్రాన్ని ప్రధానం చేసుకొని చేయాలి. అసలు శ్రీకృష్ణ అవతారమే ఒక రహస్యమైనది, అయ్యో కంసునికి తెలిస్తే ఎలా అనేది భక్తుల భయం. ఆండాళ్ తల్లి "ఒరుత్తి మగనాయ్ పిఱందు " అనిచెబుతుంది. ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. ఎవరికి పుట్టాడో ఆమే పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే కాలం యొక్క అడ్డుగోడలు లేనివారు, స్వామిపై అంత ప్రేమ. అందుకే ఏనాడు అని చేసుకున్నా ఆయనకి చెల్లుబాటు అవుతుంది. అందుకే రోహిణీ నక్షత్రము రోజు చేసుకుంటే బాగూంటుంది కదా.
ఆయన జన్మ ఎందుకు ఎత్తారో తెలుసుకోవటం ముఖ్యము ..
నాకు అయితె కృష్ణుని పుట్టిన రోజు చేసుకోవటం నాకు చాలా ఇష్టము మరి మీకు కూడానా.

అందరికీ శ్రీ జయంతి శుభాకాంక్షలు..

బుధవారం, సెప్టెంబర్ 09, 2009

09-09-09

బుధవారం, సెప్టెంబర్ 09, 2009

Hi friends,

Here are some calculations about today’s date which says an importance of
it.

09-09-09

i.e.

09-Sep-09

Sum of 09+09+09 = 27 = 2+7 = 9
This is 252nd day of the year i.e. 2+5+2 = 9
This is September month and total characters of September are 9.
Today is Wednesday and total characters of Wednesday are 9.

This kind of an occasion will not occur in next 1001 year.

So enjoy this day.
Have a nice day ahead.

మంగళవారం, సెప్టెంబర్ 08, 2009

ముద్దుగారే యశోద ....

మంగళవారం, సెప్టెంబర్ 08, 2009



పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు


చరణం:
అంతనింత గోల్లేతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసునీ పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృశ్నుడు

రతికేళి రుక్మిణికీ రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము
గతేయె మమ్మూగాచే కమలాక్షుడూ

కాళింగుని తలపై గప్పిన పుశ్యరాగము
యోలేటి శ్రీవెంకటాద్రీ ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయనీ దివ్య రత్నము
బాలునివలే తిరిగే పద్మనాభుడు

శనివారం, సెప్టెంబర్ 05, 2009

Happy Teachers day

శనివారం, సెప్టెంబర్ 05, 2009





Teacher’s day is celebrated on 5th of September every year throughout the country. Students take the opportunity of this special day to express their gratitude and appreciation for their teachers. There are several ways through which the students can appreciate the immense contribution of the teachers. Teacher’s day celebrations that are an integral part of 5th September are incomplete without the presence of some good and meaningful teacher’s day speeches and teacher’s day messages. In this page you will find some simple teacher’s day speech ideas.
Ideas for Teacher’s Day Speech :
Teacher’s Day, which is observed as a mark of tribute to the teachers, is the ideal day of telling your teachers that you feel blessed because of their presence in your lives.
Teacher’s day speeches are actually considered as a wonderful way for expressing our respect and sincere acknowledgement to our teachers. The significant role and contributions of the teachers in giving a proper shape to our lives can not be described or expressed in words. But, still here are some simple ideas that can be consulted for preparing a simple yet meaningful speech dedicated to all the teachers. Just have a look at them –
  • It is not always necessary that the students will have to give a formal speech on teacher’s day. The students must try to prepare such types of speeches that reflect a sort of genuine mutual love, affection and respect that they possess in their hearts for their teachers.
    • The students must note that the teacher’s day speech must mention the tremendous untiring support by our teachers and the moral support that they have given us throughout.

    • The speech for teachers must depict the fact that teachers have a very special important role in our lives and their position in our lives is equal to the position of our fathers and mothers.

  • You must not try to write a teacher’s day speech, in fact try to write your genuine feelings and appreciation that you have for your respected teachers and their unmatched efforts in the form of words, you will see that at the end of this task you have actually developed a wonderful and indeed a meaningful speech.

  • Do not try to impose any statement forcefully because if you do this, there is a possibility that it might ruin the entire effect of the teacher’s day speech that itself is an expression of your sincere and heartfelt appreciation.

  • Always remember that teacher’s day speech is the way through which you can sincerely express your thankfulness to your teachers, so prepare the speech accordingly.

  • You can use some popular quotes and short messages by prominent authors to make your teacher’s appreciation speech a more expressive one.

  • You can make the speech for your teachers even more interesting and appealing by including some of your own experiences with your teachers. Remain assured that in this way you are actually making your speech more lovable and noticeable.

  • Last but not the least, your teacher’s day speech must mention about the philosophies of Dr. Sarvepalli Radhakrishnan, whose birthday is observed as teacher’s day.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ప్రజల మనిషి అభినవ గాంధి ఇకలేరు.

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ప్రజల మనిషి ఇక లేరు

: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరు. హెలికాప్టర్ కూలి,కాలిపోయిన దుర్ఘటనలో ఆయన అసువులు బాసారు. రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకుడు దుర్మరణానికి నల్లమల అడవులు సాక్ష్యంగా నిలచాయి. అత్యంత దురదృష్టకరమైన ఈ సమాచారం తెలిసిన వెంటనే యావత్ ఆంధ్రదేశం దుఖ:సాగరంలో మునిగిపోయింది. కర్నూలుకు సమీపంలోని వెలుగొండ దగ్గరలోని రుద్రకోడూరు కొండపై కూలిపోయిన హెలికాప్టర్ కాలిపోయిందని, అక్కడ అయిదు మృత దేహాలు కనిపించాయని గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరిన సైనిక సహాయ సిబ్బంది కేంద్రానికి సమాచారం అందించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అహ్మద్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో కాంగ్రెస్ నాయకత్వంలో విషాదం అలుముకుంది. కొండపై హెలికాప్టర్ శకలాలు చెదురుమదురుగా పడి ఉన్నాయని, ఐదు మృత దేహాలు పడి ఉన్నాయని అహ్మద్ పటేల్ విషణ్ణ వదనంతో చెప్పారు.


ఆ ఐదుగురిలో గౌరవనీయులు, ఆంద్రుల అభిమాన నాయకుడు , అభినవ గాంధి, అపర భగీరధుడు అయిన ముఖ్యమంత్రి గారు వైస్ రాజశేఖరరెడ్డి గారు మరణించినారు. వారికి మా కుటుంబంతరుపున , నా తరుపున అశ్రునివాళి అందిస్తున్నాము.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఆయన కుటుంబసభ్యులకు , యావత్ ఆంద్ర ప్రజలకు సంతాపం తెలియజేసుకుంటున్నాము. నమస్తే.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)