దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.
ఈ పండుగకు ఈ పది రోజులు పది అవతారాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తారు. రోజు ప్రతి ఇంట్లోను లలితా సహస్త్రమ్ చదువుతారు. బొమ్మలకొలువులు పెడతారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది .త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
ఈ దసరా రోజులలో అమ్మవారి అవతారాలు:
మొదటి రోజు -శైలపుత్రి అవతారం
రెండవ రోజు- బ్రహ్మచారిణి (బాలా త్రిపురసుందరి)
మూడవ రోజు-చంద్రఘంటాదేవి
నాల్గవ రోజు-కూష్మాండాదేవి
ఐదవ రోజు-స్కందమాత
ఆరవ రోజు-కాత్యాయినీదేవి
ఏడవ రోజు-కాళరాత్రీదేవి
ఎనిమిదవ రోజు-మహాగౌరీదేవి
తొమ్మిదవ రోజు-సిధ్ధిదాత్రీదేవి
గానవరాత్రులు అమ్మవారు దర్సనం ఇస్తారు . ఒక్కొక్కప్రదేశంలోను ఒక్కొక్క పేరుతో అమ్మవారిని కొలుస్తారు.కొన్ని ప్రదేశాలలో పార్వతిదేవిని కనకదుర్గగాను,మహాలక్ష్మిగాను, అన్నపూర్ణగాను,బాలాత్రిపుర సుందరిగాను,రాజరాజేస్వరీ దేవిగాను,మహిషాసుర మర్ధినిగాను కొలుస్తారు.
నిన్నటి రోజును శైలపుత్రిగా పూజించారు.
శైలపుత్రి
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.
నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు. ఈమెను బ్రహ్మచారిణి అని అందురు.
బ్రహ్మచారిణి
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.