ప్రజల మనిషి ఇక లేరు
: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరు. హెలికాప్టర్ కూలి,కాలిపోయిన దుర్ఘటనలో ఆయన అసువులు బాసారు. రాష్ట్ర ప్రజల ప్రియతమ నాయకుడు దుర్మరణానికి నల్లమల అడవులు సాక్ష్యంగా నిలచాయి. అత్యంత దురదృష్టకరమైన ఈ సమాచారం తెలిసిన వెంటనే యావత్ ఆంధ్రదేశం దుఖ:సాగరంలో మునిగిపోయింది. కర్నూలుకు సమీపంలోని వెలుగొండ దగ్గరలోని రుద్రకోడూరు కొండపై కూలిపోయిన హెలికాప్టర్ కాలిపోయిందని, అక్కడ అయిదు మృత దేహాలు కనిపించాయని గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరిన సైనిక సహాయ సిబ్బంది కేంద్రానికి సమాచారం అందించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అహ్మద్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో కాంగ్రెస్ నాయకత్వంలో విషాదం అలుముకుంది. కొండపై హెలికాప్టర్ శకలాలు చెదురుమదురుగా పడి ఉన్నాయని, ఐదు మృత దేహాలు పడి ఉన్నాయని అహ్మద్ పటేల్ విషణ్ణ వదనంతో చెప్పారు.
ఆ ఐదుగురిలో గౌరవనీయులు, ఆంద్రుల అభిమాన నాయకుడు , అభినవ గాంధి, అపర భగీరధుడు అయిన ముఖ్యమంత్రి గారు వైస్ రాజశేఖరరెడ్డి గారు మరణించినారు. వారికి మా కుటుంబంతరుపున , నా తరుపున అశ్రునివాళి అందిస్తున్నాము.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఆయన కుటుంబసభ్యులకు , యావత్ ఆంద్ర ప్రజలకు సంతాపం తెలియజేసుకుంటున్నాము. నమస్తే.
do you call this corrupted criminal as Gandhi.. if Gandhi alive, he would have died with shame..
రిప్లయితొలగించండిఅభిమానం వున్నా దానిని వ్యక్తీకరించేప్పుడు బుద్ధీజ్ఞానం వుండాలి. మహాత్మునితో పోల్చడం ఎంతహేయం .ఒకసారి మహాత్ముని జీవితచరిత్రచదువు .
రిప్లయితొలగించండిఆయనకు , ఆయనతోపాటూ చనిపోయిన వారికీ ఆత్మశాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా !
రిప్లయితొలగించండి