పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడుదిద్దరాని మహిమల దేవకీ సుతుడు
చరణం:
అంతనింత గోల్లేతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసునీ పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృశ్నుడు
రతికేళి రుక్మిణికీ రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము
గతేయె మమ్మూగాచే కమలాక్షుడూ
కాళింగుని తలపై గప్పిన పుశ్యరాగము
యోలేటి శ్రీవెంకటాద్రీ ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయనీ దివ్య రత్నము
బాలునివలే తిరిగే పద్మనాభుడు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.